ఘనంగా టాలీవుడ్ దాసరి ఫిల్మ్ అవార్డ్స్ 2026 ప్రధానోత్సవం
దర్శక రత్న శ్రీ దాసరి నారాయణరావు గారి జయంతి సందర్భంగా 4/5/2026 తేదీన రవీంద్ర భారతి లోని పైడి జయరాజు థియేటర్లో టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ అసోసియేషన్ మరియు రెయిన్బో చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ సంయుక్తంగా నిర్వహించిన దాసరి Film అవార్డ్స్ ప్రధానోత్సవం ఘనంగా జరిగినది అనేకమైన లఘు చిత్రాలు ఫీచర్ ఫిలిమ్స్ మరియు ఎంట్రీలుగా రావడం జరిగినది ఉత్తమమైన వాటిని బహుమతులకు ఎంపిక చేసామని నిర్వాహకులు శ్రీ కె మోహన్ గారు తెలియజేశారు 1.30 నుండి వాటిని ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి విశ్రాంత తాసిల్దార్ శ్రీ బిక్కవల్లి సత్యానందం గారు దర్శకులు మహేష్ చంద్ర ముఖ్య అతిథులుగా విచ్చేశారు దర్శకుడు దొరై రాజుగారు ఆత్మీయ అతిథిగా విచ్చేశారు తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ డైరెక్టర్శ్రీ ఏనుగు నరసింహారెడ్డి గారు విశిష్ట ఆతిథిగా విచ్చేయడం సంతోషదాయకం ప్రముఖ నటులు శ్రీ ఘర్షణ శ్రీనివాస్ గారు సౌమిత్ మీడియా నిర్వహకులు శ్రీ వంశీ గుప్తా గారు నటుడు ఫణీంద్ర ప్రసాద్ గారు విచ్చేయడం ముదావహం ఉత్తమ లఘుచిత్రం గా సైబర్ శ్రావరి ఎంపికయింది నిర్మాత నీలిమ ఈ అవార్డును అందుకున్నారు ఉత్తమ లఘు చిత్ర దర్శకుడుగా మరియు ఉత్తమ గీత దర్శకుడుగా రామడుగు వసంత్ ఎంపికయ్యాడు ఉత్తమ నటుడు గా ఎల్ అశోక్ రెడ్డి గారు ఓ తండ్రి కథ చిత్రానికి బహుమతిని అందుకున్నారు కర్మయోగి శ్రీధర్మవ్యాధుడి చరిత్ర చిత్ర దర్శకుడు శ్రీ జి జే రాజా గారు ఉత్తమ డివోషనల్ డైరెక్టర్ అవార్డు అందుకున్నారు విశాఖపట్నం నుంచి విచ్చేసిన బాలలు చేసిన నృత్యాలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి ఈ నృత్య కార్యక్రమాన్ని పర్యవేక్షించిన శైలా భవాని గారిని అందరూ అభినందించారు శ్రీ ఏనుగు నరసింహారెడ్డి గారు మాట్లాడుత శ్రీ దాసరి ఫిలిం అవార్డ్స్ కార్యక్రమానికి రావడం చాలా సంతోషదాయకమని శ్రీ మోహన్ గారి కృషికి తన ప్రోత్సాహం ఎల్లవేళలా ఉంటుందని ఆయన తెలియజేశారు బాల నటుల్ని తీర్చిదిద్దడంలో శ్రీ మోహన్ గారు కృషికి అభినందనలు తెలియజేశారు శ్రీ ఘర్షణశ్రీనివాస్ గారు.. శ్రీ బిక్కవల్లి సత్యానంద్ గారు అందరికీ తన ఆశీస్సులు తెలియజేశారు ఈ ముగ్గురు ప్రముఖులు విజేతలకు బహుమతులు అందజేయడం సంతోషదాయకం ఈ కార్యక్రమం అత్యంత జనరేంజకంగా వినోదాత్మకంగా ప్రోత్సాహకరంగా ఉన్నదని వీక్షకులు కొనియాడారు శ్రీ దాసరి ఫిలిం అవార్డ్స్ కార్యక్రమాన్ని ప్రత్యేక శైలిలో రూపొందించిన దర్శకుడు శ్రీ K మోహన్ గారిని ప్రతి ఒక్కరూ ప్రశంసిం చారు ఈ ముచ్చటైన కార్యక్రమానికి కోఆర్డినేటర్ గా శివ శేషగిరిరావు మరియు యాంకర్ గా వైష్ణవి వ్యవహరించారు.