Women are getting emotional after watching The Girlfriend – Allu

Toofan Release Date Fixed
ఆగస్టు 2న థియేటర్స్ కి రానున్న “తుఫాన్”
హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తుఫాన్”. ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్, హత్య సినిమాలను నిర్మించింది. పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్ లో “తుఫాన్” సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు విజయ్ మిల్టన్. “తుఫాన్” సినిమాను ఆగస్టు 2న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు మేకర్స్ ఈ రోజు ప్రకటించారు.
తనను చిన్న చూపు చూసే సమాజం భవితను మార్చిన ఓ వ్యక్తి కథ ఇది. ఓ దీవి నేపథ్యంగా సాగే ఈ సినిమా షూటింగ్ ను అండమాన్, డయ్యూ డమన్ లలో జరిపారు. “తుఫాన్” సినిమా నుంచి రిలీజ్ చేసిన పాటలు, ట్రైలర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాకు కూడా ఇదే పాజిటివ్ రెస్పాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు మూవీ టీమ్.
నటీనటులు – విజయ్ ఆంటోనీ, శరత్ కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ, మేఘా ఆకాష్, మురళీ శర్మ, పృథ్వీ అంబర్, శరణ్య పొన్వన్నన్, తలైవాసల్ విజయ్ తదితరులు
టెక్నికల్ టీమ్
కాస్ట్యూమ్స్ – షిమోనా స్టాలిన్
డిజైనర్ – తండోరా చంద్రు
యాక్షన్ కొరియోగ్రాఫర్ – సుప్రీమ్ సుందర్
ఆర్ట్ డైరెక్టర్ – అరుముగస్వామి
ఎడిటింగ్ – ప్రవీణ్ కేఎల్
మ్యూజిక్ – అచ్చు రాజమణి, విజయ్ ఆంటోనీ
డైలాగ్ రైటర్ – భాష్య శ్రీ
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
నిర్మాతలు – కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా
రచన, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ – విజయ్ మిల్టన్
