Thug Life release date announced with a Visual Feast teaser
Ulaganayakan Kamal Haasan is a living legend of Indian Cinema. The multi-faceted actor has a crazy list of cult films over his 6 decades of film career and he is still hungry to deliver something unique, creative and absolutely fresh to audiences. Many directors wish to work with him at least once in their lifetime as the actor is himself an university in understanding and executing films.
Equally popular and highly respected legendary director Mani Ratnam has shot to universal acclaim and tremendous craze with his unparalleled vision and sharp writing. The director and actor have delivered an all-time classic like Nayakan/ Nayakudu 37 years ago. The all-time classic Indian film has cult following among audiences over generations and it has been only Indian film to be listed among Time Magazine’s 100 All-time classics in World Cinema.
So, the expectations are huge from the prominent combination when they have announced their next film, Thug Life. Many fans and movie-lovers have been waiting for this combination to materialise and they finally decided it is time after 37 years to unite and deliver an epic action drama. The expectations from this combination have grown even high after Kamal Haasan’s Vikram and Mani Ratnam’s Ponniyin Selvan movies.
Adding to the excitement, Silambarasan TR aka Simbu has joined the cast for a prominent lead role. STR has earned the name as a great performer and many wished to see him share screen with the great Kamal Haasan. After an exciting gangster drama film like Chekka Chivantha Vaanam/ Nawab, Simbu is acting in a Mani Ratnam film as well.
On the occasion of Kamal Haasan’s birthday, the makers have released a scintillating teaser that grows our intrigue towards the film and showcases the visual feast that is on offer for us from the mastercraftsmen. The breathtaking visuals and action shots promise a grand epic action adventure.
Also, Kamal Haasan in different looks adds to the intrigue with some call backs to Nayakan film. The makers have announced the movie release date along with the teaser and it is releasing grandly on 5th June, 2025.
The exciting ensemble cast of the film includes Trisha Krishnan, Ashok Selvan, Aishwarya Lekhsmi, Abhirami, Nasser and Joju George. Prominent cinematographer Ravi K. Chandran is handling cinematography for this visual extravaganza and National Award winning editor Sreekar Prasad is editing it.
Musical legend AR Rahman is composing music for the film while famous stunt choreographers Anbariv are composing action. Sharmishta Roy is handling production design and Eka Lakhani is the costume designer.
The high budget actioner is produced by Kamal Haasan, Mani Ratnam, R. Mahendran & Siva Ananth on Raaj Kamal Films International with Madras Talkies and Udayanidhi Stalin’s Red Giant Movies is presenting it. More details to be announced soon.
Cast: Kamal Haasan, Silambarasan TR, Trisha, Ashok Selvan, Aishwarya Lekshmi, Joju George, Abhirami and Nasser
Banner: Raaj Kamal Films International, Madras Talkies & Red Giant Movies
Producers: Kamal Haasan, Mani Ratnam, R. Mahendran & Siva Ananth
Writer & Director: Mani Ratnam
Director of Photography: Ravi K. Chandran
Editor: Sreekar Prasad
Action: Anbariv
Production Designer: Sharmishta Roy
Choreography: Kruti Mahesh Midya
Costume Designer: Eka Lakhani
PRO: Vamsi- Shekar
ఉలగనాయకన్ కమల్ హాసన్, మణిరత్నం, శింబు, త్రిష హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘థగ్ లైఫ్’ విజువల్ ఫీస్ట్ టీజర్‌తో రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్
ఉలగనాయకన్ కమల్ హాసన్ ఇండియన్ సినిమా లివింగ్ లెజెండ్. 6 దశాబ్దాల సినీ కెరీర్లో ఎన్నో కల్ట్ క్లాసిక్ విజయాలతో, ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు సరికొత్తగా అద్భుతమైన సినిమాలిని అందించాలనే తపనతో పని చేస్తున్నారు. చాలా మంది దర్శకులు తమ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా కమల్ హాసన్ తో కలిసి పనిచేయాలని కోరుకుంటారు, ఎందుకంటే సినిమాలని చేయడంలో కమల్ హాసన్ ఓ యూనివర్సిటీ.
తన అద్భుతమైన విజన్, రైటింగ్, డైరెక్షన్ తో అశేషమైన ప్రేక్షకాదరణ పొందిన లెజెండరీ దర్శకుడు మణిరత్నం. కమల్ హాసన్, మణిరత్నం 37 సంవత్సరాల క్రితం నాయకన్/నాయకుడు లాంటి ఆల్-టైమ్ క్లాసిక్‌ని అందించారు. ఈ ఆల్-టైమ్ క్లాసిక్ ఇండియన్ ఫిల్మ్ తరతరాలుగా ప్రేక్షకులలో కల్ట్ ఫాలోయింగ్ వుంది. టైమ్ మ్యాగజైన్ ప్రపంచ సినిమాల్లోని 100 ఆల్-టైమ్ క్లాసిక్స్ జాబితాలో వున్న ఏకైక భారతీయ చిత్రం ఇది.
ఇలాంటి సెన్సేషనల్ కాంబినేషన్ లో వారి అప్ కమింగ్ మూవీ ‘థగ్ లైఫ్’ను ప్రకటించినప్పుడే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చాలా మంది అభిమానులు, సినీ ప్రేమికులు ఈ కాంబినేషన్ కోసం వేచి ఉన్నారు. చివరకు వారు 37 సంవత్సరాల తర్వాత ఒక ఎపిక్ యాక్షన్ డ్రామాను అందించడానికి రెడీ అయ్యారు. కమల్ హాసన్ విక్రమ్, మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ సినిమాల తర్వాత ఈ కాంబినేషన్ పై అంచనాలు మరింతగా పెరిగాయి.
మరింత ఎక్సయిట్మెంట్ ని యాడ్ చేస్తూ సిలంబరసన్ టిఆర్ అకా శింబు, ఈ సినిమా తారాగణంలో చేరారు. STR, కమల్ హాసన్‌తో స్క్రీన్‌ను షేర్ చేసుకోవాలని అభిమానులు ఎప్పటినుంచో కోరుకున్నారు. చెక్క చివంత వానం/నవాబ్ వంటి అద్భుతమైన గ్యాంగ్‌స్టర్ డ్రామా చిత్రం తర్వాత శింబు, మణిరత్నం చిత్రంలో నటిస్తున్నారు.
కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా, మేకర్స్ ఒక అద్భుతమైన టీజర్‌ను విడుదల చేసారు, అది సినిమాపై క్యురీయాసిటీని మరింత పెంచింది. ఇది విజువల్ ఫీస్ట్ గా వుంది. బ్రెత్ టేకింగ్ విజువల్స్, యాక్షన్ షాట్లు గ్రేట్ ఎపిక్ యాక్షన్ అడ్వెంచర్‌ని ప్రామిస్ చేశాయి.
అలాగే, కమల్ హాసన్ డిఫరెంట్ లుక్స్‌తో పాటు నాయకన్ మూవీ కొన్ని కాల్ బ్యాక్స్ ఎక్సయిట్మెంట్ ని పెంచాయి. టీజర్‌తో పాటు సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ అనౌన్స్ చేశారు, ఈ సినిమా జూన్ 5, 2025న గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ చిత్రంలో త్రిష కృష్ణన్, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లేఖి, అభిరామి, నాజర్, జోజు జార్జ్ లాంటి ప్రముఖ స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ విజువల్ వండర్ కి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చేస్తున్నారు.
మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్లు అన్బరీవ్ యాక్షన్ కంపోజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి శర్మిష్ట రాయ్ ప్రొడక్షన్ డిజైన్‌ను నిర్వహిస్తుండగా, ఏకా లఖాని కాస్ట్యూమ్ డిజైనర్.
మద్రాస్ టాకీస్, రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్పై కమల్ హాసన్, మణిరత్నం, ఆర్. మహేంద్రన్ & శివ అనంత్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ ఈ సినిమాని సమర్పిస్తోంది.
తారాగణం: కమల్ హాసన్, సిలంబరసన్ TR, త్రిష, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్, అభిరామి, నాజర్
బ్యానర్స్: రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ & రెడ్ జెయింట్ మూవీస్
నిర్మాతలు: కమల్ హాసన్, మణిరత్నం, ఆర్. మహేంద్రన్ & శివ అనంత్
రచన, దర్శకత్వం: మణిరత్నం
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: రవి కె. చంద్రన్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
యాక్షన్: అన్బరివ్
ప్రొడక్షన్ డిజైనర్: శర్మిష్ట రాయ్
కొరియోగ్రఫీ: కృతి మహేష్ మిధ్య
కాస్ట్యూమ్ డిజైనర్: ఏకా లఖానీ
పీఆర్వో: వంశీ- శేఖర్