W/O Anirvesh would captivate audiences and achieve success – Allari Naresh
![Is NBK109 Tittle Fixed?](https://filmybuzz.com/wp-content/uploads/2024/07/nandamuri-balakrishna.jpeg)
Is NBK109 Tittle Fixed?
బాలయ్య “వీర మాస్” – ఫిక్సయినట్టేనా?
గాడ్ ఆఫ్ ది మాసెస్ అని ఎవరిని పిలుస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమ అభిమాన హీరో, నందమూరి నటసింహం బాలకృష్ణ ను “గాడ్ ఆఫ్ ది మాసెస్” గా అభిమానులు పిలుస్తుంటారు. మాస్ సినిమాల్లో బాలయ్య చెలరేగిపోతుంటే, థియేటర్స్ లో అభిమానుల సందడికి హద్దే ఉండదు. ప్రస్తుతం బాలయ్య తన 109 వ చిత్రంతో బిజీగా ఉన్నారు. టైటిల్ ఖరారు కానీ ఈ సినిమాని ఎన్ బి కె 109 అని సంభోదిస్తున్నారు. కాగా తాజాగా వార్తల ప్రకారం ఈ సినిమాకి ఓ టైటిల్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అదేంటంటే…
“వీర మాస్” అనే టైటిల్ ని ఈ సినిమా డైరెక్టర్ అయిన బాబీ కొల్లి పరిశీలిస్తున్నారట. ఈ టైటిల్ పట్ల బాలయ్య కూడా సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. అఫీషియల్ గా ప్రకటించనప్పటికీ, ఇదే టైటిల్ ని ఖరారు చేస్తే… అభిమానులకు కూడా ఈ టైటిల్ నచ్చుతుందని చెప్చొచ్చు. ఇక ఈ సినిమా వివరాల్లోకి వెళితే…
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై రూపొందుతోంది. ఈ యాక్షన్ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.