‘సంక్రాంతికి వస్తున్నాం’ జనవరి 14న విడుదల – విక్టరీ వెంకటేష్
Jathara is inspired by true incidents – Shivashankar Reddy
The movie Jathara, directed and led by actor Satish Babu Ratakonda with Deeya Raj as the female lead, is produced by Radha Krishna Reddy and Shivashankar Reddy under the Radha Krishna Production banner, in association with Movietech LLC, presented by Galla Manjunath. This film is crafted with a unique, intense drama storyline that no one has explored so far. It against the backdrop of Chittoor district and revolves around a festival atmosphere. Jathara is set to release in theaters on the 8th of this month, and the producer Shivashankar Reddy recently shared details about the film with the media.
- Producer Shivashankar Reddy mentioned, “I had previously produced a movie featuring Actor Sai Kumar and Vinod Kumar. I have a deep passion for films, and when my friend Satish narrated a unique story concept to me, it immediately resonated with me. Satish developed this story based on real-life incidents. I was highly impressed by the story and decided to produce it.”
- This movie is inspired by true incidents that happened in Chittoor district. The story revolves around a protective deity worshipped by 18 villages, bringing a sense of visual wonder with high technical standards. Prasad’s cinematography is said to be mesmerizing, with excellent CGI work. Pranav’s songs and background score (RR) are expected to be the lifeblood of the movie.
- The Jathara movie was filmed over three schedules spanning 73 days. Despite continuous rain during the shooting, there were no interruptions in the process, which the producer attributes to the blessings of Paletamma (a local deity). The film crew consisted entirely of new talents, including a fresh technical team, yet the film looks like a project handled by experienced professionals. Everyone worked passionately on Jathara, and the film was created to be a family-friendly experience without any vulgarity.
- The censor board did not suggest any cuts and even praised the movie, saying that while the whole movie is great, the last 20 minutes will take you to another level. Feedback from the premiere screenings has been highly positive.
- Satish not only directed but also acted in the film, and the producer mentioned that Satish was the perfect choice to direct the story he created. As a lead actor, he has done justice to the role, delivering an excellent performance.
- Jathara promises to captivate everyone with its fresh storyline and cinematic appeal. This kind of subject has not been explored in recent times, and the film is expected to appeal to a broad audience.
కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం.. ‘జాతర’ నిర్మాత శివశంకర్ రెడ్డి
సతీష్ బాబు రాటకొండ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా ‘జాతర’. దీయా రాజ్ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రాన్ని గల్లా మంజునాథ్ సమర్పణలో మూవీటెక్ ఎల్‌ఎల్‌సితో కలిసి రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మించారు. ఇంత వరకు ఎవ్వరూ టచ్ చేయని పాయింట్‌తో రగ్డ్గా, ఇంటెన్స్ డ్రామాతో ‘జాతర’ తెరకెక్కింది. చిత్తూరు జిల్లా బ్యాక్ డ్రాప్లో జరిగే జాతర నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 8న థియేటర్లోకి రాబోతోంది. ఈ క్రమంలో నిర్మాత శివ శంకర్ రెడ్డి చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు.- సాయి కుమార్, వినోద్ కుమార్ కాంబోలో ఇది వరకు ఓ సినిమాను నిర్మించాను. నాకు సినిమాలంటే చాలా ఇష్టం. ఈ క్రమంలో నా స్నేహితుడు సతీష్ చెప్పిన ఓ పాయింట్ చాలా నచ్చింది. అదే జాతర కథ. సతీష్ బాబు ఈ జాతర కథను యథార్థ సంఘటనల ఆధారంగా రాసుకున్నారు. నాకు కథ చాలా నచ్చింది. అందుకే సినిమాను నిర్మించాను.
- చిత్తూరు జిల్లాలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ కథను సతీష్ బాబు రాశారు. 18 గ్రామాలకు కాపు కాసే దేవత.. చుట్టూ ఈ కథ తిరుగుతుంది. విజువల్ వండర్‌గా ఈ సినిమా ఉంటుంది. టెక్నికల్‌గా హై స్టాండర్డ్‌లో ఈ మూవీ ఉంటుంది. ప్రసాద్ కెమెరా వర్క్ అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. సీజీ వర్క్ కూడా చక్కగా కుదిరింది. ప్రణవ్ అందించిన పాటలు, ఇచ్చిన ఆర్ఆర్ సినిమాకు ప్రాణంగా నిలుస్తుంది.
- జాతర చిత్రాన్ని మూడు షెడ్యూల్స్‌లో 73 రోజుల పాటు చిత్రీకరించాం. షూటింగ్ చేసినన్ని రోజులు వర్షం పడుతూనే వచ్చింది. కానీ ఎప్పుడూ షూటింగ్‌కు ఆటంకం కలగలేదు. అదంతా కూడా పాలేటమ్మ మహిమ అని నేను నమ్ముతాను. మాకు ఎక్కడా కూడా అంతరాయం కలగలేదు.
- జాతర చిత్రానికి అందరూ కొత్త వాళ్లే పని చేశారు. టెక్నికల్ టీం కూడా కొత్తదే. కానీ చాలా అనుభవం ఉన్నవాళ్లు తీసిన చిత్రంలా ఉంటుంది. అందరూ ప్రాణం పెట్టి ఈ జాతర కోసం పని చేశారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా తెరకెక్కించాం. మా చిత్రంలో ఎక్కడా కూడా అసభ్యత అనేది ఉండదు.
- సెన్సార్ వాళ్లు ఎక్కడా మాకు కట్స్ చెప్పలేదు. సినిమా అంతా ఒకెత్తు అయితే.. చివరి 20 నిమిషాలు ఇంకో ఎత్తు అని ప్రశంసించారు. అందరూ చూడదగ్గ చిత్రాన్ని తీశామని అన్నారు. ప్రీమియర్ల నుంచి కూడా మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
- సతీష్ గారు ఈ చిత్రానికి దర్శకుడిగా, హీరోగా న్యాయం చేశారు. సతీష్ బాబు కథ చెప్పిన తరువాత ఆయన దర్శకత్వం చేయడమే కరెక్ట్ అనిపించింది. హీరోగా కూడా ఆయన అయితేనే బాగుంటుందని అనుకున్నాం. ఆయన జాతర చిత్రాన్ని అద్భుతంగా తీశారు. అద్భుతంగా నటించారు.
- జాతర అనే చిత్రం అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. ఎక్కడా చిన్న చిత్రం అన్నట్టుగా ఉండదు. చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి సబ్జెక్ట్‌తో సినిమా రాలేదు. అందరినీ ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుంది.