
Ari is an engaging film from start to finish – Director Jayashankarr
Under the banner of ARVY Cinemas, the film “Ari” is presented by Ramireddy Venkateshwara Reddy (RV Reddy) and produced by Srinivas Ramireddy D, Sheshureddy Maramreddy, Dr. Thimmappa Naidu Purimetla, and Biram Sudhakar Reddy, with Linga Gunapaneni as the co-producer. The film carries the tagline “My Name is Nobody.” Starring Vinod Varma, Anasuya Bharadwaj, Sai Kumar, and Srikanth Iyengar in key roles, the movie is directed by Jayashankarr, the talented filmmaker who rose to fame with Paper Boy. Ari is set for a worldwide grand theatrical release on October 10 through Asian Suresh Distribution. In a recent interview, director Jayashankarr spoke in detail about the highlights of the film.
“I left a good job purely out of passion for cinema and entered the film industry in 2014. Within four years, I made my debut as a director with Paper Boy (2018). I received offers from big production houses after my first film, but due to the pandemic and other circumstances, those projects didn’t materialize. In 2021, I began working on Ari.”
“I’ve always been deeply fascinated by our Puranas and epics. They talk about conquering the Arishadvargas (the six inner enemies, desire, anger, greed, attachment, pride, jealousy), but they never explain how to conquer them. The idea for Ari struck me in 2016. I even went to the Himalayas to meet yogis and discuss this concept. They guided me with several insights and methods to overcome the Arishadvargas, which became the foundation of this story. I didn’t want to make a preachy film, I wanted to tell it in an entertaining way, and I believe I’ve succeeded. Viva Harsha’s comedy portions will make audiences laugh heartily.”
“Ari could have easily been made with stars, but then their stardom might have overshadowed the essence of the roles. That’s why I chose actors like Sai Kumar, Anasuya, and Viva Harsha who perfectly fit the characters. The performances of all six lead actors will be a highlight of the film. Every character will leave a strong impression.”
“I didn’t make this film to deliver a message. I’m a big admirer of Upendra’s films, they carry a strong commercial appeal with deep philosophical layers. His style inspired me to make Ari. When I narrated the story, every actor felt emotionally connected to it and said such a subject hasn’t been attempted before.”
“The VFX work will be one of the film’s major attractions. Despite working within our budget limits, we achieved high-quality visuals. We also utilized AI technology for some sequences. The film has two songs, both of which received an excellent response.”
“The story deals with how human desires are intertwined, when we get what we want, ego arises; when others get it, envy takes over. These emotional contradictions are portrayed engagingly.”
“I made Ari in a way that even general audiences can easily understand the concept of Arishadvargas. That’s one reason the production took time to make it simple yet profound. The censor board appreciated the film and said it was heart-touching. They commended the storytelling and emotional depth. I’m confident the film will get strong openings because audiences always support meaningful cinema.”
“Eminent personalities like Venkaiah Naidu, Malladi, and Yandamoori Veerendranath watched Ari and appreciated it. Venkaiah Naidu garu called it a modern Bhagavad Gita, saying that even youth who haven’t read our epics will understand their essence through this film. We took that as a huge compliment. Ashwini Dutt also watched the movie and praised it. Moreover, a major Bollywood hero and a Kannada star saw the film and loved it. If all goes well, we’re planning remakes in Hindi and Kannada with them.”
“To make a film like Ari, producers need not just taste but courage. I’m blessed to have such supportive producers. This is not a regular movie; it’s experimental in nature. The budget went over the initial plan, but they continued supporting me wholeheartedly. Not every movie appeals to everyone — we know that. But just as there are people who go to pubs, there are many more who visit temples. We made this film for that spiritually inclined audience.”
“Ari will also resonate strongly with youth audiences. The pre-climax maintains suspense and curiosity about what will happen next, while the last 20 minutes, the climax will be exceptional. The story revolves around how far people go to achieve what they desire.”
“Up next, I’m working on a new project starring Jacqueline Fernandez, which will go on floors in December.”
‘అరి’ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది, ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది – డైరెక్టర్ జయశంకర్
ఆర్వీ సినిమాస్ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ( ఆర్ వీ రెడ్డి ) సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి, శేషురెడ్డి మారంరెడ్డి, డా. తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘అరి’. లింగ గుణపనేని కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. “పేపర్ బాయ్” చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ‘అరి’ సినిమా ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 10వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో ఈ సినిమా హైలైట్స్ తెలిపారు డైరెక్టర్ జయశంకర్.
– సినిమాల మీద ప్యాషన్ తో మంచి ఉద్యోగం వదులుకుని ఇండస్ట్రీకి వచ్చాను. 2014లో టాలీవుడ్ లో అడుగుపెట్టి నాలుగేళ్లకు 2018లో పేపర్ బాయ్ మూవీతో దర్శకుడిని అయ్యాను. తక్కువ టైమ్ లోనే దర్శకుడివి అయ్యావు అన్నారు. నా మొదటి సినిమా తర్వాత పెద్ద సంస్థల నుంచి ఆఫర్స్ వచ్చాయి. అయితే కోవిడ్, ఇతర పరిస్థితుల వల్ల ఆ ప్రాజెక్ట్స్ మొటీరియలైజ్ కాలేదు. అప్పుడు బయటకు వచ్చి 2021లో అరి మూవీకి వర్క్ చేయడం ప్రారంభించాను.
– నాకు చిన్నప్పటి నుంచి పురాణాలు, ఇతిహాసాలు అంటే ఆసక్తి. వాటి గురించి తెలుసుకుని, అవగాహన పెంచుకున్నాను. మన పురణాల్లో అరిషడ్వర్గాలను జయించాలి అని చెప్పారే తప్ప ఎక్కడా వాటిని ఎలా జయించాలో చెప్పలేదు. 2016లో ఈ స్టోరీ ఐడియా వచ్చింది. హిమాలయాలకు వెళ్లి కొందరు యోగులను కలిసి అరిషడ్వర్గాల గురించి సినిమా చేయాలనే ఆలోచనను తెలిపాను. వారు మంచి ప్రయత్నమని చెప్పి అనేక విషయాలు వెల్లడించారు. అరిషడ్వర్గాలను జయించేందుకు వారి ద్వారా మార్గాలు, సూచనలు తెలుసుకున్నాను. వాటి ఆధారంగానే ఈ ‘అరి’ చిత్రాన్ని రూపొందించాను. ఇలాంటి కథల్ని పూర్తిగా సందేశాత్మకంగా కాకుండా ఎంటర్ టైనింగ్ గా చెప్పాలి. ఆ ప్రయత్నంలో సఫలమయ్యాననే అనుకుంటున్నా. వైవా హర్ష కామెడీ బాగా నవ్విస్తుంది.
– ‘అరి’ లాంటి మూవీని స్టార్స్ కూడా చేయొచ్చు. అయితే పాత్రల కంటే వారి స్టార్ డమ్ రిఫ్లెక్ట్ అవుతుందని పాత్రలకు సరిపోయేలా సాయి కుమార్, అనసూయ, వైవా హర్ష ..ఇలాంటి వారిని తీసుకున్నాను. ఆరు ప్రధాన పాత్రల్లో నటించిన నటీనటుల పర్ ఫార్మెన్స్ హైలైట్ గా నిలుస్తుంది. ఈ పాత్రలన్నీ మీకు బాగా గుర్తుండిపోతాయి. సందేశం ఇవ్వాలని ఈ మూవీ రూపొందించలేదు. నాకు ఉపేంద్ర గారి మూవీస్ బాగా ఇష్టం. ఆయన సినిమాలు కమర్షియల్ గా ఉంటూనే ఒక మెసేజ్ ఉంటుంది. ఉపేంద్ర మూవీ చూసినప్పుడు అలా ఒక సినిమా తెరకెక్కించాలనే ఆలోచన కలిగింది. ‘అరి’ కథ చెప్పినప్పుడు మా మూవీలో నటించిన ఆర్టిస్టులంతా హ్యాపీగా ఫీలయ్యారు. ఇలాంటి సబ్జెక్ట్ తో మూవీ రాలేదని అన్నారు.
– మా ‘అరి’ మూవీలో వీఎఫ్ఎక్స్ ఆకర్షణగా నిలుస్తాయి. మాకున్న బడ్జెట్ లో క్వాలిటీ విజువల్ ఎఫెక్టులు చేశాం. అలాగే ఏఐ టెక్నాలజీని కూడా ఉపయోగించాం. సినిమాలో రెండు సాంగ్స్ ఉంటాయి. ఆ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మనిషి కోరికలన్నీ ఒకదానితో మరొకటి ముడిపడే ఉంటాయి. మనం కోరుకున్నది దక్కినప్పుడు అహం ఏర్పడుతుంది, అదే పక్కవారికి దక్కితే అసూయ కలుగుతుంది.
– అరిషడ్వర్గాలు అనే సబ్జెక్ట్ సాధారణ ప్రేక్షకులకు కూడా సులువుగా అర్థమయ్యే విధంగా ‘అరి’ సినిమాను రూపొందించాను. ఈ కారణం వల్లే చిత్రీకరణ ఆలస్యమైంది. వీలైనంత సింపుల్ గా ఈ సబ్జెక్ట్ ను తెరకెక్కించాం. సెన్సార్ వాళ్లు సినిమా చూసి అప్రిషియేట్ చేశారు. హార్ట్ టచింగ్ గా మూవీ రూపొందించారని ప్రశంసించారు. మా సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయని ఆశిస్తున్నా. ఎందుకంటే మంచి సినిమాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు.
– వెంకయ్య నాయుడు, మల్లాది, యండమూరి లాంటి వాళ్లు మా సినిమాను చూసి అభినందించారు. వెంకయ్య నాయుడు గారు ‘అరి’ సినిమా చూసి మోడరన్ భగవద్గీతలా ఉంది అన్నారు. పురణాలు, ఇతిహాసాలు చదవని యువత ఈ సినిమా చూస్తే వాటిలోని సారం తెలుస్తుంది అన్నారు. ఆయన మాటల్ని గొప్ప ప్రశంసగా తీసుకున్నాం. అశ్వనీదత్ గారు కూడా మా మూవీ చూసి అభినందించారు. మా మూవీని హిందీలో ఒక పెద్ద హీరో, కన్నడలో ఒక స్టార్ చూశారు. వారికి బాగా నచ్చింది. అన్నీ కుదిరితే వారితో ఆయా భాషల్లో ‘అరి’ రీమేక్ చేస్తా.
-‘అరి’ లాంటి మూవీ చేయాలంటే నిర్మాతలకు అభిరుచితో పాటు ధైర్యం ఉండాలి. అలాంటి ప్రొడ్యూసర్స్ నాకు దొరకడం సంతోషంగా ఉంది. ఇది రెగ్యులర్ మూవీ కాదు, రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియదు. షూటింగ్ లో కొంత బడ్జెట్ పెరిగింది. అయినా ఇప్పటికీ వారు సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు. ఏ సినిమా కూడా ప్రేక్షకులందరికీ యునానమస్ గా నచ్చదు. మన దేశంలో పబ్బులకు వెళ్లేవాళ్లు ఎంతమంది ఉన్నారో, గుడికి వెళ్లేవారు కూడా అంతకంటే ఎక్కువే ఉన్నారు. అలా స్పిరిచువల్ ఆలోచనలు ఉన్నవారు మా సినిమాను చూసినా చాలు అనుకుంటున్నాం.
‘అరి’ సినిమా యూత్ ఆడియెన్స్ కు కూడా బాగా కనెక్ట్ అవుతుంది. ప్రీ క్లైమాక్స్ వరకు మా మూవీ ఏం జరుగుతుంది నెక్ట్స్ అనే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. క్లైమాక్స్ 20 నిమిషాలు మాత్రం ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. తమకు కావాల్సినది దక్కించుకునేందుకు కొందరు వ్యక్తులు ఏం చేశారు అనేది ఈ చిత్ర నేపథ్యం. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తో ఓ సినిమా చేయబోతున్నా. డిసెంబర్ నుంచి ఆ మూవీ షూటింగ్ కు వెళ్తున్నాం.