Lopalliki Ra Cheptha 4th Single Tik Tok Chedama.. Released by

‘Kannappa’ Showcases the Legendary Bow of Thinnadu
కన్నప్ప లో తిన్నడు ఉపయోగించే విల్లు విశేషాలు
డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ మీదున్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కన్నప్ప టీజర్ అన్ని వర్గాల ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. ఇక తాజాగా విష్ణు తన కన్నప్ప సినిమాలో భాగంగా వాడిన విల్లు విశిష్టతను గురించి చెప్పుకొచ్చారు. ‘కన్నప్ప’లో తిన్నడు వాడిన విల్లు కేవలం ఆయుధం మాత్రమే కాదు. ఆ ధనస్సు ధైర్యానికి సూచిక. తండ్రీకొడుకుల మధ్య బంధానికి సూచికగా నిలుస్తుంది. కన్నప్ప తండ్రి నాధనాథ తన చేతుల్తో తయారు చేసిన ఆ విల్లు కుటుంబ వారసత్వంగా మారింది. ఆ విల్లుతో కన్నప్ప యుద్ధభూమిలో అసమానమైన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తారు.
కేవలం ఐదేళ్ల వయసున్న కన్నప్ప అనే యువకుడు ఓసారి అడవిలో క్రూరమైన పులిని ఎదుర్కొంటాడు. ఒక సాధారణ కర్రతో పోరాటం చేసి ఆ పులి నుంచి తప్పించకుంటాడు. అంత చిన్న వయసులో తన కొడుకు ధైర్య సాహసాల్ని చూసి నాధనాథుడు మురిసిపోతాడు. కన్నప్ప శౌర్యానికి ప్రతీకగా ప్రత్యేకమైన విల్లును తయారు చేస్తాడు. ఆ పులి ఎముకలు, దంతాలతో చేసిన ఆ విల్లు బలానికి, ధైర్య సాహసాలకి ప్రతీకగా నిలుస్తుంది. ఆ విల్లుని రెండుగా విరిస్తే యుద్దంలో పోరాడేందుకు కత్తుల్లానూ ఉపయోగపడేలా రూపొందించారు.విష్ణు చెప్పిన కథను శ్రద్దగా విన్న న్యూజిలాండ్‌లోని చిత్ర కళా దర్శకుడు క్రిస్ ప్రత్యేకమైన విల్లుని తయారు చేశారు. కన్నప్ప సినిమా విజన్‌కు అనుగుణంగా, విష్ణు మంచు అంచనాలకు తగ్గట్టుగా ఆ ధనస్సుని రూపొందించాడు. ఈ విల్లుతోనే న్యూజిలాండ్‌లో రెండు నెలల పాటు చిత్రీకరించారు.
విష్ణు మంచు మాట్లాడుతూ.. ‘ఈ తిన్నడు విల్లు కన్నప్పలో అంతర్భాగం అయింది. అతను దాన్ని అచంచలమైన గర్వంతో ఉపయోగిస్తూ.. తన తెగను, అడవిలో సమతుల్యతను కాపాడుకుంటాడు. ఈ కథ యువతలో ధైర్యాన్ని నింపుతుంది, విన్న వారందరిలో ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తుంది. మేము అనుకున్నదాన్ని అనుకున్నట్టుగా రూపొందించినందుకు సంతోషంగా ఉంది’ అని అన్నారు.
కన్నప్ప చిత్రంతో తెరపై మన పౌరాణిక గాథను ఆవిష్కరించబోతోన్నారు. ఈ చిత్రానికి ముఖేష్ సింగ్ దర్శకత్వం వహించారు. మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ వంటి ప్రఖ్యాత నటీనటులు భాగమయ్యారు. శివుని భక్తుడైన ‘భక్త కన్నప్ప’ ఆకర్షణీయమైన కథను అద్భుతంగా చెప్పబోతోన్నారు. త్వరలోనే కన్నప్ప థియేటర్లోకి రానుంది.