K-Ramp 3rd Single Tikkal Tikkal.. Released -Grand Theatrical Release on

Mega Star Chiranjeevi Hoisted the Flag in Chiranjeevi Blood Bank
చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో ఘనంగా జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు- జాతీయ జెండాను ఆవిష్కరించిన మెగాస్టార్ చిరంజీవి
దేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు హైదరాబాద్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో ఘనంగా జరిగాయి. మెగాస్టార్ చిరంజీవి వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా వందన కార్యక్రమంలో అల్లు అరవింద్, సాయి ధరమ్ తేజ్, సుస్మిత, మెగా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు.
ప్రతి భారతీయుడికి 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. మన పూర్వీకులు సాధించిన ఈ విలువైన స్వాతంత్ర్యాన్ని ఆనందంగా జరుపుకుందాం. ఈ స్వేచ్ఛ మన ప్రతిభ, అభివృద్ధికి బలాన్ని ఇచ్చి, మన దేశం ఎప్పటికీ ముందుకు సాగడానికి దోహదం చేయాలి. జై హింద్.