Sharwanand Journey – Re-Release on September 21
As we all know, the film Journey starring Sharwanand, Ananya, Jai, and Anjali, which was released in theaters on December 16th in 2011 was a big blockbuster at the box office. Like the Tamil version, the Telugu dubbed version also turned out to be a critically acclaimed and commercially hit. The movie’s songs captivated the youth of that time and the way it presented two parallel love stories charmed everyone. Now, this magical love story is set for re-release through Lakshmi Naarasimha Movies.
Currently, there is a trend of re-releases in Tollywood, and Journey is set to be re-released on September 21st. A new poster has been unveiled as part of the announcement. After almost twelve years, the film is coming back to audiences. Supriya Srinivas is bringing the movie again for the Telugu audience. The bookings have already opened.
Journey was a heart-touching, emotional movie. It will be interesting to see how this film appeals to today’s audience and how nostalgic it will be for the viewers from back then. According to the trends on Book My Show, bookings are already picking up pace.
సెప్టెంబర్ 21న రీ రిలీజ్కు సిద్దమైన ‘జర్నీ’
శర్వానంద్, అనన్య, జై, అంజలి ప్రధాన పాత్రల్లో వచ్చిన జర్నీ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలుసు. తమిళ్ డబ్బింగ్ మూవీగా తెలుగు ఆడియెన్స్ ముందుకు వచ్చింది. 2011 డిసెంబర్ 16న థియేటర్లలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. జర్నీ పాటలు అప్పటి కుర్రకారుని కట్టి పడేశాయి. రెండు ప్రేమ కథలు సమాంతరంగా చూపించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు నాటి మ్యాజికల్ లవ్ స్టోరీని లక్ష్మీ నరసింహ మూవీస్ మళ్లీ తెరపైకి తీసుకొస్తోంది.
అసలే టాలీవుడ్లో ప్రస్తుతం రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 21న జర్నీ మూవీని రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. దాదాపు పన్నెండేళ్ల తరువాత మళ్లీ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సుప్రియ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ సినిమా రీ రిలీజ్ కాబోతోంది. ఆల్రెడీ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి.
హార్ట్ టచ్చింగ్ ఎమోషనల్ మూవీగా వచ్చిన జర్నీ మూవీ తెలుగులో భారీ బ్లాక్బాస్టర్ అయింది. మరి ఇప్పుడు ఈ సినిమా ఇప్పటి ఆడియెన్స్ ఎలా ఆకట్టుకుంటుందో.. అప్పటి ఆడియెన్స్కు ఎంతలా నోస్టాల్జిక్ ఫీలింగ్ ఇస్తుందో చూడాలి. ఆల్రెడీ బుకింగ్స్ జోరందుకున్నాయని బుక్ మై షో ట్రెండ్ చూస్తే తెలుస్తోంది.