వాసు క్యారెక్టర్ తో ఆడియన్స్ డెఫినెట్ గా కనెక్ట్ అవుతారు – హీరో
గ్రాండ్ గా “గ్యాంగ్ స్టర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ – రేపే సినిమా విడుదల
చంద్రశేఖర్ రాథోడ్, కాశ్వీ కాంచన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా గ్యాంగ్ స్టర్. ఈ చిత్రంలో అభినవ్ జనక్, అడ్ల సతీష్ కుమార్, సూర్య నారాయణ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. వైల్డ్ వారియర్ ప్రొడక్షన్స్ లో రవి, నరసింహా సమర్పణలో చంద్రశేఖర్ రాథోడ్ దర్శకత్వం వహిస్తున్న గ్యాంగ్ స్టర్ సినిమా ఈ నెల 25న గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యంగ్ హీరో ఆకాష్ పూరి అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా
హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ – గ్యాంగ్ స్టర్ సినిమా ట్రైలర్, ఇతర కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ప్రేక్షకులు తప్పకుండా ఈ మూవీకి కనెక్ట్ అవుతారు. టెక్నికల్ గా క్వాలిటీగా మూవీ చేశారు. చంద్రశేఖర్ గారు కథ రెడీ చేసుకుంటే నేను ఆయనతో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. ఫైట్స్, కొరియోగ్రఫీ, ఎడిటింగ్, రచన, నిర్మాత దర్శకత్వం..ఇవన్నీ ఒక్కరే చేయడం ఈజీ కాదు. చంద్రశేఖర్ రాథోడ్ గారు అమేజింగ్ వర్క్ చేశారు. రేపు గ్యాంగ్ స్టర్ సినిమా థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.
నటుడు అభినవ్ జనక్ మాట్లాడుతూ – రెండు గ్యాంగ్స్ మధ్య వార్ ను మా డైరెక్టర్ చంద్రశేఖర్ ఆకట్టుకునేలా డిజైన్ చేశాడు. ప్రతి సీన్ రిచ్ గా ఉంటుంది. ఈ చిత్రంలో నేనొక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాను. గ్యాంగ్ స్టర్ మా అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది. ఈ నెల 25న తప్పకుండా థియేటర్స్ లో మా సినిమా చూడండి. మీరు ఇచ్చే ఫీడ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాం. అన్నారు.
దైవజ్ఞ శర్మ మాట్లాడుతూ – గ్యాంగ్ స్టర్ సినిమా కొత్త కాన్సెప్ట్ తో రూపొందించినట్లు కనిపిస్తోంది. డైరెక్టర్ హీరో ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని అన్ని కమర్షియల్ అంశాలతో రూపొందించారు. అందరినీ ఆకట్టుకునే సినిమా కావాలని కోరుకుంటున్నా. రేపు థియేటర్స్ లోకి వస్తున్న గ్యాంగ్ స్టర్ సినిమాకు మీరంతా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. అన్నారు.
హీరో, దర్శక నిర్మాత చంద్రశేఖర్ రాథోడ్ మాట్లాడుతూ – ఈ రోజు మా గ్యాంగ్ స్టర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన హీరో ఆకాష్ పూరి గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. ఆయన తన బెస్ట్ విశెస్ ను మా టీమ్ కు అందించడం సంతోషంగా ఉంది. సినిమా మీద ప్యాషన్ తో గ్యాంగ్ స్టర్ సినిమాను రూపొందించాను. సినిమా తెరకెక్కించడం, హీరోగా నటించడం నా కల. ఈ చిత్రంతో ఆ డ్రీమ్ నిజమైంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో గ్యాంగ్ స్టర్ చిత్రాన్ని రూపొందించాను. రేపే మా మూవీ థియేటర్స్ లోకి వస్తోంది. మీరంతా సినిమా చూసి ఎలా ఉందో మీ రెస్పాన్స్ తెలియజేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
ఈ కార్యక్రమంలో ఇతర చిత్రబృందం పాల్గొన్నారు.
నటీనటులు
చంద్రశేఖర్ రాథోడ్, కాశ్వీ కాంఛన్, అభినవ్ జనక్, అడ్ల సతీష్ కుమార్, సూర్యనారాయణ, తదితరులు
టెక్నికల్ టీమ్
సమర్పణ – రవి అండ్ నరసింహా
బ్యానర్ – వైల్డ్ వారియర్ ప్రొడక్షన్స్
కెమెరామెన్ – జీఎల్ బాబు
కో డైరెక్టర్.. విజయ్ సారధి
పీఆర్ఓ – శ్రీపాల్ చొల్లేటి
ఫైట్స్, కొరియోగ్రఫీ, ఎడిటింగ్, రచన, నిర్మాత దర్శకత్వం- చంద్రశేఖర్ రాథోడ్