ప్రేక్షకుల మనసులని గెలిచి సక్సెస్ ఫుల్ గా 25 రోజులు పూర్తి చేసుకున్న
Thalapathy Vijay’s Final Film Launched with Grand Muhurat Puja
The much-anticipated film Thalapathy 69 officially commenced with a traditional muhurat puja, held on the second day of Navratri. The event brought together an impressive ensemble of cast and crew, including the iconic Thalapathy Vijay, Bollywood star Bobby Deol, and the talented Pooja Hegde, creating an atmosphere of excitement and reverence.
Following this auspicious start, filming is set to begin tomorrow, marking the next step in what promises to be a historic project for Thalapathy Vijay.
Produced by KVN Productions, Thalapathy 69 holds special significance as it marks Thalapathy Vijay’s final appearance on the big screen, making this an emotional and historic project for his fans. The film is set to begin shooting soon, and the muhurat puja serves as a promising start to a journey that is expected to resonate deeply with audiences across India.
In addition to Vijay, Pooja Hegde, and Bobby Deol, the film boasts a stellar cast that includes renowned filmmaker-actor Gautham Vasudev Menon, National Award-winning actress Priyamani, veteran actor Prakash Raj, and rising star Mamitha Baiju. The exciting lineup is a testament to the film’s high expectations and ambition.
Directed by H. Vinoth and produced by Venkat K. Narayana for KVN Productions, Thalapathy 69 promises to be a landmark film, showcasing Vijay’s remarkable three-decade-long career. The music for the film will be composed by the celebrated Anirudh, further heightening anticipation among fans. The technical crew will also play a pivotal role in bringing the director’s vision to life, with cinematography by Sathyan Sooryan, editing by Pradeep E Ragav, action choreography by Anlarasu, art direction by Selva Kumar, and costume design by Pallavi Singh. Sathyan Sooryan, known for his work in Theeran Adhigaram Ondru and Master, is expected to elevate the visual storytelling of Thalapathy 69.
Scheduled for a pan-Indian release in Tamil, Telugu, and Hindi in October 2025, Thalapathy 69 aims to be a grand tribute to Vijay’s legacy, ensuring that his final film will be remembered for years to come.
అత్యంత వైభవంగా మొదలైన దళపతి 69
విజయ్ సినిమా కెరీర్లో ఆఖరి చిత్రం దళపతి 69ని అత్యంత వైభవంగా ప్రారంభించింది కేవీయన్ ప్రొడక్షన్స్. పూజా కార్యక్రమాలతో భారీ సినిమాకు కొబ్బరికాయ కొట్టేశారు. నవరాత్రుల్లో రెండో రోజున ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలు కావడం ఆనందంగా ఉందంటున్నారు మేకర్స్. సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల సమక్షంలో ఆత్మీయంగా జరిగింది దళపతి 69 మూవీ పూజ.
శనివారం నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. దళపతి కెరీర్లో హిస్టారిక్ ప్రాజెక్ట్ ఇది. సిల్వర్‌స్క్రీన్ మీద ఆయన చివరిసారిగా కనిపించనున్న చిత్రం ఇదే. దళపతి ఫ్యాన్స్ కి ఇదొక ఎమోషనల్ ప్రాజెక్ట్.
విజయ్ సరసన ఈ చిత్రంలో పూజా హెగ్డే నాయికగా నటిస్తున్నారు. బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపిస్తారు. గౌతమ్ వాసుదేవ మీనన్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ ప్రియమణి, వెటరన్ యాక్టర్ ప్రకాష్ రాజ్, రెయిజింగ్ స్టార్ మమిత బైజు ప్రధాన పాత్రల్లో మెప్పించడానికి సిద్ధమవుతున్నారు.
హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. కేవీయన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా వెండితెరమీద విలక్షణమైన నటనతో బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న విజయ్ కెరీర్లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న సినిమా ఇది. అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తారు. ప్రదీప్ ఇ రాఘవ్ ఈ సినిమాకు ఎడిటింగ్ విభాగాన్ని హ్యాండిల్ చేస్తున్నారు. అనల్ అరసు యాక్షన్ కొరియోగ్రఫీని అందిస్తున్నారు. సెల్వ కుమార్ ఆర్ట్ డైరక్టర్‌గా పనిచేస్తున్నారు. పల్లవి సింగ్ కాస్ట్యూమ్స్ విభాగాన్ని హ్యాండిల్ చేస్తున్నారు. ‘ధీరన్ అదిగారమ్ ఒండ్రు’, ‘మాస్టర్’ సినిమాలకు పనిచేసిన సత్యన్ సూర్యన్.. దళపతి 69 ని మరో రేంజ్లో చూపిస్తారనే కాన్ఫిడెన్స్ ఆల్రెడీ ప్రేక్షకుల్లో క్రియేట్ అయింది.
ప్యాన్ ఇండియా రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. తమిళ్, తెలుగు, హిందీలో 2025 అక్టోబర్‌లో విడుదల కానుంది ఈ సినిమా. విజయ్ లెగసీని దృష్టిలో పెట్టుకుని, ఆయన నటిస్తున్న చివరి సినిమాను అత్యంత భారీగా, తరాలు గుర్తుపెట్టుకునేలా తెరకెక్కించే పనిలో ఉన్నారు మేకర్స్.