Chinni… Lyrical Video Released from Daaku Maharaaj
The lyrical video of ‘Chinni’, the second single from the highly anticipated Daaku Maharaaj, has been unveiled, offering audiences a heartwarming glimpse into the emotional and playful bond between Nandamuri Balakrishna and a young girl. This soulful melody beautifully captures the essence of innocence, care and protection, making it a perfect addition to the film’s music album.
Penned by Ananth Sriram, the lyrics seamlessly blend melody with a nostalgic school rhyme, creating an emotional depth that resonates deeply with listeners. Vishal Mishra’s vocals elevate the track, turning it into a heartfelt ballad that tugs at the heartstrings. Once again, Thaman S showcases his unique compositional brilliance with this memorable and evocative piece.
Set against the picturesque backdrop of Ooty, the song is brought to life with stunning visuals and heartfelt choreography by Vishwa Raghu. The lyrical video features playful montages of Balakrishna and the young girl, portraying him as a caring protector whose sole focus is her happiness. Adding further charm to the visuals are Chandini Chowdary and Urvashi Rautela whose presence enhances the song’s freshness and emotional appeal.
This beautiful, emotional melody is sure to strengthen the connection between Balakrishna and his family audience, striking a chord with both children and adults. With its soothing composition and poignant narrative, “Chinni” is poised to become a favorite among families, further solidifying Balakrishna’s rapport with younger audiences.
Alongside Nandamuri Balakrishna, the film also stars Bobby Deol in a crucial role. Pragya Jaiswal, Shraddha Srinath, and Chandhini Chowdary, Urvashi Rautela play significant roles, adding further prominence to the narrative.
Directed by Bobby Kolli, Daaku Maharaaj is shaping up to be a grand cinematic experience. With stellar cinematography by Vijay Kartik Kannan and precise editing by Niranjan Devaramane, the film promises to captivate audiences on a grand scale Produced by Suryadevara Naga Vamsi and Sai Soujanya under Sithara Entertainments and Fortune Four Cinemas, and presented by Srikara Studios, the film is slated for a worldwide theatrical release on January 12, 2025, this Sankranti. The film promises to blend high-octane action with heartwarming moments, delivering an unforgettable experience for audiences.
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ నుంచి రెండవ గీతం ‘చిన్ని’ విడుదల
వైవిధ్యభరితమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ, వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, ఈ సంక్రాంతికి మరో వైవిధ్యభరితమైన చిత్రం ‘డాకు మహారాజ్’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు.
బాలకృష్ణ మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపిస్తున్న ‘డాకు మహారాజ్’పై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టైటిల్ టీజర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి, ఇటీవల విడుదలైన మొదటి గీతం ‘ది రేజ్ ఆఫ్ డాకు’కి అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పుడు రెండవ గీతం చిన్ని విడుదలైంది.
బాలకృష్ణ, తమన్ కలయిక అంటే పాటలపై సంగీత ప్రియుల్లో అంచనాలు ఉండటం సహజం. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ‘డాకు మహారాజ్’కి తమన్ అద్భుతమైన సంగీతం అందించారని మొదటి గీతంతోనే అర్థమైంది. ఇక ఇప్పుడు రెండో గీతంతో బాలకృష్ణ-తమన్ కలయిక ఎందుకంత ప్రత్యేకమైనదో మరోసారి స్పష్టమైంది. చిన్ని పాటకు తమన్ అందించిన సంగీతం హృద్యంగా ఉంది. మనసుకి హత్తుకునే ఆ సంగీతానికి తగ్గట్టుగా అనంత శ్రీరామ్ అందించిన సాహిత్యం పాటకు మరింత అందం తీసుకొచ్చింది. ఆయన కలం నుంచి జాలువారిన “నువ్వు తే అంటే నీ ముందు తారా తీరాలే. నువ్వు నవ్వుతుంటే అమావాస్యయినా దీపావళిగా మారాలే.” వంటి సున్నితమైన, సుమధురమైన పంక్తులు కట్టి పడేశాయి. తన మధుర గాత్రంతో గాయకుడు విశాల్ మిశ్రా పాటను మరో స్థాయికి తీసుకెళ్ళారు.
లిరికల్ వీడియోని గమనిస్తే అద్భుతమైన విజువల్స్, విశ్వ రఘు ఆకట్టుకునే కొరియోగ్రఫీ చిన్ని పాటకు జీవం పోశాయి. బాలకృష్ణ, చిన్నారి మధ్య భావోద్వేగ మరియు ఉల్లాసభరితమైన బంధాన్ని ఆవిష్కరిస్తూ ఊటీ నేపథ్యంలో ఈ పాటను ఎంతో అందంగా చిత్రీకరించారు. పాప క్షేమం, సంతోషం కోరే రక్షకుడిగా బాలకృష్ణ ఈ ‘చిన్ని’ గీతంలో కనిపిస్తున్నారు. అలాగే లిరికల్ వీడియోలో చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
‘చిన్ని’ అనే ఈ మధుర గీతం బాలకృష్ణపై కుటుంబ ప్రేక్షకులకు, ఈ తరం పిల్లలకు ఉన్న అభిమానాన్ని మరింత పటిష్టం చేస్తుంది అనడంలో సందేహం లేదు. అటు పిల్లలు, ఇటు పెద్దలు మెచ్చేలా ఈ పాట ఉంది.
‘డాకు మహారాజ్’ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ తో పాటు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కళా దర్శకుడిగా అవినాష్ కొల్లా, ఎడిటర్ గా నిరంజన్ దేవరమానే వ్యవహరిస్తున్నారు.
‘డాకు మహారాజ్’ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.
తారాగణం: నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా
సంగీతం: తమన్ ఎస్
ఛాయాగ్రహణం: విజయ్ కార్తీక్
కళా దర్శకుడు: అవినాష్ కొల్లా
కూర్పు: నిరంజన్ దేవరమానే, రూబెన్
దర్శకత్వం: బాబీ కొల్లి
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
బ్యానర్స్: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీ వేణుగోపాల్