What happend to Naveen Polishetty?
ఆ హీరోకి ఏమయ్యింది – ఎందుకు సినిమాలు ఒప్పుకోవడం లేదు?
కుర్ర హీరో నవీన్ పోలిశెట్టి టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని హిట్ సినిమాలతో ముందుకు దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కుర్ర హీరో వరుసగా సినిమాలు చేయడం లేదు. చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు. చివరిగా ఈ హీరో గారు చేసిన సినిమా “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”. ఈ సినిమా మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ ఈ సినిమా తర్వాత వచ్చిన ఆఫర్స్ ని అంగీకరించడంలేదని తెలుస్తోంది. ఎందుకు నవీన్ పోలిశెట్టి సినిమాలు అంగీకరించడం లేదని ఆరా తీస్తే…
ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి అమెరికాలో ఉన్నాడట. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా విడుదలైన తర్వాత నవీన్ యు.యస్ వెళ్లాడు. అక్కడ ఈ హీరోగారికి చిన్నపాటి యాక్సిడెంట్ అయ్యిందట. అక్కడే ట్రీట్మెంట్ తీసుకున్న నవీన్ పోలిశెట్టి ఇప్పటివరకూ ఇండియా తిరిగిరాలేదు. తనను అప్రోచ్ అయ్యి కథలు చెబుతున్నప్పటికీ, కథలు నచ్చక సినిమాలు అంగీకరించడంలేదని తెలుస్తోంది. తను చేయబోయే తదుపరి చిత్రానికి సంబంధించిన స్టోరీ యూనిక్ గా ఉండాలని భావిస్తున్నాడట. సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో నవీన్ పోలిశెట్టి ఓ సినిమా చేయాల్సి ఉంది. కథ నచ్చితే ఈ సినిమా చేయాలని భావిస్తున్నాడట. మరి నవీన్ ని మెప్పించే కథ ఎప్పటికి దొరుకుతుందో, ఈ హీరోగారు తదుపరి చిత్రం ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో వేచిచూడాల్సిందే. ఏదేమైనా సక్సెస్ ఫుల్ చిత్రాలు చేస్తున్న హీరో ఇంత గ్యాప్ తీసుకోకుండా, వరుసగా సినిమాలు చేస్తే బాగుంటుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.