
Rashmika was the only choicefor The Girlfriend – Allu Aravind
National crush Rashmika Mandanna and talented actor Dheekshith Shetty star together in The Girlfriend, presented by Allu Aravind under the banners of Geetha Arts and Dheeraj Mogilineni Entertainment. Directed by Rahul Ravindran, the film is an intense and emotional love story produced by Vidya Koppineedi and Dheeraj Mogilineni. This fresh and unique love story is set for a grand worldwide theatrical release on November 7 in Telugu, Hindi, Tamil, Malayalam, and Kannada languages. The trailer launch event was held grandly in Hyderabad.
Cinematographer Krishnan Vasant said, “Working with the team of The Girlfriend has been truly inspiring. We’re bringing an intense and passionate story to the screen. I hope everyone supports our movie and spreads the word about it.”
Director Rahul Ravindran said, “The idea for this story came to me when I was a student living in a hostel. I wrote it down a few years ago. What you saw in the trailer is exactly what the film is – intense and emotional. People who are in or want to be in relationships will connect deeply with it. Both men and women will walk out of the theater feeling those emotions strongly. The movie is real, rooted, intense, and emotional. My entire team worked with great passion. Dheekshith and Rashmika gave life to the story with their performances. Getting such actors is every director’s blessing. I truly enjoyed watching their performances from behind the monitor. I’m happy to be the film’s first audience. I’ve also played a small role in it. This is not a regular love story; we’ve genuinely tried to tell a heartfelt story. We hope you all support films like this.”
Producer Vidya Koppineedi said, “When people hear that a film is coming from Geetha Arts and Rahul Ravindran, they usually expect a cute love story. But after watching the trailer, you’ll realize this is something different. The film will touch every viewer’s heart. I want to thank Rahul for bringing such a beautiful story. No other actress could have portrayed this character as perfectly as Rashmika did. She inspires us all. Dheekshith and Rashmika have truly given life to this story with their performances. See you all in theaters on November 7.”
Producer Dheeraj Mogilineni said, “We never make movies just for the sake of production. We make them because we believe in the story and our passion. Even if I make only ten films in my career, I want them to be memorable and The Girlfriend will be at the top of that list. When I heard this story, I immediately wanted to produce it. During this journey, director Rahul has become like a brother to me. Rashmika agreeing to do this movie was our first victory. When we approached her to discuss remuneration, she said she’d take it only after the film was completed. That kind of support is rare. Without Rashmika, The Girlfriend wouldn’t exist. Dheekshith is a fantastic actor, and after this film, he’ll be doing movies non-stop for the next ten years in Tollywood. Both leads will win hearts with their performances. And I must say – without Allu Aravind sir, I wouldn’t be here. He’s our godfather.”
Producer Bunny Vas said, “I’ve already watched The Girlfriend, and I can’t forget the last 30 minutes. Rashmika is our Geetha Arts’ pride. She has delivered a phenomenal performance. After watching this film, people won’t forget Dheekshith either. Around 60% of the girls in the theater will strongly relate to this story. It’s something everyone will connect with. But I’d like to warn the boys – be careful when you watch this movie with your girlfriend! Producers Vidya and Dheeraj will earn a great reputation with this film and might even win awards.”
Actor Dheekshith Shetty said, “It’s great to meet you all again after Dasara. I hope you liked our trailer. You must have felt the intensity while watching it. When I first heard this story, I couldn’t get it out of my head. It’s that powerful. I’m happy to have played the character Vikram in this film. In Dasara, you loved Suri, but here, you’ll both love and hate Vikram. You’ll also learn how to manage your girlfriend! This film shows what today’s men are really like. We worked with great passion. I hope you all come to the theaters on November 7 and support our film. You’ll enjoy watching it as much as we enjoyed making it.”
Producer SKN said, “I wish producer Vidya Koppineedi a hat-trick hit with The Girlfriend. My friend Dheeraj earned a great name with Ambajipeta Marriage Band, and I’m sure this movie will be another big success for him. Rashmika has Animal, Pushpa 2, and Thamma coming up – there’s no stopping her career. She has sweetness, coolness, and hotness all at once. She prefers simplicity over publicity. I’ve never seen another actress with her level of dedication and commitment. She can shoot for hours without complaint. Interestingly, in Geetha Govindam, Anu Emmanuel acted, and she’s also part of The Girlfriend. I hope this film becomes as big a hit as Geetha Govindam. Watch this movie with your girlfriend – you’ll learn something from it. Like the hero’s character, even if we’re not like him, our uniqueness defines us.”
Actress Rashmika Mandanna said, “When I heard the story of The Girlfriend, I felt we had never seen a love story like this before. It made me think, ‘This happens in real life too.’ I play a character named Bhooma. There are some things we can only share with our best friends – this film captures that feeling. I’m sure you’ve all seen the trailer and liked it. I’ve done many movies, but The Girlfriend felt like an important one to do. For me, it’s not about box office numbers or success; it’s about being part of good films that tell meaningful stories. I want audiences to leave the theater with a special emotion. This project came to me at the right time in my career. Without such a great team, our dreams wouldn’t come true. I’m happy to have worked with a co-star like Dheekshith. Please support our film when it releases.”
Producer Allu Aravind said, “Rahul told me this story four years ago. He originally planned it as a web series for aha, but I felt it would be better as a feature film. Whenever we met, I reminded him about this story. The heroine’s character is extremely intense, and when we thought about who could play it, Rashmika was the only choice. She’s like a daughter to me. I’m sure she’ll win Best Actor awards for this performance. After watching this movie, people will realize what a talented performer Dheekshith is. Rahul has extracted such deep performances from both leads that you’ll be surprised he directed this film. For the pre-release event, we’re planning to invite Vijay Deverakonda as the chief guest.”
Cast: Rashmika Mandanna, Dheekshith Shetty, Rao Ramesh and others
Technical Crew:
Cinematography – Krishnan Vasant
Music – Hesham Abdul Wahab
Costumes – Shravyavarma
Production Design – S. Ramakrishna, Mounika Nigothri
PRO – GSK Media, Vamsi Kaka
Marketing – First Show
Presented by – Allu Aravind
Banners – Geetha Arts, Dheeraj Mogilineni Entertainment
Producers – Vidya Koppineedi, Dheeraj Mogilineni
Written and Directed by – Rahul Ravindran
“ది గర్ల్ ఫ్రెండ్” సినిమాలోని పర్ ఫార్మెన్స్ కు రశ్మిక మందన్న కు బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ వస్తాయి – ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా “ది గర్ల్ ఫ్రెండ్”. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 7న హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
డీవోపీ కృష్ణన్ వసంత్ మాట్లాడుతూ – “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీమ్ తో వర్క్ చేయడం ఎంతో ఇన్స్ పైర్ చేసింది. ఒక ఇంటెన్స్, ప్యాషనేట్ కంటెంట్ ను ఈ చిత్రంలో చూపించబోతున్నాం. మీరంతా మా మూవీని సపోర్ట్ చేస్తారని, మా సినిమా గురించి మిగతా వారికి చెబుతారని కోరుకుంటున్నా. అన్నారు.
డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ – నేను స్టూడెంట్ గా హాస్టల్లో ఉండే రోజుల్లో ఈ స్టోరీ ఐడియా వచ్చింది. దాన్ని కొన్నేళ్ల క్రితం స్టోరీగా రాసుకున్నా. మీరు ఇప్పుడు ట్రైలర్ లో ఏం చూశారో అదే సినిమా. ఇంటెన్స్ ఎమోషన్ తో ఉంటుంది. రిలేషన్ షిప్ ట్రై చేయాలనుకునే వారు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా చూసి ఆ ఎమోషన్ తో బయటకు వస్తారు. మూవీ రియల్ గా, రూటెడ్ గా, ఇంటెన్స్ గా , ఎమోషనల్ గా ఉంటుంది. నా టీమ్ అందరూ ప్యాషనేట్ గా వర్క్ చేశారు. హీరో దీక్షిత్, హీరోయిన్ రశ్మిక తమ పర్ ఫార్మెన్స్ తో కథకు లైఫ్ ఇచ్చారు. ఇలాంటి యాక్టర్స్ దొరకడం ఏ దర్శకుడికైనా అదృష్టమని చెప్పాలి. నేను మానిటర్ వెనకాల కూర్చుని వీళ్ల పర్ ఫార్మెన్స్ చూస్తూ ఎంజాయ్ చేశాను. ఈ సినిమాకు నేనే ఫస్ట్ ఆడియెన్ కావడం హ్యాపీగా ఉంది. సినిమాలో నేనూ ఒక రోల్ చేశాను. ఇది రెగ్యులర్ ఫార్మేట్ లవ్ స్టోరీ కాదు. జెన్యూన్ గా ఒక కథ చెప్పాలని మేమంతా ప్రయత్నించాం. ఇలాంటి మూవీస్ కు మీ సపోర్ట్ కావాలి. అన్నారు.
ప్రొడ్యూసర్ విద్యా కొప్పినీడి మాట్లాడుతూ – గీతా ఆర్ట్స్, రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా అంటే మీరంతా క్యూట్ లవ్ స్టోరీ ఎక్స్ పెక్ట్ చేసి ఉంటారు. కానీ ట్రైలర్ చూశాక మీకు అర్థమై ఉంటుంది ఇదొక డిఫరెంట్ లవ్ స్టోరీ. ప్రతి ఒక్క ప్రేక్షకుడి మనసుకు హత్తుకునేలా మూవీ ఉంటుంది. ఇలాంటి మంచి కథ తీసుకొచ్చిన రాహుల్ కు థ్యాంక్స్. ఈ క్యారెక్టర్ ను రశ్మిక తప్ప మరో హీరోయిన్ ఇంత బాగా పర్ ఫార్మ్ చేయలేరు. ఆమె గురించి మరో సందర్భంలో మాట్లాడుతా. తను మమ్మల్ని ఇన్స్ పైర్ చేసేది. దీక్షిత్, రశ్మిక తమ పర్ ఫార్మెన్స్ లతో ఈ కథకు లైఫ్ ఇచ్చారు. నవంబర్ 7న మీ అందరినీ థియేటర్స్ లో కలుస్తాను. అన్నారు.
ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ – మేము ఏ సినిమాను రొటేషన్ కోసం చేయము. కథను నమ్మి ప్యాషనేట్ గా ప్రొడ్యూస్ చేస్తాం. కెరీర్ లో పది సినిమాలు చేసినా అవి గుర్తుండిపోవాలి అనుకుంటా. వాటిలో “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఈ కథ విన్నప్పుడు ఈ సినిమాను తప్పకుండా ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నాం. ఈ జర్నీలో డైరెక్టర్ రాహుల్ మంచి మిత్రుడు, సోదరుడిలా మారిపోయారు. రశ్మిక గారు ఈ సినిమాను ఒప్పుకోవడమే మా మొదటి విజయం. రెమ్యునరేషన్ గురించి మాట్లాడాలని వెళితే, సినిమా కంప్లీట్ అయ్యాక తీసుకుంటా అన్నారు. అలాంటి సపోర్ట్ మరెవరూ ఇవ్వలేరు అనిపించింది. రశ్మిక లేకుంటే “ది గర్ల్ ఫ్రెండ్” సినిమానే లేదు. దీక్షిత్ మాకు దొరికిన గొప్ప నటుడు. ఆయన టాలీవుడ్ లో “ది గర్ల్ ఫ్రెండ్” తర్వాత మరో పదేళ్లు వరుసగా సినిమాలు చేస్తారు. వీళ్లిద్దరు తమ పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటారు. అల్లు అరవింద్ గారు లేకుంటే నేను లేను. ఆయన మాకు గాడ్ ఫాదర్. అన్నారు.
నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ – “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా నేను చూశాను. చివరి 30 నిమిషాల సినిమాను మర్చిపోలేకపోతున్నాను. రశ్మిక మా గీతా ఆర్ట్స్ గీత. ఈ సినిమాలో తను అద్భుతంగా పర్ ఫార్మ్ చేసింది. ఈ సినిమా చూశాక దీక్షిత్ ను కూడా మర్చిపోలేము. థియేటర్స్ లో కూర్చున్న అమ్మాయిల్లో 60 పర్సెంట్ ఈ కథకు బాగా కనెక్ట్ అవుతారు. ఇది మీరు బాగా కనెక్ట్ అయ్యే కథ. తమ గర్ల్ ఫ్రెండ్ తో ఈ సినిమాకు వెళ్లే అబ్బాయిలు జాగ్రత్తగా ఉండండి. ప్రొడ్యూసర్స్ విద్యా, ధీరజ్ ఈ చిత్రంతో మంచి పేరు తెచ్చుకుంటారు. వాళ్లకు అవార్డ్స్ కూడా వస్తాయి. అన్నారు.
హీరో దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ – దసరా మూవీ తర్వాత మళ్లీ మీ అందరినీ మీట్ అవడం హ్యాపీగా ఉంది. ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. మీరంతా ట్రైలర్ చూస్తున్నప్పుడు ఇంటెన్స్ గా ఫీల్ అయి ఉంటారు. నేను ఈ కథ విన్నప్పుడు ఆ కథ నుంచి బయటకు రాలేకపోయాను. అంత మంచి స్టోరీని రాహుల్ మా దగ్గరకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో విక్రమ్ అనే క్యారెక్టర్ చేసే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉంది. దసరా సినిమాలో సూరి క్యారెక్టర్ ను మీరు ఎంతగా ఇష్టపడ్డారో ఈ చిత్రంలో విక్రమ్ ను అంతగా ఇష్టపడటంతో పాటు ద్వేషిస్తారు. గర్ల్ ఫ్రెండ్ ను ఎలా మ్యానేజ్ చేయాలో నేర్చుకుంటారు. ఈ రోజు అబ్బాయిలు ఎలా ఉన్నారో నా క్యారెక్టర్ ద్వారా చూసుకోవచ్చు. నవంబర్ 7న థియేటర్స్ కు వచ్చి మా మూవీని సపోర్ట్ చేయండి. చాలా ప్యాషనేట్ గా ఈ చిత్రానికి వర్క్ చేశాం. “ది గర్ల్ ఫ్రెండ్” సినిమాలో నటిస్తున్నప్పుడు మేము ఎంతగా ఎంజాయ్ చేశామో, చూస్తున్నప్పుడు మీరూ అలాగే ఆస్వాదిస్తారు. అన్నారు.
నిర్మాత ఎస్ కేఎన్ మాట్లాడుతూ – “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా ప్రొడ్యూసర్ విద్య గారికి హ్యాట్రిక్ హిట్ రావాలని కోరుకుంటున్నా. అలాగే నా మిత్రుడు ధీరజ్ అంబాజీపేట..సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాతో ఆయనకు మరో హిట్ దక్కుతుందని ఆశిస్తున్నా. యానిమల్, పుష్ప 2, థామా..రశ్మిక కెరీర్ కు లేదు కామా. స్వీట్ నెస్, కూల్ నెస్, హాట్ నెస్ ఉన్న హీరోయిన్ ఆమె. రశ్మిక పబ్లిసిటీ కంటే సింప్లిసిటీనే కోరుకుంటారు. రశ్మికలా డెడికేషన్, కమిట్ మెంట్ ఉన్న హీరోయిన్ ను మరొకరిని నేను చూడలేదు. ఎన్ని గంటలైనా షూటింగ్ చేస్తారు. రశ్మిక గీత గోవిందంలో అను ఇమ్మాన్యుయేల్ నటించారు. ఇప్పుడు ఈ చిత్రంలోనూ అను ఇమ్మాన్యుయేల్ ఉన్నారు. గీత గోవిందం లాగే “ది గర్ల్ ఫ్రెండ్” కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. మీ గర్ల్ ఫ్రెండ్ తో ఈ సినిమాకు వెళ్లండి. ఈ సినిమా చూసి మీరు కొన్ని నేర్చుకుంటారు. ఈ చిత్రంలో హీరో క్యారెక్టర్ లా మనం ఉన్నా లేకపోయినా, మన యూనిక్ నెస్ మనదే. అన్నారు.
హీరోయిన్ రశ్మిక మందన్న మాట్లాడుతూ – “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా కథ విన్నప్పుడు ఇలాంటి లవ్ స్టోరీని ఇప్పటిదాకా మనం చూడలేదు అనిపించింది. మనందరి జీవితాల్లో ఇలాంటివి జరుగుతాయి కదా అనే ఫీల్ కలిగింది. ఇందులో భూమా అనే పాత్రలో నటించాను. కేవలం బెస్ట్ ఫ్రెండ్స్ తోనే కొన్ని మన విషయాలు షేర్ చేసుకుంటాం. అలాంటి కంటెంట్ ఉన్న మూవీ ఇది. మా మూవీ ట్రైలర్ చూశారు కదా మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నా. నేను చాలా మూవీస్ చేస్తున్నా గానీ “ది గర్ల్ ఫ్రెండ్” లాంటి సినిమా చేయడం ముఖ్యమని భావించాను. నాకు బాక్సాఫీస్ నెంబర్స్, సక్సెస్ కంటే మంచి మూవీ చేయాలి, మంచి కథను ఆడియెన్స్ కు చెప్పాలనే అనిపిస్తుంది. నా మూవీ థియేటర్స్ కు వెళ్లి చూసిన ఆడియెన్స్ ఏదో ఒక మంచి ఫీల్ తో బయటకు వెళ్లాలని కోరుకుంటాను. నేను నా కెరీర్ లో రైట్ టైమ్ లో కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఇది. ఇలాంటి మంచి టీమ్ లేకుంటే మన డ్రీమ్స్ నిజం కావు. దీక్షిత్ లాంటి కోస్టార్ తో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. మీరంతా మా సినిమాను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ – “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా కథను రాహుల్ నాలుగేళ్ల క్రితం చెప్పాడు. ఆహాకు వెబ్ సిరీస్ లా చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు. కానీ ఇలాంటి మంచి కథతో సినిమా చేస్తేనే బాగుంటుందని అనిపించేది. ఆ తర్వాత ఎప్పుడు కలిసినా ఈ కథ గురించి రాహుల్ కు గుర్తుచేసేవాడిని. ఈ కథలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఇంటెన్స్ గా ఉంటుంది. అంత హెవీ పర్ ఫార్మెన్స్ ఎవరు చేస్తారని అనుకున్నప్పుడు రశ్మిక మాత్రమే చేయగలదు అని ఆమెను తీసుకున్నాం. తను నాకు కూతురు లాంటిది. రశ్మికకు ఈ సినిమాతో బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ వస్తాయి. ఈ సినిమా చూశాకే దీక్షిత్ ఎంత మంచి పర్ ఫార్మర్ అనేది ఆడియెన్స్ తెలుసుకుంటారు. రశ్మిక, దీక్షిత్ తో ఒక ఇంటెన్స్ పర్ ఫార్మెన్స్ తీసుకున్నాడు రాహుల్. అతన్ని చూస్తే ఇలాంటి సినిమా ఇతను చేశాడా అనిపిస్తుంది. “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండను గెస్ట్ గా తీసుకొద్దాం. అన్నారు.
నటీనటులు – రశ్మిక మందన్న, దీక్షిత్ శెట్టి, తదితరులు
టెక్నికల్ టీమ్
సినిమాటోగ్రఫీ – కృష్ణన్ వసంత్
సంగీతం – హేషమ్ అబ్దుల్ వాహబ్
కాస్ట్యూమ్స్ – శ్రావ్య వర్మ
ప్రొడక్షన్ డిజైన్ – ఎస్ రామకృష్ణ, మౌనిక నిగోత్రి
పీఆర్ఓ – జి.ఎస్.కే మీడియా,వంశీ కాక
మార్కెటింగ్ – ఫస్ట్ షో
సమర్పణ – అల్లు అరవింద్
బ్యానర్స్ – గీతా ఆర్ట్స్,ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్
నిర్మాతలు – ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి
రచన -దర్శకత్వం – రాహుల్ రవీంద్రన్
