K-Ramp 3rd Single Tikkal Tikkal.. Released -Grand Theatrical Release on

Surya Balaji Delighted with Recognition as DOP for Little Hearts
Surya Balaji Shines as DOP in “Little Hearts”
The recently released family entertainer Little Hearts, starring Mouli Tanuj and Shivani Nagaram, has emerged as a surprise box-office success. While the performances and storytelling have won praise, much of the appreciation has been directed toward the film’s cinematography. Making his debut as Director of Photography, Surya Balaji has impressed both audiences and industry insiders with his visual storytelling.
Despite being mounted on a modest budget of ₹2.5 crore, Little Hearts looks like a film made on four times that scale. This visual richness is largely credited to Surya Balaji’s creative camera work. By adopting a guerrilla-style shooting technique across Hyderabad and Bengaluru, he elevated the film’s appeal using natural locations and close-up shots of the actors. Instead of relying on elaborate sets, Balaji focused on capturing raw emotions and natural atmospheres, lending the movie a distinctly realistic yet engaging texture.
Speaking about the response, Surya Balaji said he is overwhelmed to see packed shows not only in urban centers but also in B and C centers. “I never expected this level of recognition for my first film. The response has been beyond my imagination, and I feel truly happy,” he shared.
What makes Little Hearts stand out is its balance—it steers away from being either a full-on commercial spectacle or an overly realistic drama. Instead, director Sai Marthand has delivered a dialogue-driven, wholesome family entertainer that resonates across generations. Surya Balaji’s lens has played a key role in bringing that vision alive on screen, proving that even with a compact budget, impactful visuals can elevate storytelling to the next level.
With Little Hearts, Surya Balaji has made a memorable debut as a cinematographer. The industry and audiences alike are now looking forward to what this talented DOP will bring to his future projects.
“లిటిల్ హార్ట్స్” సినిమాతో డీవోపీగా మంచి గుర్తింపు దక్కడం హ్యాపీగా ఉంది – సూర్య బాలాజీ
మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన “లిటిల్ హార్ట్స్” సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణతో పాటు సెలబ్రిటీల ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ సినిమాకు వస్తున్న అప్రిషియేషన్స్ లో డీవోపీ వర్క్, బ్యూటిఫుల్ విజువల్స్ గురించి మాట్లాడుతున్నారు. సూర్య బాలాజీ ఈ చిత్రంతో సినిమాటోగ్రాఫర్ గా పరిచయమయ్యారు. తన తొలి చిత్రంతోనే ప్రేక్షకుల్ని కెమెరా పనితనంతో ఆకట్టుకున్నారు.
డీవోపీ పనితనం మీదే సినిమా బడ్జెట్ ఆధారపడి ఉంటుంది. లిటిల్ హార్ట్స్ చిత్రాన్ని కాంపాక్ట్ బడ్జెట్ లో రిచ్ లుక్ లో తెరకెక్కేలా చేయడంలో సూర్య బాలాజీ ప్రతిభ చూపించారు. 2.5 కోట్ల రూపాయల బడ్జెట్ లో చేసిన లిటిల్ హార్స్ట్ సినిమా తెరపై చూస్తే ఓ పది కోట్ల రూపాయల బడ్జెట్ మూవీలా అనిపిస్తుంది. అలాంటి రిచ్ లుక్ తన కెమెరా పనితనంతో తీసుకొచ్చారు సూర్య బాలాజీ. హైదరాబాద్, బెంగళూరులో ఈ సినిమాను గెరిల్లా పద్ధతిలో షూట్ చేశారు. లొకేషన్స్ ను కాకుండా కేవలం నటీనటుల క్లోజప్స్ తోనే ఎలివేట్ చేశారు. ప్రతి సీన్ సహజంగా ఉండేలా క్యాప్చర్ చేశారు. లిటిల్ హార్ట్స్ మూవీని చాలా రియలెస్టిక్ గా తన కెమెరా లెన్స్ లో చూపించారు సూర్య బాలాజీ.
లిటిల్ హార్ట్స్ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందని, బీ, సీ సెంటర్స్ లో కూడా థియేటర్స్ హౌస్ ఫుల్స్ కావడం నమ్మలేకపోతున్నామని సూర్య బాలాజీ అంటున్నారు. ఈ చిత్రానికి తనకు ఆశించిన దానికంటే ఎక్కువ గుర్తింపు రావడం హ్యాపీగా ఉందన్నారు. కంప్లీట్ కమర్షియల్ గా కాకుండా, కంప్లీట్ రియలెస్టిక్ గా కాకుండా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ఒక డైలాగ్ బేస్డ్ హోస్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించినట్లు సూర్య బాలాజీ చెప్పారు.