The trailer gives complete confidence that Chennai Love Story will

Peta Rowdy Birthday Poster Launched
హీరో చంటి పుట్టినరోజు సందర్భంగా ‘పేట రౌడీ’ బర్త్‌డే పోస్టర్ లాంచ్
వీకే క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్–2గా తెరకెక్కుతున్న చిత్రం ‘పేట రౌడీ’. ఇటీవల ఈ చిత్రాన్ని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. మాక్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కళ్యాణి కర్తనాధ నిర్మిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మాస్ లవ్ ఎంటర్టైనర్పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది.
హీరో చంటి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన స్పెషల్ బర్త్‌డే పోస్టర్‌ను ఆనంద్ గ్రూప్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ఎల్. ఆనంద్ కుమార్ చేతుల మీదగా ఆవిష్కరించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫైట్ సీక్వెన్స్ షూటింగ్ పూర్తయ్యిందని, త్వరలోనే మూవీ గ్లింప్స్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
ఈ చిత్రానికి అదనపు స్క్రీన్‌ప్లే కేవీర్ అందించగా, మాటలు–పాటలు భాష్యశ్రీ రాశారు. సినిమాటోగ్రఫీని వై.ఎస్. కృష్ణ నిర్వహిస్తున్నారు. లైన్ ప్రొడ్యూసర్లుగా ఇటీకర్లపల్లి మహేష్ కుమార్, దంతులూరి పృథ్విరాజ్ వ్యవహరిస్తున్నారు. ఫైట్ మాస్టర్‌గా : జాషువ, ఎడిటర్ : శివ శర్వాణి పీఆర్ఓగా గణేష్ పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చిత్ర బృందం తెలిపింది.
