Patang Release Date confirmed
Patang Release Date confirmed
Patang is a unique sports comedy-drama centered around the exhilarating world of kite flying, a fresh addition to Indian cinema’s sports genre, which has traditionally been dominated by cricket, rugby, football, and the like. This film introduces a talented cast of newcomers, including lead actors Vamsi Pujit, Preethi Pagadala, and Pranav Kaushik. Set against the vibrant backdrop of Hyderabad’s bustling localities, Patang presents the city in a way that audiences have never experienced before.
So far, the teaser and two songs from the film have been released, garnering an overwhelmingly positive response from viewers. The legendary singer SP Charan plays a pivotal role in the movie, and rumors suggest that several surprise cameo appearances will be revealed in the trailer.
Currently in the final stages of post-production, the team is focused on perfecting the film’s climactic CG sequences, which are crucial to the story. With confidence in their work, Team Patang is gearing up for the film’s global release on December 27th, perfectly timed to kick off the festive Sankranthi season. The main promotions will kickstart soon.
Technical Crew:
Producers: Vijay Sekhar Anne, Sampath Maka, Suresh Kothinti
Creative Producer: Naani Bandreddi
Writer and Director: Praneeth Prattipati
Music: Jose Jimmy
Cinematographer: Shakti Arvind
Editor: Chanakya Reddy Toorupu
Production Design: Venkat Satavahana
Styling: Meghana Sheshavapuri
డిసెంబరు 27న ప్రపంచవ్యాప్తంగా పతంగ్ విడుదల
ఇప్పటి వరకు ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలు ప్రేక్షకులు చూసి వుంటారు. కాని అందరిలో ఎంతో మమేకమైన పతంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘పతంగ్’. సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిషన్ సినిమాస్ పతాకంపై విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకుడు. నాని బండ్రెడ్డి క్రియేటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో ఇన్‌స్టాగ్రమ్ సెన్సేషన్ ప్రీతి పగడాల, జీ సరిగమప రన్నరప్ ప్రణవ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్ ముఖ్యతారలుగా నటిస్తున్నారు. మరికొంత మంది నూతన నటీనటులతో పాటు ప్రముఖ సింగర్, నటుడు ఎస్పీ చరణ్ ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం డిసెంబరు 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదల చేసిన పాటలకు చిత్ర టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. డిసెంబరు 27న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘ఈ సినిమా థియేటర్లో యూత్‌ఫెస్టివల్‌లా వుంటుంది. కొత్తవాళ్లతో చేసిన మా సినిమా కొత్తగా వుండటంతో పాటు చాలా పెద్ద సినిమా క్వాలిటీతో వుంటుంది అన్నారు. ఈ సినిమాకు కథే హీరో. ఈ చిత్రానికి జోస్ జిమ్మి అద్భుతమైన పాటలు ఇచ్చాడు. పాట వింటూంటే అందరిలో పాజిటివ్ వైబ్స్ కలుగుతాయి. తప్పకుండా మా పతంగ్ చిత్రం అన్నివర్గాల వారిని అలరిస్తుందనే నమ్మకం వుంది. కొత్త కంటెంట్‌ను ఆదరించే తెలుగు ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం వుంది. డిసెంబరు 27న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’ అని తెలిపారు.