Udaya Bhanu as a Vakili Padma From “Tribanadhari Barbarik”
It is known that the movie ‘Tribanadhari Barbarik’ is coming based on the role of Barbharik (Barbaric), grandson of Bhima and son of Ghatotkachu. Mohan Srivatsa directed this movie produced by Vijayapal Reddy Adidhala under star director Maruthi presenting it. With the recent release of the motion poster of the film, which was made on the Vanara celluloid banner, the expectations have been increased.
Recently, a fresh update has been released by the makers. The stunning poster of Udaya Bhanu from the movie has been released. Udaya Bhanu played the role of Vakili Padma and the poster gives a treat with the swag, the attitude and the way she posed was stunning. Looks like Udaya Bhanu got a good role after many years. Currently, the film unit is busy with post-production works. The release date of this movie will be announced soon. Henceforth film unit is to release exciting updates in the coming days.
Sathyaraj, Vashishta N Simha, Sanchi Roy, Satyam Rajesh, Kranti Kiran, VTV Ganesh, Motta Rajendra, Udhayabhanu are playing key roles in this film. Kushender Ramesh Reddy is the cinematographer, Marthand K Venkatesh is the editor and Srinivas Punna is the art director for this movie. Action scenes are supervised by Ram Sunkara.
Cast: Sathyaraj, Vashishta N Simha, Sanchi Roy, Satyam Rajesh, Kranti Kiran, VTV Ganesh, Motta Rajendra, and Udaya Bhanu.
Technical Team
Banner : Vanara Celluloid
Written & Directed by : Mohan Srivatsa
Producer : Vijayapal Reddy Adidala
Presented by : Maruti Team Product
DOP : Kushender Ramesh Reddy
Music : Infusion Band
Editor : Marthand K Venkatesh
Art Director : Srinivas Punnas
Fights: Ram Sunkara
Costume Designer : Mahi Derangula
PRO : Sai Satish
ఆకట్టుకునేలా ‘త్రిబాణధారి బార్బరిక్’ నుంచి ఉదయ భాను కారెక్టర్ పోస్టర్
భీముడు మనవడు, ఘటోత్కచుడు కుమారుడు బార్భరిక్ (బార్బరికుడు) పాత్రను ఆధారంగా తీసుకుని ‘త్రిబాణధారి బార్బరిక్’ అనే చిత్రం రాబోతోంది. స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా విజయపాల్ రెడ్డి ఆదిధాల నిర్మించిన ఈ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద తెరకెక్కించిన ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేయడంతో ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి.
తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ వదిలారు. ఉదయ భాను పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి మరింత హైప్ పెంచేశారు. వాకిలి పద్మ అనే పాత్రను ఉదయ భాను పోషించారు. ఇక ఆమె పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను చూస్తుంటే.. ఆ స్వాగ్, యాటిట్యూడ్, కుర్చీలో కూర్చున్న తీరు అన్నీ కూడా కొత్తగా ఉన్నాయి.
చాలా ఏళ్ల తరువాత ఉదయ భానుకి మంచి పాత్ర పడ్డట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఇకపై ఇలానే సర్ ప్రైజింగ్ అప్డేట్లతో ఆడియెన్స్‌ను చిత్రయూనిట్ అలరించనుంది.
ఈ చిత్రంలో సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, వీటీవీ గణేష్, మొట్టా రాజేంద్ర, ఉధయభాను కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ మూవీకి సినిమాటోగ్రఫర్‌గా కుశేందర్ రమేష్ రెడ్డి, ఎడిటర్‌గా మార్తాండ్ కె వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్‌గా శ్రీనివాస్ పున్న బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలను రామ్ సుంకర పర్యవేక్షిస్తున్నారు.
తారాగణం: సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, VTV గణేష్, మొట్టా రాజేంద్ర, మరియు ఉధ్యభాను
సాంకేతిక బృందం
బ్యానర్ : వానర సెల్యూలాయిడ్
రచన & దర్శకత్వం : మోహన్ శ్రీవత్స
నిర్మాత : విజయపాల్ రెడ్డి ఆదిదల
సమర్పణ : మారుతీ టీమ్ ప్రోడక్ట్
డీఓపీ : కుశేందర్ రమేష్ రెడ్డి
సంగీతం : ఇన్ఫ్యూషన్ బ్యాండ్
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
ఆర్ట్ డైరెక్టర్ : శ్రీనివాస్ పున్నాస్
ఫైట్స్ : రామ్ సుంకర
కాస్ట్యూమ్ డిజైనర్ : మహి డేరంగుల
PRO : సాయి సతీష్