
Napoleon Returns – Anand Ravi Returns with Ultra New Concept
Anand Ravi is a popular writer-actor, who shot to fame with his work in critically acclaimed films like Napoleon, Prathinidhi and Korameenu in the recent past. The actor-director is back with a powerful film and a fresh, unique concept under the Acharya Creations banner.
Anand Ravi raised curiosity about this project with a creative promotional video revealing its genre. Today, the makers unveiled the film’s title glimpse at a grand launch event in Hyderabad. The entire team was present to reveal the title – “Napoleon Returns.”
The title glimpse begins with Anand Ravi lodging a complaint at a police station about a buffalo ghost problem. The fast-paced, thrilling visuals heighten the intrigue surrounding the film. Like Raghu Babu, everyone is eager to know more about the mysterious buffalo ghost.
The presence of a child’s skull in the house hints at a new kind of horror and suspense. In the end, there’s a clever reference to Napoleon, as a police officer asks Anand Ravi if he was the one who previously complained about losing his shadow.
The visuals are rich, and the background score further amplifies the tension and intrigue. The film also stars Anand Ravi, Divi Vadthya, Auto Ram Prasad, Ragubabu, Surya Ping Pong, Sravan Raghavendra, Anchor Ravi, Ravi Varma, Meesala Lakshman and others in key roles.
Producer Bhogendra Gupta bankrolling the film while Karthik Koppera handles the cinematography. Sidharth sadasivuni is scoring music for the film. The film is written and directed by Anand Ravi. More details will be announced soon.
అల్ట్రా న్యూ కాన్సెప్ట్‌తో ఆనంద్ రవి రూపొందిస్తోన్న ‘నెపోలియన్’ రిటర్న్స్’ గ్లింప్స్ విడుదల
ఆచార్య క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ రైటర్, డైరెక్టర్ ఆనంద్ రవి దర్శకత్వంలో భోగేంద్ర గుప్త నిర్మించిన ప్రొడక్షన్ నెంబర్ 4 చిత్రానికి సంబంధించిన టైటిల్, గ్లింప్స్‌ను ఆదివారం నాడు లాంఛ్ చేశారు. ఆనంద్ రవి, దివి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి ‘నెపోలియన్ రిటర్న్స్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఆనంద్ రవి రూపొందించిన నెపోలియన్, ప్రతినిధి, కొరమీను చిత్రాలు ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ యాక్టర్- డైరెక్టర్ ఆనంద్ రవి మరోసారి యూనిక్, ఫ్రెష్ కాన్సెప్ట్‌తో నెపోలియన్ రిటర్న్స్‌గా మన ముందుకు రాబోతున్నారు.
‘నెపోలియన్’ రిటర్న్స్’ విషయానికి వస్తే ఆనంద్ రవి తనదైన స్టైల్లో డిఫరెంట్ ప్రమోషనల్ వీడియోను విడుదల చేశారు. దీంతో సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. ఈ మూవీ ఎంటైర్ టీమ్ టైటిల్ గ్లింప్స్‌ను హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు.
‘నెపోలియన్’ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ విషయానికి వస్తే.. ఆనంద్ రవి ఇద్దరితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వటానికి వెళతాడు. ఓ గెద ఆత్మ సమస్యగా మారిందని పోలీసుతో చెబుతాడు. మరో వైపు ఆనంద్ రవి విజువల్స్‌తో పాటు తను ఏం కంప్లైంట్ చేయాలనుకుంటున్నాడో దానికి సంబంధించిన విజువల్స్‌ను చాలా వేగంగా చూపించారు. పోలీస్ రఘుబాబు సహా అందరూ ఆ గెద ఆత్మ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటారు.
ఇంట్లో కనిపించే పుర్రె ఓ చిన్నారిదని చెప్పటంతో ఇదే సరికొత్త హారర్ సస్పెసన్స్ మూవీ అనే భావన కలుగుతుంది. గ్లింప్స్ చివరలో ఓ పోలీస్ ఆఫీసర్ ఆనంద్ రవితో ఇంతకు ముందే నువ్వే కదా నీడ పోయిందని కంప్లైంట్ ఇచ్చావ్ అని అడగటంతో నెపోలియన్ సినిమా రెఫరెన్స్‌ను అక్కడ చూపించారు.
గ్లింప్స్‌లో విజువల్స్ చాలా రిచ్‌గా కనిపిస్తున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఆనంద్ రవి, దివి వద్త్య, ఆటో రామ్ ప్రసాద్, రఘుబాబు, సూర్య పింగ్ పాంగ్, శ్రవణ్ రాఘవేంద్ర, యాంకర్ రవి, రవి వర్మ, మీసాల లక్ష్మణ్ తదితరులు ఇందులో నటించారు.
భోగేంద్ర గుప్తా నిర్మిస్తోన్న ఈ సినిమాకు కార్తీక్ కొప్పెర సినిమాటోగ్రఫీ, సిద్ధార్థ్ సదాశివుని సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాకు రచన-దర్శకత్వం ఆనంద్ రవి. మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ తెలియజేశారు.
