బాసే హే నీలా వుండే లక్కు మాకే లేదురా – G.O.A.T (గోట్) నుంచి రిలీజైన లిరికల్ వీడియో
ప్రముఖ హాస్యనటుడు సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం G.O.A.T (గోట్) GreatestOfAllTimes అనేది ఉపశీర్షిక. దివ్యభారతి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మహాతేజ క్రియేషన్స్ అండ్ జైష్ణవ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మాత. ప్రస్తుతం చిత్రం చిత్రీకరణ దశలో వుంది.
కాగా ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన అయ్యో పాపం సారూ.. అనే ఓ బ్యూటిఫుల్ లిరికల్ వీడియో చార్ట్‌బస్టర్‌గా నిలిచి శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి హీరో ఇంట్రడక్షన్ సాంగ్‌గా.. హీరో క్యారెక్టర్ గురించి చెప్పే ‘బాసే హే నీలా వుండే లక్కు మాకే లేదురా.. సెలబ్రిటీ నీకన్న ఎవడురా’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్.
ప్రముఖ గీత రచయిత కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటకు లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించారు. హీరో సుధీర్‌పై చిత్రీకరించిన ఈ పాటను ఇటీవల పుష్ప…పుష్ప.. పుష్పరాజ్ అంటూ పుష్ప-2లోని టైటిల్ సాంగ్‌ని పాడి పాపులరైన దీపక్ బ్లూ ఈ పాటను ఆలపించడం విశేషం. కొరియోగ్రాఫర్ జీతు మాస్టర్ ఈ పాటకు డ్యాన్స్ మూమెంట్స్‌ను అందించారు. వినసొంపైన బాణీలతో, క్యాచీ పదాలతో అందర్ని ఆకట్టుకునే విధంగా వుంది. నిర్మాత మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎనభై శాతం షూటింగ్ పూర్తయింది. టాకీ పార్ట్ దాదాపు పూర్తిచేసుకున్నాం. యాక్షన్ ఏపిసోడ్స్, రెండు పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ వుంది. త్వరలో వాటిని కూడా చిత్రీకరిస్తాం. టెక్నికల్‌గా కూడా చిత్రం ఉన్నతస్థాయిలో వుంటుంది అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్, డీఓపీ: రసూల్ ఎల్లోర్, ఎడిటర్: కె.విజయవర్ధన్, ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్ నాయర్, రచయిత: ఫణికృష్ణ సిరికి, కో ప్రొడ్యూసర్: రవీంద్ర రెడ్డి.ఎన్, క్రియేటివ్ ప్రొడ్యూసర్: ప్రసూన మండవ, రైటర్: ఫణిక్రిష్ణ సిరికిరి, ప్రొడక్షన్ కంట్రోలర్: వీఎన్ రావు, ఫైట్స్: రాబిన్‌సుబ్బు,
Boss Eh’ from ‘G.O.A.T’ is foot-tapping!
‘G.O.A.T’, starring famous comedian Sudheer Anand, is produced by Mogulla Chandrashekar Reddy under the banners Mahateja Creations and Jaishnav Productions. The film features Divya Bharathi as the heroine. Currently in the shooting stage, the movie has already garnered attention with its recently released lyrical video, ‘Ayyo Papam’, which became a chartbuster.
‘Boss Eh’ is the the hero introduction song from the movie. Penned by renowned lyricist Kasarla Shyam and composed by Leon James, the song delves into the hero’s character. It was releaesd today.
It is special that Deepak Blue, who recently sang the title song for ‘Pushpa 2’, has rendered ‘Boss Eh’. The song, picturized on hero Sudheer, was also sung by him. Choreographer Jeethu Master created the dance moves for the song. It impresses with its catchy lyrics and tunes.
The producer stated that eighty percent of the shooting is complete. The talkie portions are nearly finished. There is a balance of action sequences and two more songs to be shot, which will be done soon. “We are putting in the best efforts to make the film the most special one from us. Technically, the film is also of a high standard,” the makers said. ‘G.O.A.T’ will be a milestone in Sudheer’s career.
Crew:
Music Director: Leon James; DoP: Rasool Ellore; Editor: K Vijay Vardhan; Production Designer: Rajeev Nair; Writer: Phani Krishna Siriki; Co-Producer: Ravinder Reddy N; Creative Producer: Prasuna Mandava; Production Controller: VN Rao; Fights: Robin Subbu.