
Interesting Project lineup for Santhosh Shoban?
యంగ్ హీరో సంతోష్ శోభన్, స్వాతిముత్యం మూవీ ఫేమ్ డైరెక్టర్ లక్ష్మణ్ కె కృష్ణ కాంబినేషన్ లో రాబోతున్న సరికొత్త ఎంటర్ టైనర్ సత్తిబాబు పరలోక యాత్ర
ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లైనప్ చేసుకుంటున్న యంగ్ హీరో సంతోష్ శోభన్ మరో కొత్త చిత్రానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. బెల్లంకొండ గణేష్ హీరోగా స్వాతిముత్యం చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వంలో సంతోష్ శోభన్ ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా కి “సత్తిబాబు పరలోక యాత్ర” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ అనుకుంటున్నారట.
స్వాతిముత్యం సినిమా లక్ష్మణ్ కె కృష్ణకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. సంతోష్ శోభన్ తో లక్ష్మణ్ కె కృష్ణ రూపొందించబోయే సినిమా మల్టీవర్స్ కాన్సెప్ట్ తో తెరకెక్కనుంది.ఈ చిత్రానికి సంబంధించిన ప్రొడక్షన్ హౌస్, ఇతర వివరాలను త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు. ప్రస్తుతం కపుల్ ఫ్రెండ్లీ మూవీలో నటిస్తున్న సంతోష్ శోభన్.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్నే చేయబోతున్నారు.
