కాలం రాసిన కథలు కు మంచి స్పందన వస్తోంది – ఎం.ఎన్.వి సాగర్
యమ్ యన్ వి సాగర్ స్వీయ దర్శకత్వం లో నిర్మించిన ఆసక్తికరమైన చిత్రం ‘కాలం రాసిన కథలు.’ నూతన నటీనటులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలై అందరినీ అలరించింది. ఈ సినిమా కి హిట్ టాక్ రావడం తో ఈ ఫిలిం యూనిట్ ఈ రోజు సక్సెస్ మీట్ నిర్వహించారు.
దర్శక నిర్మాతలు ఎం.ఎన్.వి సాగర్ మాట్లాడుతూ, “ఈ సినిమా కోసం గత రెండు సంవత్సరాలుగా నేను పని చేస్తున్నాను. సినిమా విడుదక అయ్యాక ప్రేక్షకుల స్పందన బాగుంది. చిన్న సినిమాల్లో మా సినిమా మంచిగా రాణిస్తుంది. మంచి రిలీజ్ ని మాకు అందించినందుకు డిస్ట్రిబ్యూటర్ కి థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సినిమా విజయం నేను తదుపరి చేయబోయే సినిమాల మీద విశ్వాసాన్ని పెంచింది. ఈ సినిమా లో పెద్ద స్టార్స్ లేకున్నా, కొత్త వాళ్ళని కూడా ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఈ చిత్రం లో అన్ని పాత్రలు ప్రేక్షకులకి దగ్గరయ్యాయి. ముఖ్యంగా, కిరాక్ కిరణ్ పాత్ర క్లైమాక్ లో బాగా పండింది. ఈ సినిమా లో చేసిన ముగ్గురు హీరోయిన్స్ కి స్పెషల్ గా థాంక్స్ చెప్తున్నాను. హన్విక తనకి ఇచ్చిన పాత్ర లో అందరినీ మెప్పించింది. ఉమా కూడా అద్భుతమైన నటన కనబరిచి బేబీ సినిమా లో వైష్ణవి ఛైతన్య లాగా, ఆర్ఎక్స్ 100 లో పాయల్ రాజ్పుట్ లాగా మెప్పించింది. రాబోయే వారాల్లో కూడా ఈ సినిమా ఇంకా బాగా ఆడాలని కోరుకుంటున్నాను.” అన్నారు.
హన్విక శ్రీనివాస్ మాట్లాడుతూ, “నేను ఈ చిత్రం లో నవ్య అనే పాత్ర పోషించాను. ఈ పాత్రని చాలా బాగా రాసారు. సాగర్ గారు ఈ పాత్రకి నన్ను ఎంచుకున్నందుకు ఆయనకీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను”. ఇక్కడకొచ్చిన మీడియా వాళ్లందరికీ కూడా థాంక్స్.” అన్నారు.
ఉమా రేచర్ల మాట్లాడుతూ, “ఈ సినిమా లో నా కో-స్టార్స్ అభిలాష్ మరియు శ్రీధర్ నాకు బాగా సపోర్ట్ చేసారు. నేను కొత్త అయినా నన్ను ప్రేక్షకులు ఆదరించినందుకు సంతోషంగా ఉంది.” అని చెప్పారు.
నటుడు వికాస్ మాట్లాడుతూ, “ఈ పాత్ర నాకు దక్కినందుకు చాలా అదృష్టం గా ఉంది. ఈ సినిమా మొదట నా దగ్గరకొచ్చినపుడు నేను చేయగలనో లేదో అనిపించింది కానీ సాగర్ గారు నాకు ధైర్యం ఇచ్చారు. మేమందరం సినిమా విజయం సాధించినందుకు సంతోషంగా ఉన్నాను.” అన్నారు.
Kaalam Raasina Kathalu Success Celebrations
Kaalam Raasina Kathalu, directed and produced by MVN Sagar, premiered in theaters on August 29. The film features a fresh cast, including MVN Sagar, Shruti Shankar, Vikas, Viharika Chaudhary, Abhilash Goguboina, Uma Recharla, Rohit Konda, Hanvika Srinivas, Ravi Teja Bonala, Pallavi Rathore, and Reshma. The makers held a success meet yesterday.
In a recent success event for the film, the cast and crew celebrated its positive response from audiences. The lead actress, Hanvika, expressed her gratitude during the event: “I want to thank all the media people who attended our success meet. Playing the character of Navya has been a wonderful experience. I am grateful to Sagar garu for this opportunity. Words cannot fully express my appreciation for the beautifully portrayed Navya character. I also want to thank the entire team for their hard work.”
Uma Recharla said, “I played the character Radha in this film Kaalam Raasina Kathalu. I thank the director, Sagar garu, for giving me this role. I also want to thank my co-stars Abhilash and Sreedhar garu for making me feel comfortable, even though this is my first film. I am grateful to the entire team and also to the media for being here.”
At a recent success event for the film, MVN Sagar addressed the audience and spoke about the film’s impact. He said, “All the characters in the movie will connect with the audience. Mainly, Kirak Kiran’s character will leave a lasting impression in the climax, showing how a boy in love can cause his parents pain. I also want to thank all three heroines. Generally, parents feel distressed when they can’t provide a dowry, and Hanvika did an excellent job portraying this pain. Another actress, a Telugu girl, performed well beside me. In her role as Radha, Uma is excellent, similar to Vaishnavi Chaitanya in Baby and Payal Rajput in RX100. Our film is running successfully. Although it’s a small film with a slow reach, it has had a good run wherever it has been released without cancellations. We expect it to continue performing well in the coming weeks.”
Vikas said, “I am lucky to do this role and when I was approached for this character first, I was unsure if I could do the film. But Sagar garu filled confidence in me. I am happy that everyone liked the film.”