
Historic Event in TFI – 15 films launching on the same day
After movie mogul Dr. D. Ramanaidu, who produced the highest number of films, Tummalapalli Ramasatyanarayana, head of Bhimavaram Talkies and one of the few producers with over 100 films to his credit, is achieving another milestone. For the first time in world cinema history, he is set to launch 15 films simultaneously. This historic event, which is expected to be recorded as a world record, will take place at Saradhi Studios in Hyderabad. Prominent personalities from the film industry and various other fields will witness this remarkable feat. This rare milestone will be launched on India’s Independence Day!!
ప్రపంచ సినిమా చరిత్రలోనే ప్రప్రథమం – ఒకేరోజు 15 సినిమాలు ప్రారంభం!!
మూవీ మొఘల్ డాక్టర్ డి.రామానాయుడు తర్వాత అత్యధిక చిత్రాలు నిర్మించిన వ్యక్తిగా, శతాధిక చిత్ర నిర్మాతల్లో రెండవ వాడిగా ఘనతకెక్కిన భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ… ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారిగా ఒకేసారి 15 చిత్రాల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రపంచ రికార్డుగా నమోదు కానున్న ఈ చారిత్రక ఘట్టానికి హైద్రాబాద్ లోని సారధి స్టూడియో వేదిక కానుంది. సినిమా రంగంతోపాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ప్రపంచ రికార్డుకు ప్రత్యక్ష సాక్షులు కానున్నారు. మన భారత స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఈ అరుదైన ఘట్టం శ్రీకారం చుట్టుకోనుంది!!