అనాధ – నవంబర్ 28న విడుదల
గోనేంద్ర ఫిలిమ్స్ పతాకంపై శ్రీ ఇంద్ర ,నికిత స్వామి, యుక్త పెర్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ “అనాధ”. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా చిత్ర హీరో కం నిర్మాత శ్రీ ఇంద్ర మాట్లాడుతూ, ఇది ఒక మంచి కమర్షియల్ యాక్షన్ అడ్వెంచర్ త్రిల్లర్. ఈ చిత్రంలో యూత్‌కి కావలసిన అన్ని అంశాలు ఉంటాయి. పర్టిక్యులర్ గా మ్యూజికల్ గా ఈ చిత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో ఒక యూత్ కే కాకుండా సకుటుంబ సపరివార సమేతంగా చూసే విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దడం జరిగింది. అన్ని హంగులతో ఈ చిత్రాన్ని ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. ఈ చిత్రాన్ని చూసి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం” అని అన్నారు.
శ్రీ ఇంద్ర, నికితా స్వామి, యుక్త పెర్వి,అశ్విని యశ్వంత్, శోభరాజ్,హన్నవల్లి కృష్ణ, కిచ్చా, సిద్దు కమిడియన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
బ్యానర్: గోనేంద్ర ఫిలిమ్స్,
కెమెరా: వీరేష్ కుమార్,
ఎడిటర్: మారుతీ రావు,
పి ఆర్ ఓ: బి. వీరబాబు,
స్క్రీన్ ప్లే: నండూరి వీరేష్
కథ,మ్యూజిక్, ప్రొడ్యూసర్: శ్రీ ఇంద్ర
డైరెక్టర్: అన్నాసేట్ కె. ఏ.