Sundeep Kishan Unveiled Announcement Poster Of Attitude Star Chandrahass’s New

Sundeep Kishan Unveiled Announcement Poster Of Attitude Star Chandrahass’s New Film, Title & Glimpse For Birthday
Attitude Star Chandrahass made his mark with his previous movies, where he played distinctive roles. Barabar Premistha will be his next outing, and the movie already generated curiosity with its promotional material. The actor who is picking his films cleverly signed another interesting film. The new movie was announced officially with hero Sundeep Kishan unveiling a poster. Helming the story, screenplay, and direction is Jairam Chitikela, while it is bankrolled by PVK Productions.
The poster sets the tone for a story charged with intensity and patriotism. With a poster design blending iconic symbols- the 5 Rupees coin, a menacing ring of bullets, and the vibrant Indian tricolour, the film promises to be much more than a routine action spectacle. It’s set to celebrate heroism rooted in the spirit of India.
Every element in the poster reverberates with patriotic fervor. The rain-soaked backdrop, the battered chain, and the gleam of bullets fuse to create an atmosphere charged with nationalist energy and rebellion. It suggests that the core story will revolve around defending values, standing tall against adversity, and uniting under the national banner.
As announced by the makers, the title and glimpse of the movie will be revealed on September 17th, on the occasion of the birthday of Chandrahass.
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నూతన చిత్రం కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేసిన సందీప్ కిషన్.. బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 17న టైటిల్, గ్లింప్స్ రిలీజ్*
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ మొదటి చిత్రంలోనే తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు ‘బరాబర్ ప్రేమిస్తా’ అంటూ ఆడియెన్స్‌ను మరోసారి మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే వదిలిన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు చంద్రహాస్ నూతన చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది.
ఈ మేరకు సందీప్ కిషన్ ఈ కొత్త చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కాన్సెప్ట్ పోస్టర్ చూస్తుంటే ఇదేదో రెగ్యులర్ కమర్షియల్ చిత్రంలా కనిపించడం లేదు. ఈ కథలో దేశ భక్తికి సంబంధించిన అంశాల్ని కూడా జోడించినట్టుగా అనిపిస్తోంది. ఐదు రూపాయల బిళ్ల, వాటి చుట్టూ ఉన్న బుల్లెట్లు, పోస్టర్‌ను డిజైన్ చేసిన తీరు చూస్తుంటే మంచి పవర్ ఫుల్ స్టోరీతోనే సినిమా రాబోతోందని అర్థం అవుతోంది.
జైరామ్ చిటికెల ఈ మూవీకి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రాన్ని పివికె ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. చంద్రహాస్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 17న ఈ మూవీకి సంబంధించిన టైటిల్, గ్లింప్స్‌ను రిలీజ్ చేయబోతోన్నారు.