Mega Supreme Hero Sai Durgha Movie Titled SYG (Sambarala Yetigattu)
కమిటీ కుర్రోళ్లు ను తక్కువ చేసి మాట్లాడితే జనాలే కౌంటర్లు ఇస్తున్నారు – నిహారిక
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. ఈ మూవీ ఆగస్ట్ 9న విడుదలైంది. చిత్రానికి అద్భుతమైన ఆదరణ దక్కింది. ఇంత భారీ విజయాన్ని ఆడియెన్స్ అందించడంతో శనివారం నాడు సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..
నిహారిక మాట్లాడుతూ.. ‘మా చిత్రాన్ని ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్. మా చిత్రాన్ని రమేష్ గారు భుజానికెత్తుకుని నడిపించారు. పెట్టిన ప్రతీపైసా తెరపై కనిపిస్తుందని అంతా అంటున్నారు. వంశీ గారు మా అందరినీ నమ్మి సినిమాను రిలీజ్ చేసినందుకు థాంక్స్. అంకిత్ కొయ్య నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. కథ వినమని అన్నాడు. వంశీ కథను వినాలని తీసుకున్నదే ది బెస్ట్ నిర్ణయం. నాకంటే ఎక్కువగా అంకిత్, రమేష్ గారు ఈ కథను నమ్మారు. మాతో పాటు సపోర్ట్‌గా నిలిచిన అంకిత్‌కు థాంక్స్. మంచి చిత్రాన్ని తీస్తే సరిపోదు. అది జనాల వరకు వెళ్లాలి. అలా జనాల వరకు తీసుకెళ్లిన మీడియాకు థాంక్స్. ఇది పీపుల్స్ సినిమా అయింది. ఈ మూవీని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే జనాలే కౌంటర్లు ఇస్తున్నారు. ఇంత మంచి చిత్రాన్ని తీసినందుకు మా అందరికీ గర్వంగా ఉంది’ అని అన్నారు.
నిర్మాత జయ అడపాక మాట్లాడుతూ..‘మా కమిటీ కుర్రోళ్లు చిత్రానికి మీడియా ముందు నుంచీ సపోర్ట్‌గానే ఉంటోంది. మంచి కంటెంట్‌తో ముందుకు వస్తే ఆదరిస్తామని తెలుగు ఆడియెన్స్ మళ్లీ నిరూపించారు. సినిమాను హిట్ చేసిన ప్రతీ ఒక్కరికి థాంక్స్. టీంకు కంగ్రాట్స్’ అని అన్నారు.
దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ.. ‘మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నాలుగేళ్ల క్రితం ఈ ప్రయాణం మొదలైంది. సక్సెస్ అనే పదం వినడానికి మూడున్నరేళ్లు పట్టింది. కమిటీ కుర్రోళ్లు సినిమాను ఆడియెన్స్ ముందుకు తీసుకు రావడానికి నిహారిక గారు, పద్మజ గారు.. జయ గారు కారణం. వీళ్లే మా సక్సెస్‌కు కారణం. నిహారిక గారు చాలా స్ట్రాంగ్ ఉమెన్. ఈ సినిమాను నిర్మించేందుకు చాలా మంది భయపడ్డారు. కానీ నిహారిక గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ఈ మూవీని చూసిన వాళ్లు మలయాళీ చిత్రమని అంటున్నారు. కానీ నిహారిక లాంటి నిర్మాతలు ఉంటే.. ఇలాంటి చిత్రాలు తెలుగులోనే ఇకపై వస్తాయి. ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన నా ఫ్యామిలీ, బ్రదర్స్‌కు థాంక్స్. దీపక్ సరోజ్, అంకిత్ కొయ్యలకు థాంక్స్. కమిట్మెంట్ ఉన్న టీం నాకు దొరికినందుకు ఎంతో అదృష్టవంతుడ్ని. నేను రాసుకున్న దాని కంటే.. చాలా ఎక్కువగా చూపించారు రాజు. ఆయన కెమెరా పనితనం, ఫ్రేమింగ్, లైటింగ్ అద్భుతంగా వచ్చింది. రాజు గారితో మళ్లీ సినిమా చేయాలని ఉంది. అన్వర్ గారు పూర్తిగా మాతోనే ఉండి.. ప్రతీ ఫ్రేమ్‌ని అద్భుతంగా ఎడిట్ చేశారు. జేడీ మాస్టర్ చివరగా టీంలోకి వచ్చినా.. పాటల్ని అద్భుతంగా కంపోజ్ చేశారు. విజయ్ మాస్టర్ గారి ఫైట్స్, ఇంటర్వెల్ బ్లాక్ గురించి ప్రతీ ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. డీటీఎస్ మిక్సింగ్ రాధా కృష్ణ, సాయి మణిందర్ గారి సౌండింగ్‌కు ప్రశంసలు వస్తున్నాయి. సుభాష్, కొండల్రావ్ రైటింగ్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రణయ్ నయని, విష్ణు ప్రొడక్షన్ డిజైనింగ్ వల్లే మూడు జనరేషన్స్ని తెరపై చూపించాం. నా డైరెక్షన్ టీంకు థాంక్స్. వాళ్లంతా చాలా కష్టపడ్డారు. భూపాల్ రావు, సిరి క్యాస్టూమ్స్‌లో తేడా చూపించారు. మూడు జనరేషన్స్‌లోని తేడాని చూపించారు. అనుదీప్ పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ప్రతీ ఒక్క ఆర్టిస్ట్ అద్భుతంగా నటించాడని చెబుతున్నారంటే నాకు ఎంతో ఆనందమేసింది. ప్రతీ ఒక్క పాత్రకు.. ఆడియెన్స్ కనెక్ట్ అవుతున్నారు. మూడేళ్ల పాటు వీళ్లంతా నాతోనే ఉన్నారు. వాళ్ల కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చింది. ఈ క్రెడిట్ అంతా వీళ్లదే. పాత్ర చిన్నదే అయినా లేడీ ఆర్టిస్టులు అద్భుతంగా చేశారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ గారు లేకపోతే ఈ సినిమా ఇలా వచ్చి ఉండేది కాదు. సినిమా తీయడం గొప్ప కాదు.. మా అందరినీ ఎంకరేజ్ చేసే నిర్మాతలే గొప్ప. మమ్మల్ని నమ్మి ఇంత డబ్బులు పెట్టిన నిర్మాతలకు థాంక్స్. మా అందరినీ ఎంకరేజ్ చేస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.
అంకిత్ కొయ్య మాట్లాడుతూ.. ‘కమిటీ కుర్రోళ్లు మూడేళ్ల క్రితం మొదలైంది. కథ విన్న వెంటనే నాకు తెలిసిన నిర్మాత వద్దకు తీసుకెళ్లాను. అలా తిరిగి తిరిగి నిహారిక గారి వద్దకు కథ వచ్చింది. ఈ చిత్రం మీద నమ్మకం కంటే భయం ఎక్కువగా ఉండేది. ఒక వేళ ఇది సక్సెస్ కాకపోయి ఉంటే.. ఇలాంటి ప్రయోగం ఇంకెవ్వరూ చేయకపోయేవాళ్లు. కొత్త వాళ్లను పెట్టి తీయాలనుకునే నిర్మాతలు భయపడేవాళ్లు. సినిమాలో నటించిన ఈ కొత్త వాళ్లందరికీ అడగక ముందే పేమెంట్లు వచ్చాయి. ఇలాంటి చిత్రాన్ని హిట్ చేయకపోయి ఉంటే ఇంకెవ్వరూ ఇలాంటి సాహసాలు అయితే చేసి ఉండేవారు కాదు. సినిమా ముందుకు తీసుకొచ్చిన వంశీ గారికి థాంక్స్. ఈ మూవీ టీంని, సినిమా చూస్తుంటే గర్వంగా ఉంది’ అని అన్నారు.
Niharika Konidela proud of “Committee Kurrollu”
At the grand victory celebration of Committee Kurroll*, presented by Niharika Konidela and produced under the banners of Pink Elephant Pictures LLP and Sriradha Damodar Studios, the cast and crew came together to express their joy and gratitude. The film, directed by Yadu Vamsi, was released on August 9th and has received an overwhelming response from the audience.
During the event, Niharika Konidela shared her heartfelt thanks: “We are incredibly grateful to the audience for their immense support. This film, directed by Vamsi Garu, has truly captured the essence of every penny invested. I must thank Vamsi Garu for believing in us and ensuring the movie’s release. Special thanks to Ankit Koya, who introduced me to this story. Listening to Vamsi’s narrative was one of the best decisions I’ve made. Ankit and Ramesh believed in this story even more than I did. It’s not just about making a good film; it’s about reaching the masses, and for that, we owe a huge thanks to the media. This film has become a people’s movie, and we are all proud to have been a part of it.”
Producer Jaya Adapaka added, “Our committee has supported Kurrollu from the start, and the Telugu audience has once again shown that they appreciate good content. We extend our gratitude to everyone who contributed to the film’s success. Congratulations to the entire team.”
Director Yadu Vamsi reflected on the journey, saying, “This project began four years ago, and after three and a half years of hard work, we’ve finally heard the word ‘success.’ I owe this to Niharika Garu, Padmaja Garu, and Jaya Garu, who made sure this film reached the audience. Niharika is a remarkable woman; she never compromised on quality, even when others were hesitant to take on this project. Some have said this film feels like a Malayalam movie, but with producers like Niharika, such films will thrive in Telugu cinema from now on. I also want to thank my family, the incredible cast and crew, and especially Raju, whose cinematography exceeded my expectations. Anwar’s editing was exceptional, and Jedi Master’s music brought the film to life. Vijay Master’s action sequences, especially the interval block, have been widely praised, along with Radha Krishna and Sai Maninder’s DTS mixing. Subhash and Kondalrao’s writing resonated strongly with the audience, and Pranay Nayani and Vishnu’s production design beautifully showcased three generations. My direction team worked tirelessly, and the costumes by Bhupal Rao and Siri perfectly captured the generational differences. Anudeep’s songs have been a hit, and I am thrilled with the performances of every artist. Their dedication over the past three years has paid off, and the audience’s connection with each character is evident. This success belongs to them all. Thanks to our executive producer, Ramesh, without whom this film wouldn’t have been possible. It’s not just about making a film; it’s about having producers who anchor us and believe in our vision. Thank you to the audience for supporting us all.”
Ankit Koyya also shared his thoughts: “Three years ago, Committee Kurrollu began its journey. I immediately recognized its potential and brought it to a producer I knew. Eventually, it found its way back to Niharika. There was more fear than confidence in this project, and if it hadn’t succeeded, no one would have dared to attempt something like this again. Producers often hesitate to hire new talent, but in this case, every newcomer was paid even before asking. If this film hadn’t been a hit, such risks would have been avoided by others. I am incredibly proud of this team and the film we’ve created.”
“Committee Kurrollu” brought together a captivating blend of seasoned actors and fresh faces, creating a dynamic and engaging cinematic experience. Veteran performers Sai Kumar, Goparaju Ramana, and Srilakshmi anchored the film with their seasoned presence, bringing gravitas and depth to their roles. Meanwhile, a talented ensemble of newcomers including Sandeep Saroj, Yashwanth Pendyala, Eshwar Rachiraju, Trinadh Varma, Prasad Behara, Manikanta Parasu, Lokesh Kumar Parimi, Shyam Kalyan, Raghuvaran, Shiva Kumar Matta, Akshay Srinivas, Raadhya, Tejaswi Rao, Teena Sravya, Vishika, Shanmukhi Nagamanturi, Balagam Jayaram, and Kacherapalem Kishore delivered captivating performances, showcasing their raw talent and leaving a lasting impression on audiences.
The film’s soundtrack, composed by Anudeep Dev, seamlessly complemented the narrative, with thumping background music adding energy and soul-stirring tunes enhancing the emotional impact of the story. Raju Edurolu’s masterful cinematography captured the scenic beauty of the Godavari region, transporting viewers into the heart of the narrative and creating a visually stunning backdrop.
Distributor Vamsi Nandipati ensured a spectacular release, maximizing the film’s reach by securing a wide theatrical presence. This allowed audiences to fully immerse themselves in the magic of “Committee Kurrollu” on the big screen, providing a seamless and uninterrupted viewing experience.
The success meet served as a celebration of the film’s success, but also as a powerful message about the importance of creativity, collaboration, and unwavering faith in a project’s potential. The team’s passion and dedication were evident in the celebration, and “Committee Kurrollu” emerged as a testament to the power of storytelling and the enduring appeal of quality content.