దేవకీ నందన వాసుదేవ లొ డివైన్ ఎలిమెంట్స్, ట్విస్ట్ లు అదిరిపోతాయి –
“KA” is receiving widespread acclaim from viewers – Directors Sujith and Sandeep
Young talent Kiran Abbavaram’s period thriller “KA” recently hit theaters and has quickly become a massive success, earning the title of Diwali winner at the box office. As a fresh take on the thriller genre, “KA” is receiving widespread acclaim from viewers. Directors Sujeeth and Sandeep expressed their happiness over the film’s success in a recent interview.
Director Sujith said:
“I am incredibly happy to see the response to ‘KA.’ Words can’t express how we feel. We believed that we could succeed only if we put in the effort, and that’s why we made this film with determination. The audience delivered the results we hoped for. This Diwali was particularly special for us, and our family members were overjoyed. Kiran treated us like brothers, managing everything from production to the end, which took the pressure off us.
The audience gave a standing ovation at the end of the film. We initially worried about how the audience would receive our story, but it seems they have connected deeply with it. We had no industry contacts; I came from an advertising background, while Sandeep was focused on his work. As brothers, I have a passion for storytelling, and I wanted to share something new with the audience. The excitement around ‘KA’ grew as we developed the story, boosting our confidence.
I believed that setting the story in a period backdrop would add to its appeal. Today, privacy is nearly nonexistent, and everything is exposed on social media. In contrast, there was a time when one could only learn about others’ lives through letters. This inspired us to create a postman character for the hero. We chose the village of Krishnagiri for its unique characteristics; I read that it experiences darkness in the afternoon, which we adapted into the story. This backdrop added to the film’s excitement.
We structured the story from the climax, ensuring that every point was justified in the script. The music by Sam CS was a major highlight, enhancing the film’s overall experience. We believe that hiring Sam was one of our best decisions.
Going forward, our films will focus on strong content, unique narratives, and innovative ideas. We are considering a prequel to ‘KA’ that will explore the background of Krishnagiri village and the reasons behind its uniqueness.”
Director Sandeep added:
“The audience’s response to ‘KA’ is immensely satisfying. Whenever negative feedback appears on social media, the audience is quick to defend us. Sujith and I often critique our scripts. Sujeeth handled the scripting for ‘KA,’ while I focused on execution. In light of ‘KA’s’ success, we want to thank the audience, Kiran, our producer Gopalakrishna garu, and distributor Vamsi garu.
The premise is crucial for any story, and we ensured this for ‘KA.’ Typically, we categorize audiences into A, B, and C segments. We thought the film would resonate well with multiplex audiences but were surprised to find that the C-center audience is responding even more favorably. Seeing houseful boards at theaters is a fantastic feeling, and we’re thrilled with the response across AP and Telangana.
Kiran treated us like brothers and provided tremendous support, which was vital to our success. We gained confidence when distributor Vamsi Nandipati joined our project; we felt our film was in safe hands, and his suggestions were invaluable. When we met music director Sam CS in Chennai and shared our story, he predicted success not only in Telugu but across all languages.
Many have praised the graphic work in ‘KA.’ However, I believe that graphics should enhance the story naturally rather than just being visually striking.
The audience’s response to ‘KA’ has been very positive, and media reviews have also been encouraging, though they come from various perspectives. Some critics mentioned that the film lacks certain commercial elements, but our aim was to present the story authentically. We are committed not just to releasing the film but to ensuring it reaches the audience effectively.
As Director Rajamouli has said, a good subject, not just a high budget, can elevate films to an international level. We will strive to make our upcoming projects innovative.”
“క” సినిమాకు ప్రేక్షకుల ప్రశంసలే ఎంతో ఆనందాన్నిస్తున్నాయి – దర్శకులు సుజీత్, సందీప్
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క” రీసెంట్ గా థియేటర్స్ లోకి వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద దీపావళి విజేతగా నిలిచింది. థ్రిల్లర్ సినిమాల్లో ఓ సరికొత్త ప్రయత్నంగా “క” సినిమా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ చిత్రాన్ని ప్రేక్షకుల్ని థ్రిల్ చేసేలా రూపొందించి దర్శకులుగా తొలి చిత్రంతోనే తమ ప్రతిభ నిరూపించుకున్నారు సుజీత్, సందీప్. “క” సినిమా సక్సెస్ పట్ల తమ సంతోషాన్ని లేటెస్ట్ ఇంటర్వ్యూలో పంచుకున్నారీ దర్శక సోదరులు.
దర్శకుడు సుజీత్ మాట్లాడుతూ
- “క” సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ ఫీలింగ్ ను మాటల్లో చెప్పలేకపోతున్నాం. ఇక్కడ విజయం సాధిస్తేనే మనుగడ అనుకున్నాం. అందుకే పట్టుదలగా సినిమా చేశాం. ప్రేక్షకులు మేము ఆశించిన ఫలితాన్ని ఇచ్చారు. ఈ దీపావళిని ఎంతో స్పెషల్ చేశారు. మా కుటుంబ సభ్యుల సంతోషానికి హద్దు లేదు. కిరణ్ గారు మమ్మల్ని సోదరుల్లా చూశారు. ప్రొడక్షన్ నుంచి ప్రతి విషయం ఆయన దగ్గరుండి చూసుకున్నారు. మాదాకా ఏ ఒత్తిడి రానీయలేదు.
- థియేటర్స్ లో ప్రేక్షకులు సినిమా చూస్తూ చివరలో స్టాండింగ్ ఓవేషన్ ఇస్తున్నారు. మేము “క” కథ అనుకున్నప్పుడు ఇది ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయపడ్డాం. కానీ ఈరోజు ప్రేక్షకులు కథకు చాలా కనెక్ట్ అవుతున్నారు. మాకు ఇండస్ట్రీలో ఏ పరిచయాలూ లేవూ. నేను యాడ్ ఏజెన్సీలో వర్క్ చేసేవాడిని. సందీప్ తన వర్క్ లో తను బిజీగా ఉండేవాడు. మేము బ్రదర్స్. కథలు రాయడాన్ని ఇష్టపడుతుంటాను. ప్రేక్షకులకు ఒక కొత్త కథను చెప్పాలి, యూనిక్ పాయింట్ తో మూవీ చేయాలని ఉండేది. “క” సినిమా కథను ఎవరికి చెప్పినా చాలా ఎగ్జైట్ అయ్యారు. అక్కడి నుంచే మాలో కాన్ఫిడెన్స్ మొదలైంది.
- “క” సినిమా కథను పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో చెబితే మరింత ఎగ్జైటింగ్ గా ఉంటుందని అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మన జీవితాల్లో ప్రైవసీ లేదు. సోషల్ మీడియాలో ప్రతి విషయం తెలుస్తోంది. కానీ ఒకప్పుడు ఉత్తరాల ద్వారా తప్ప మరొకరి జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే వీలు లేదు. అందుకే హీరోకు పోస్ట్ మ్యాన్ క్యారెక్టర్ డిజైన్ చేశాం. కొన్ని ప్రత్యేకతలు ఉండేలా కృష్ణగిరి అనే ఊరిని తీసుకున్నాం. మధ్యాహ్నమే చీకటి పడటం అనేది తెలంగాణలో ఒక ఊరిలో జరుగుతుందని చదివాను. ఆ పాయింట్ ను కృష్ణగిరికి అడాప్ట్ చేశాం. ఈ బ్యాక్ డ్రాప్ లో మేము అనుకున్న అంశాలు మరింత ఎగ్జైటింగ్ గా మారాయి.
- క్లైమాక్స్ నుంచి కథ సిద్దం చేసుకుని వాటికి ఒక్కో పాయింట్ జస్టిఫికేషన్ ఇస్తూ స్క్రిప్ట్ చేశాం. మా మూవీకి సామ్ సీఎస్ ఇచ్చిన మ్యూజిక్ పెద్ద ఫ్లస్ పాయింట్ అయ్యింది. సినిమా మొత్తం బ్యాక్ గ్రౌండ్ లో ఒక సౌండ్ క్రియేట్ చేశారాయన. సామ్ గారిని తీసుకోవడం మేము తీసుకున్న బెస్ట్ డెసిషన్స్ అనుకుంటాం.
- ఇకపై మేము చేసే సినిమాలు కూడా స్ట్రాంగ్ కంటెంట్ తోనే యూనిక్ స్టోరీస్ తో ఇంటర్నేషనల్ రేంజ్ ఐడియాస్ ఉన్న సినిమాలు చేస్తాం. క సినిమాకు ప్రీక్వెల్ చేసే ఆలోచన ఉంది. కృష్ణగిరి ఊరు నేపథ్యం ఏంటి ఆ ఊరిలోని ప్రత్యేకతలకు కారణాలు ఏంటి అనే అంశాలు క ప్రీక్వెల్ లో చూస్తారు.
దర్శకుడు సందీప్ మాట్లాడుతూ- “క” సినిమాకు ప్రేక్షకులు ఇచ్చిన విజయం ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని ఇస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కడైనా మా సినిమా గురించి నెగిటివ్ గా వస్తే ప్రేక్షకులే వాటికి సమాధానాలు ఇస్తున్నారు. నేను సుజీత్ తరుచూ కొన్ని స్క్రిప్ట్స్ అనుకుంటుండేవాళ్లం. “క” సినిమాకు స్క్రిప్ట్ వర్క్ సుజీత్ చేశాడు. నేను మిగతా ఎగ్జిక్యూషన్ చూసుకున్నాను. “క” సక్సెస్ సందర్భంగా ప్రేక్షకులతో పాటు హీరో కిరణ్ గారికి, మా ప్రొడ్యూసర్ గోపి గారికి, డిస్ట్రిబ్యూటర్ వంశీ గారికి థ్యాంక్స్ చెబుతున్నాం.
- ఏ కథకైనా ప్రిమైజ్ ముఖ్యం. క సినిమాకు మేము చేసింది అదే. సాధారణంగా ఏ కథైనా ఫలానా ఏ, బీ, సీ ఆడియెన్స్ కు నచ్చుతుందని విభజించుకుంటాం. క సినిమా మల్టీప్లెక్స్ ఆడియెన్స్ కు బాగా రీచ్ అవుతుంది. సీ సెంటర్ లో కొంత తక్కువగా ఆదరిస్తారు అనుకున్నాం. కానీ ఈ రోజు రిజల్ట్ చూస్తుంటే సీ సెంటర్ ఆడియెన్స్ మల్టిప్లెక్స్ ఆడియెన్స్ కన్నా ఎక్కువగా సినిమాను ఇష్టపడుతున్నారు. ఇది మాకు చాలా ఆనందిన్నిస్తోంది. ఒకప్పుడు థియేటర్స్ దగ్గర హౌస్ ఫుల్ బోర్డ్స్ చూశాం. ఇప్పుడు మా సినిమాకు అలా హౌస్ ఫుల్స్ కావడం గ్రేట్ ఫీల్ ఇస్తోంది. ఏపీ తెలంగాణ అంతటా థియేటర్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.
- కిరణ్ గారు మమ్మల్ని బ్రదర్స్ లా చూసుకుని సపోర్ట్ చేశారు. ఆయన వల్లే ఇంత ఘన విజయం మాకు సాధ్యమైంది. డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి గారు మా ప్రాజెక్ట్ లోకి వచ్చినప్పుడే మాకు ఎంతో నమ్మకం కలిగింది. మన సినిమా సేఫ్ హ్యాండ్స్ లోకి వెళ్లిందని అనుకున్నాం. ఆయన కూడా చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్ ను చెన్నైలో కలిసి కథ చెప్పగానే..ఇది తెలుగులోనే కాదు ఏ భాషలోనైనా మంచి విజయం సాధిస్తుందని అన్నారు.
- “క” సినిమాలో గ్రాఫిక్ వర్క్ గురించి చాలా మంది ప్రశంసిస్తున్నారు. నా దృష్టిలో గ్రాఫిక్ వర్క్ అంటే విజువల్స్ లో గ్రాఫిక్ అని తెలియకూడదు. అలా నాచురల్ గా గ్రాఫిక్ వర్క్ ఉండేలా చూసుకున్నాం.
- “క” సినిమాకు ప్రేక్షకుల దగ్గర నుంచి వస్తున్న రెస్పాన్స్ ఎక్కువ సంతోషాన్నిస్తోంది. మీడియా నుంచి కూడా చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. అయితే సినిమాను ఎవరి కోణంలో వారు చూస్తారు. కొందరు కమర్షియల్ ఎలిమెంట్స్ కాస్త తక్కువగా ఉన్నాయని అన్నారు. మేము కథను జెన్యూన్ గా స్క్రీన్ మీదకు తీసుకురావాలనే అనుకున్నాం. సినిమా రిలీజ్ చేయడమే కాదు ప్రేక్షకులకు బాగా రీచ్ అయ్యేలా ప్రయత్నిస్తున్నాం.
- బడ్జెట్ కాదు సబ్జెక్ట్ బాగుంటే ఇంటర్నేషనల్ లెవెల్ కు సినిమాలు తీసుకెళ్లవచ్చని డైరెక్టర్ రాజమౌళి గారు చెప్పినట్లు మా రాబోయే సినిమాలను సరికొత్తగా రూపొందించే ప్రయత్నం చేస్తాం.