Mega Supreme Hero Sai Durgha Movie Titled SYG (Sambarala Yetigattu)
Kalki 2898 AD | భారతీయ జెండా ఎగురవేయండి.. కల్కి 2898 ఏడీ టీంకు చిరంజీవి అభినందనలు
Kalki 2898 AD | టాలీవుడ్, పాన్ ఇండియాతోపాటు గ్లోబల్ మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) థియేటర్లలో సందడి చేస్తుందని తెలిసిందే. విడుదలైన కేంద్రాల్లో మెజారిటీ లొకేషన్లలో తన మేనియా చూపిస్తూ సక్సెస్‌ఫుల్‌గా హౌస్‌ఫుల్ షోలతో రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో నాగ్ అశ్విన్ అండ్ ప్రభాస్ టీంకు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలియజేశాడు.
Kalki 2898 AD | టాలీవుడ్, పాన్ ఇండియాతోపాటు గ్లోబల్ మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) థియేటర్లలో సందడి చేస్తుందని తెలిసిందే. ప్రభాస్ (Prabhas) టైటిల్ రోల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్దఫస్ట్ డే బ్లాక్ బస్టర్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. విడుదలైన కేంద్రాల్లో మెజారిటీ లొకేషన్లలో తన మేనియా చూపిస్తూ సక్సెస్‌ఫుల్‌గా హౌస్‌ఫుల్ షోలతో రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో నాగ్ అశ్విన్ అండ్ ప్రభాస్ టీంకు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలియజేశాడు.
కల్కి 2898 ఏడీ గురించి అద్భుతమైన రిపోర్ట్స్ వినబడుతున్నాయి. అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దీపికాపదుకొనే, కమల్ హాసన్ లాంటి స్టార్ యాక్టర్లతో ఈ మిథో సైన్స్ ఫిక్షన్ ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్‌ని రూపొందించిన నాగ్ అశ్విన్ మీ సృజనాత్మక మేధావితత్వానికి వందనాలు. నా అభిమాన నిర్మాత అశ్వినీదత్‌కు హృదయపూర్వక అభినందనలు. సినిమా మట్ల ఎంతో మక్కువ కలిగిన ధైర్యవంతులు ప్రియాంక దత్, స్వప్నాదత్ అండ్ టీం సినిమాను మరింత ఉన్నతంగా శిఖరాలకు తీసుకెళ్లేలా కలలు కనండి.. భారతీయ జెండాను ఎగురవేయండి.. అంటూ సందేశాన్ని పోస్ట్ చేశాడు చిరు. ఈ ట్వీట్ కల్కి టీంతోపాటు మూవీ లవర్స్‌లో మరింత జోష్ నింపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
వైజయంతీ మూవీస్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించగా… బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ విలన్‌గా నటించాడు. లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి ఇతర కీలక పాత్రలు పోషించారు.