
Nagabandham Teaser – 20 M+ Views In 24 Hours
Director Abhishek Nama’s most ambitious project, Nagabandham, has ignited a pan-India storm. Unveiled on the spiritually charged occasion of Maha Shivaratri, this glimpse into the mystical epic received a stupendous response. Within 24 hours, the teaser amassed over 20 million views, topped national trending charts, and signalled the emergence of a formidable new force in the pan-Indian arena.
What makes this achievement particularly remarkable is the audacity of the talent behind it. Director Abhishek Nama, in only his second directorial venture, has bypassed the traditional learning curve to deliver a spectacle of international scale. Alongside him, lead actor Virat Karrna and debutant producers Kishore Annapureddy and Nishitha Nagireddy have dismantled the notion that only established production houses can realize grand-scale cinema. Their collective high-risk, high-reward vision has clearly paid off, as the teaser reflects a level of meticulous world-building rarely seen in contemporary fantasy storytelling.
The undisputed talking point of the footage is the radical transformation of Virat Karrna. Shedding his earlier image entirely, his portrayal channels the raw, primal energy of a Lord Shiva avatar, leaving audiences stunned.
From a technical standpoint, Nagabandham sets a new benchmark for rooted yet grand storytelling. The teaser showcases seamless high-end VFX that feels tangible rather than synthetic, supported by lavish production design and atmospheric cinematography. The producers have spared no expense, translating the script’s ambitious scale into visceral reality.
As the film moves from teaser excitement toward its big summer release, the buzz seems unstoppable. By presenting epic mythology in a modern style, Abhishek Nama and his team have raised expectations very high.
24 గంటల్లో 20 మిలియన్లకు పైగా వ్యూస్ తో పాన్ ఇండియా టాప్ ట్రెండింగ్‌లో నాగబంధం టీజర్
దర్శకుడు అభిషేక్ నామా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం “నాగబంధం” పాన్-ఇండియా స్థాయిలో భారీ సంచలనం సృష్టిస్తోంది. మహాశివరాత్రి సందర్భంగా విడుదలైన ఈ మిస్టికల్ ఎపిక్ టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. కేవలం 24 గంటల్లోనే 20 మిలియన్‌కు పైగా వ్యూస్ సాధించి, దేశవ్యాప్తంగా ట్రెండింగ్ చార్ట్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకోవడం ద్వారా పాన్-ఇండియన్ లో అదరగొట్టింది.
ఈ అచీవ్మెంట్ ని మరింత ప్రత్యేకంగా నిలబెట్టేది డైరెక్టర్ అభిషేక్ నామా విజన్. అంతర్జాతీయ స్థాయి విజువల్ స్పెక్టకిల్‌ను అందించారు. ఆయనతో పాటు హీరో విరాట్ కర్ణా, డెబ్యుటెంట్ నిర్మాతలు కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి కలిసి వరల్డ్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించారు.
టీజర్లో ప్రత్యేక హైలెట్ గా నిలిచింది విరాట్ కర్ణా ట్రాన్స్ఫర్మేషన్. తన గత ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా, శివుని అవతారంలా కనిపించడం, హై ఎనర్జీతో ఆయన చేసిన నటన ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.
టెక్నికల్ గా “నాగబంధం” కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తోంది. హైఎండ్ VFXలు సహజంగా అనిపించేలా ఉండటం, అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్ , అద్భుతమైన సినిమాటోగ్రఫీ టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కథలో ఉన్న భారీ స్కేల్‌ను నిజ జీవిత అనుభూతిగా మార్చేందుకు నిర్మాతలు ఎలాంటి ఖర్చుకూ వెనుకాడలేదని స్పష్టంగా తెలుస్తోంది.
టీజర్ హైప్ నుంచి సమ్మర్ రిలీజ్ దిశగా ప్రయాణిస్తున్న ఈ చిత్రం చుట్టూ ఉన్న బజ్ రోజురోజుకీ పెరుగుతోంది. మోడరన్ స్టైల్లో పురాణ కథనాన్ని చూపిస్తూ, అభిషేక్ నామా, ఆయన టీమ్ ప్రేక్షకుల అంచనాలను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లారు.
