Watch our film Thimmarajupalli TV to experience technical brilliance, strong

హీరో నవదీప్ అడ్వెంచర్ ట్రిప్.. మీరు రెడీనా?
హీరో నవదీప్ సినిమాలే కాదు, ఇన్నోవేటివ్ బిజినెస్ మేన్ కూడా, అందరి ఆలోచనలకు భిన్నంగా అడ్వెంచర్ టూరిజమ్‌ను ప్లాన్ చేశాడు.
అతడు ప్రపంచ సాహసికుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. అతడితో పాటు అడ్వెంచర్ ట్రిప్స్ లో భాగం కావాలనుకునే ఔత్సాహిక సాహికులకు అతడు గొప్ప అవకాశం కల్పిస్తున్నాడు. బేర్ గిల్స్ తో మరో అడ్వెంచర్ టూర్లా నవదీప్ తో అడ్వెంచర్ ట్రిప్‌కి మీరు సిద్ధం కండి. ఇది ఎన్.ఎస్ 4 ట్రిప్.
ఈ ఇనిషియేషన్ పేరు ”నవ్, లెట్స్ గో డీప్”. ఇది టూరిస్టులను ఊరిస్తోంది. అతడు అడ్వెంచర్ టూర్ లో భాగంగా కొన్ని ప్రదేశాలను ఎంపిక చేస్తాడు. అక్కడ సాహసికులు ఆకాశమే హద్దుగా చెలరేగే అవకాశం కల్పిస్తాడు. ఎవరెస్ట్ ఎక్కకపోయినా, దానికి ముందే ఉన్న లఢఖ్ కి ఎలా చేరుకోవాలో నవదీప్ వెంటే డేర్ చేస్తే తెలుస్తుంది. హిమాలయాలను, అక్కడి అందాలను, అక్కడి ఎక్స్‌పీరియన్స్‌ను ఈ ట్రిప్ ద్వారా పొందవచ్చు. ప్రకృతి అందాలను ఆస్వాధించవచ్చు. క్యూరేటెడ్, విలాసవంతమైన సాహసయాత్రలకు తీసుకెళుతూ అతడు మజాను అందిస్తాడు. లడఖ్ కఠినమైన ప్రకృతి దృశ్యాల నుండి ఐలాండ్ లోని ఘాఢమైన అందాల వరకూ.. ఆఫ్రికా అభయారణ్యంలో క్రూర జంతువుల వరకూ ప్రతి ప్రయాణంలో సాహసాలను ఆస్వాధించాలంటే నవ్ డీప్ టూర్లో అడుగుపెట్టాల్సిందే. జీవితంలో ఒకే ఒక్కసారి.. ఒకవేళ ఇదే మొదటిసారి లేదా ఇదే చివరి అడ్వెంచర్ కూడా కావచ్చు. ప్రతి ప్రయాణం గమ్మత్తయిన అనుభవాన్ని మిగులుస్తుంది. నవదీప్ స్వయంగా మీ సహ-ప్రయాణికుడిగా కొనసాగుతాడు. బహుశా ఇలాంటి సాహసాల కథలతో హాలీవుడ్ లో చాలా సినిమాలొచ్చాయి. వాటిలో అడ్వెంచర్ ట్రిప్ లో థ్రిల్స్ ఎలా ఉంటాయో అద్భుతంగా చూపించారు. ఇప్పుడు నవదీప్ కూడా తన ఆలోచనతో ఈ అడ్వెంచర్లతో ఆశ్చర్యపరుస్తున్నాడు. అతడిని చూసి పరిశ్రమలోని వ్యక్తులు, అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ ప్రత్యేకమైన విధానంతో NS4 ట్రిప్స్ భారతదేశంలో ప్రముఖులను సెలబ్రిటీలను విశేషంగా అలరిస్తాయని భావిస్తున్నారు.
