
Producer K.S. Rama Rao Unveils the Title Poster of Mutton Soup
Under the presentation of Ramakrishna Vattikuti, and produced under the banners Alukka Studios, Sri Varahi Arts, and Bhavishya Vihara Chitralu (BVC), director Ramachandra Vattikuti is bringing a new film titled “Mutton Soup”, starring Raman and Varsha Vishwanath as the lead pair. The film carries the tagline “Witness the Real Crime”. The title poster was launched by renowned producer K.S. Rama Rao. The film is produced by Mallikharjun Elika (Gopal), Arun Chandra Vattikuti, and Ramakrishna Sanapala.
On the occasion of Independence Day (August 15th), both the title poster and the motion poster of the movie were unveiled.
Speaking on the occasion, senior producer K.S. Rama Rao said.. “Under the supervision of Parvathaneni Rambabu, Ramachandra Vattikuti is directing ‘Mutton Soup’ under the banners Alukka Studios, Sri Varahi Arts, and Bhavishya Vihara Chitralu. The title poster looks great. I wish the team all the very best and hope the film becomes a big success.”
Producer Mallikharjun Elika (Gopal) said.. “We are thankful to the legendary producer K.S. Rama Rao garu for releasing our ‘Mutton Soup’ title poster. He conveyed his best wishes to our entire team. We are coming to the audience very soon. We hope the viewers will embrace us and the good film we are bringing.”
Hero Raman said.. “My friend Ramachandra is making ‘Mutton Soup’ with a solid story. Our title poster and motion poster came out wonderfully. Thanks to producer K.S. Rama Rao garu for coming and supporting us. The film is shaping up really well. We are all working hard day and night, and I hope the audience will support this good film.”
Director Ramachandra Vattikuti said.. “Under the supervision of Parvathaneni Rambabu, and under the banners of Alukka Studios, Sri Varahi Arts, and Bhavishya Vihara Chitralu, I am directing the movie ‘Mutton Soup’. My heartfelt thanks to producer K.S. Rama Rao garu for launching our title poster.”
Producer Ramakrishna Sanapala said.. “Mutton Soup is based on real incidents. We are making arrangements to release the film soon. Sincere thanks to producer K.S. Rama Rao garu for unveiling our title poster.”
The event was also attended by Executive Producer Parvathaneni Rambabu, Producer Arun Chandra Vattikuti, Line Producer Komma Ramakrishna, Editor Lokesh Kadali, Actor Govind Raj Neerudi, and others, who all expressed their gratitude to K.S. Rama Rao.
Cast:
Raman, Varsha Vishwanath, Gemini Suresh, Govind Srinivas, Shivaraj, SRK, Charan, Kiran, Gopal Maharshi, Sunitha Manohar, Master Vihar, and others.
Technical Crew:
Banners: Alukka Studios, Sri Varahi Arts, Bhavishya Vihara Chitralu (BVC)
Presenter: Ramakrishna Vattikuti
Director: Ramachandra Vattikuti
Producers: Mallikharjun Elika (Gopal), Arun Chandra Vattikuti, Ramakrishna Sanapala
Cinematography: Bharadwaj, Phanindra
Music: Venky Veena
Editing: Lokesh Kadali
Executive Producer: Parvathaneni Rambabu
Co-director: Gopal Maharshi
PRO: Mohan Tummala
*రామకృష్ణ వట్టికూటి సమర్పణలో అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు (BVC) బ్యానర్లపై రామచంద్ర వట్టికూటి తెరకెక్కిస్తున్న ‘మటన్ సూప్’ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసిన ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు
రామకృష్ణ వట్టికూటి సమర్పణలో అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు (BVC) బ్యానర్లపై రమణ్, వర్షా విశ్వనాథ్ హీరో హీరోయిన్లుగా రామచంద్ర వట్టికూటి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘మటన్ సూప్’. ‘విట్నెస్ ది రియల్ క్రైమ్’ ట్యాగ్ లైన్. మల్లిఖార్జున ఎలికా (గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల నిర్మాతలుగా రానున్న ఈ నూతన చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు విడుదల చేశారు.
ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్ట్ 15న ఈ నూతన సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీనియర్ నిర్మాత కె.ఎస్.రామారావు మాట్లాడుతూ.. ‘పర్వతనేని రాంబాబు సారథ్యంలో అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు (BVC) బ్యానర్లపై రామచంద్ర వట్టికూటి దర్వకత్వంలో రాబోతోన్న చిత్రం ‘మటన్ సూప్’. టైటిల్ పోస్టర్ బాగుంది. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
చిత్ర నిర్మాత మల్లిఖార్జున ఎలికా (గోపాల్) మాట్లాడుతూ.. ‘మా ‘మటన్ సూప్’ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసిన లెజెండరీ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు గారికి ధన్యవాదాలు. మా టీం అందరికీ ఆయన ఆల్ ది బెస్ట్ తెలిపారు. త్వరలోనే మేం ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నాం. మంచి చిత్రంతో రాబోతోన్న మా అందరినీ ఆడియెన్స్ ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
హీరో రమణ్ మాట్లాడుతూ.. ‘నా ఫ్రెండ్ రామచంద్ర మంచి కథతో ‘మటన్ సూప్’ తెరకెక్కిస్తున్నారు. మా టైటిల్ పోస్టర్, మోషన్ పోస్టర్ అద్భుతంగా వచ్చింది. మా కోసం వచ్చి సపోర్ట్ చేసిన నిర్మాత కె.ఎస్.రామారావు గారికి థాంక్స్. సినిమా అద్భుతంగా వస్తోంది. పగలు రాత్రి అన్న తేడా లేకుండా మేం అంతా కష్టపడుతున్నాం. మేం తీస్తున్న ఈ మంచి చిత్రాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
చిత్ర దర్శకుడు రామచంద్ర వట్టికూటి మాట్లాడుతూ.. ‘రామకృష్ణ వట్టికూటి సమర్పణలో అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు (BVC) బ్యానర్లపై పర్వతనేని రాంబాబు గారి సారథ్యంలో నేను తెరకెక్కిస్తున్న చిత్రం ‘మటన సూప్’. మా మూవీ టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన నిర్మాత కేఎస్ రామారావు గారికి ధన్యవాదాలు’ అని అన్నారు.
నిర్మాత రామకృష్ణ సనపల మాట్లాడుతూ ‘రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా చేసుకుని మటన్ సూప్ సినిమాను రూపొందించాం. త్వరలోనే విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నాం. మా సినిమా టైటిల్ పోస్టర్ విడుదల చేసిన నిర్మాత కె.ఎస్.రామారావుగారికి ధన్యవాదాలు’ అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు, నిర్మాత అరుణ్ చంద్ర వట్టికూటి, లైన్ ప్రొడ్యూసర్ కొమ్మా రామ కృష్ణ, ఎడిటర్ లోకేష్ కడలి, నటుడు గోవింద్ రాజ్ నీరుడి తదితరులు పాల్గొని కె.ఎస్.రామారావుగారికి ధన్యవాదాలు తెలియజేశారు.
నటీనటులు : రమణ్, వర్ష విశ్వనాథ్, జెమినీ సురేష్, గోవింద్ శ్రీనివాస్, శివరాజ్, ఎస్ఆర్కే, చరణ్, కిరణ్, గోపాల్ మహర్షి, సునీత మనోహర్, మాస్టర్ విహార్ తదితరులు
సాంకేతిక బృందం
బ్యానర్స్ : అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు (BVC)
సమర్పణ : రామకృష్ణ వట్టికూటి
దర్శకుడు : రామచంద్ర వట్టికూటి
నిర్మాత : మల్లిఖార్జున ఎలికా (గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల
కెమెరామెన్ : భరద్వాజ్, ఫణింద్ర
మ్యూజిక్ : వెంకీ వీణ
ఎడిటింగ్ : లోకేష్ కడలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పర్వతనేని రాంబాబు
కో డైరెక్టర్ : గోపాల్ మహర్షి
పి.ఆర్.ఒ : మోహన్ తుమ్మల