Sundeep Kishan Unveiled Announcement Poster Of Attitude Star Chandrahass’s New

Heroine Nabha Natesh visits her hometown Sringeri shares its historic and spiritual significance
Actress Nabha Natesh, who often keeps her fans updated on social media with glimpses of her personal and professional life, recently visited her hometown Sringeri. She visited the famous temples there and shared her experiences on Instagram. Nabha also posted photos with her family members.
In her Instagram post, Nabha Natesh wrote:
“Sringeri – my birthplace. This town holds a sacred history that predates the Ramayana. It is a land sanctified by the penance of sages. Sringeri is also associated with Rishi Rishyashringa, who performed the Putrakameshti Yagna for King Dasharatha. This is a city that connects us back to the Treta Yuga.
It was here that Jagadguru Adi Shankaracharya chose to establish his first monastic seat (Amnaya Peetha). He consecrated Goddess Sharadamba, the embodiment of knowledge, and transformed Sringeri into a renowned center of Advaita Vedanta.
For me, Sringeri introduced the world of Vedas and arts. Since childhood, the history, culture, and wisdom of this sacred town have been a great source of inspiration. As I grew up, my love for Indian mythology and spiritual thought only deepened.
Surrounded by dense forests and known for its heavy rainfall, Sringeri instills patience and inner strength. Every time I come here, childhood memories resurface and guide me like a constant source of inspiration.”
హోమ్ టౌన్ శృంగేరి సందర్శించి అక్కడి చారిత్రక, ఆధ్యాత్మిక విశేషాలు షేర్ చేసిన హీరోయిన్ నభా నటేష్
సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలు షేర్ చేస్తుంటుంది హీరోయిన్ నభా నటేష్. ఆమె తాజాగా తన సొంత పట్టణం శృంగేరికి వెళ్లింది. అక్కడి ప్రసిద్ధ దేవాలయాలు సందర్శించి, ఆ విశేషాలు ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. తన కుటుంబ సభ్యులతో కలిసి తాను తీసుకున్న ఫొటోస్ ను నభా పోస్ట్ చేసింది. ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో
నభా నటేష్ స్పందిస్తూ – శృంగేరి, నా జన్మస్థలం. రామాయణానికి పూర్వపు పవిత్రమైన చరిత్ర ఈ నగరానికి ఉంది. మహర్షుల తపస్సులచే పవిత్రమైన భూమి ఇది. దశరథుడితో పుత్రకామేష్టి యాగం చేయించిన ఋషి ఋష్యశృంగుడికి కూడా ఈ నగరంతో అనుబంధం ఉంది. త్రేతాయుగానికి అనుసంధానించే గొప్ప చరిత్ర గల నగరమిది. జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు తన మొదటి అమ్నయ పీఠాన్ని స్థాపించడానికి శృంగేరిని ఎంచుకున్నారు. ఆయన జ్ఞాన స్వరూపమైన శారదాంబ దేవతను ప్రతిష్ఠించి, శృంగేరిని అద్వైత వేదాంతానికి ప్రసిద్ధ ప్రాంతంగా మార్చారు. వేదాలు, కళలకు నాకు పరిచయం చేసింది శృంగేరి. చిన్నతనం నుంచి ఈ పవిత్ర పట్టణం అందించిన చరిత్ర, సంస్కృతి, జ్ఞానం నాకెంతో ప్రేరణ ఇచ్చాయి. పెద్దయ్యాక భారతీయ పురాణాలు, ఆధ్యాత్మిక ఆలోచనల పట్ల నాకున్న ఇష్టం మరింత పెరిగింది. దట్టమైన అడవుల మధ్య ఉండి, భారీ వర్షపాతానికి ప్రసిద్ధి చెందిన శృంగేరి సహనం, అంతర్గత బలాన్ని కలిగిస్తుంది. ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ నా చిన్ననాటి జ్ఞాపకాలు పలకరిస్తూ నిత్యం మార్గదర్శనం చేస్తుంటాయి. అని పేర్కొంది.