వర్ణిక విజువల్స్ ద్వారా ఓవర్సీస్ లో రిలీజ్ అవుతున్న ‘శివం భజే’
అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 1న విడుదలకి సిద్ధంగా ఉన్న గంగా ఎంటర్టైన్మంట్స్ ‘శివం భజే’ చిత్రాన్ని ఓవర్సీస్ లో గ్రాండ్ రిలీజ్ చేయనున్న వర్ణిక విజువల్స్ సంస్థ. పాటలకి, ట్రైలర్ కి అనూహ్యమైన స్పందన లభించడం ఇంటర్నేషనల్ క్రైమ్, మర్డర్ మిస్టరీ, సీక్రెట్ ఏజెంట్, శివుడి ఆట లాంటి అనేక అంశాలతో న్యూ ఏజ్ కథ కథనాలు ఉండనున్నట్టు నిర్మాత మహేశ్వర రెడ్డి మూలి చెప్పడంతో మార్కెట్ లో మంచి బజ్ వచ్చింది.
అర్బాజ్ ఖాన్, దిగంగనా సూర్యవంశీ, హైపర్ ఆది, మురళీ శర్మ, తనికెళ్ళ భరణి, సాయి ధీన, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, శకలక శంకర్, కాశీవిశ్వనాధ్, ఇనాయ సుల్తాన తదితర తారాగణంతో పాటు ఇండస్ట్రీలో మేటి సాంకేతిక నిపుణులు కూడా ఉండడంతో చిత్ర విజయం పై విశ్వాసంతో ఓవర్సీస్ లో చేయడానికి వర్ణిక విజువల్స్ ముందుకు వచ్చారు.
అంచనాలను దృష్టిలో ఉంచుకుని తాజాగా ఓవర్సీస్ లో ఒక రోజు ముందే, అంటే జూలై 31న ప్రీమియర్స్ వేయనున్నారు.
ఎడిటర్ : ఛోటా కె ప్రసాద్,
ప్రొడక్షన్ డిజైనర్ : సాహి సురేష్,
మ్యూజిక్ డైరెక్టర్ : వికాస్ బడిస
ఫైట్ మాస్టర్: పృథ్వి, రామకృష్ణ
డీ ఓ పి: దాశరథి శివేంద్ర
పి ఆర్ ఓ: నాయుడు సురేంద్ర కుమార్ – ఫని కందుకూరి (బియాండ్ మీడియా)
మార్కెటింగ్: టాక్ స్కూప్
నిర్మాత : మహేశ్వర్ రెడ్డి మూలి
దర్శకత్వం : అప్సర్.