Sensational Singer Mangli gets rare honor in Delhi
Mangli is the most happening singer and she doesn’t need much introduction to Telugu people. She has become a sensation with her distinctive voice. Initially starting with private songs, she has now carved a niche in the Telugu film industry, particularly in folk, devotional, and item songs. Mangli’s versatility shines through in every track, appealing to both mass and class audiences. She quickly rose to prominence, becoming a star singer with a steady stream of offers.
In addition to her singing career, she has a popular YouTube channel where she shares various songs, further solidifying her fan base. Over the years, Mangli has made a mark in Tollywood with hits like the “Royal Enfield” song in George Reddy, “Ramulo Ramula” in Ala Vaikunthapurramlo, and “Sarangadariya” in Love Story, among others. Her songs continue to be well-received, making her a sought-after singer for filmmakers.
In recognition of her musical achievements, Mangli was recently honored with the prestigious ‘Ustaad Bismillah Khan’ Yuva Puraskar 2024 by the Sangeet Natak Akademi. She received the award in a special ceremony in New Delhi, alongside notable figures. Satyavati Chauhan, better known as Mangli, is undoubtedly an inspiration for young girls, continuing to grow and excel in her career.
సింగర్ మంగ్లీకి అరుదైన గౌరవం
తెలుగు వారికి మంగ్లీ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సింగర్ గా బాగా పాపులర్ అయ్యింది.. తన ప్రత్యేకమైన గొంతుతో అందరిని ఆకట్టుకుంటుంది. ముందు ప్రైవేట్ సాంగ్స్ తో మొదలుపెట్టిన ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినీ ఇండస్ట్రీలో మంగ్లీ హవా సాగుతోంది. ఫోక్, డివోషనల్, ఐటెం సాంగ్స్ కి ఆమె పెట్టింది పేరు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా ప్రతి సాంగ్ లో తన మార్క్ చూపిస్తుంది.. సింగర్ అయ్యాక వరుస ఆఫర్స్ తో స్టార్ సింగర్ అయింది. ఇక మంగ్లీకి సొంతగా యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో రకరకాల పాటలను పాడుతూ క్రేజ్ సొంతం చేసుకుంది.. గత కొన్నేళ్లుగా మంగ్లీ టాలీవుడ్ లో సత్తా చాటుతుంది. జార్జి రెడ్డి మూవీలోని రాయల్ ఎన్ఫీల్డ్ సాంగ్ మంగ్లీకి మంచి పేరు తెచ్చింది. అనంతరం అల వైకుంఠపురంలో రాములో రాములా, లవ్ స్టోరీ చిత్రంలోని సారంగదరియాతో పాటు అనేక సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆమె తో పాడించిన పాటలు జనాలను తెగ ఆకట్టుకుంటున్నాయి.. దాంతో సినీ దర్శకులు ఆమెతో పాట పాడించాలని ఫిక్స్ అవుతున్నారు. సంగీత ప్రపంచంలో ఆమె అందుకున్న విజయాలకు గానూ ఇటీవలే సంగీత నాటక అకాడమీ నుంచి ‘ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్’ యువ పురస్కారానికి ఎంపికైంది. ఆమె ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అతిరథ మహారధుల సమక్షంలో అందుకున్నారు. అంచెలంచెలుగా ఎదుగుతున్న సత్యవతీ చౌహాన్ అలియాస్ మంగ్లీ ఆడబిడ్డలందరికీ ఆదర్శంగా నిలుస్తున్నది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.