
2nd Song Released from Transfer Trimurthulu
ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు నుంచి రెండో పాట నువ్వే కదా విడుదల.. జూన్ 19న మూవీ గ్రాండ్ రిలీజ్
వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల దర్శకుడు. వడ్డే నవీన్, రాశి సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, రఘుబాబు, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, జ్వాలా కోటి, దేవి ప్రసాద్, సూర్య, బాబా బాస్కర్, ప్రమోదిని, సాథ్విక్ రాజు, అంజలి ప్రియ, గాయత్రి చాగంటి తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. జూన్ 19న ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ అవుతుంది.
ఇప్పటికే డిఫరెంట్ ప్రమోషనల్ స్ట్రాటజీతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. డైరెక్టర్ కమల్ తేజనార్లతో వడ్డే నవీన్కథ, స్క్రీన్ ప్లేలో భాగం కావటం విశేషం. రీసెంట్గా విడుదలైన టీజర్, టా టా అనే సాంగ్‌తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. టా టా సాంగ్ బ్లాక్ బస్టర్ తర్వాత మేకర్స్ ఈ సినిమా నుంచి ‘నువ్వే కదా..’ అనే మరో సాంగ్‌ను ఎఫ్ ఎం రేడియో స్టేషన్లో విడుదల చేశారు.
కళ్యాణ్ నాయక్ సంగీత సారథ్యం వహిస్తోన్న సినిమాలోని ఈ పాటను భాస్కరభట్ల రాయగా.. పివిఎన్ఎస్ రోహిత్, హరిణి ఇవటూరి పాడారు. దినేష్ కుమార్ కొరియోగ్రఫీ అందించారు. హీరో హీరోయిన్ మధ్య ఉన్న ప్రేమ, అనురాగం, అనుబంధాలను తెలియజేసేలా ఈ పాట ఉంది.
గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన వడ్డే నవీన్, ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. వడ్డే నవీన్ నటనలో కొత్త కోణాన్ని ఈ చిత్రం ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్న సినిమా ఇదని తెలుస్తోంది.
విజయ మాధవి కంబైన్స్ బ్యానర్‌పై నందమూరి తారక రామారావుతో బొబ్బిలిపులి, చిరంజీవితో లంకేశ్వరుడు, కృష్ణంరాజుతో కటకటాల రుద్రయ్య బ్లాక్ బస్టర్ చిత్రాలు సహా ఎ.ఎన్.ఆర్, కృష్ణ వంటి దిగ్గజ నటులతో ఎన్నో క్లాసిక్ చిత్రాలను రూపొందించిన సీనియర్ నిర్మాత వడ్డే రమేష్ తనయుడే వడ్డే నవీన్. తండ్రి గొప్ప సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ వడ్డే నవీన్ ఇప్పుడు మంచి కథా చిత్రాలను నిర్మించాలనే లక్ష్యంతో వడ్డే క్రియేషన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ బ్యానర్‌పై రూపొందుతున్న తొలి చిత్రం ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’.
నటీనటులు:
వడ్డే నవీన్, రాశీ సింగ్, రఘు బాబు, సాయిశ్రీనివాస్, బాబా మాస్టర్, శిల్పా తులస్కర్. , వివేక్ రఘువంశీ, దేవిప్రసాద్, సూర్యకుమార్ భగవత్ దాస్, శివ నారాయణ, ప్రమోదిని, గాయత్రి భార్గవి, జ్వాలా కోటి, దేవి మహేష్, ఊహా రెడ్డి, రేఖా నిరోష్, గాయత్రి చాగంటి, సాత్విక్ రాజు, అంజలి ప్రియ తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్: వడ్డే క్రియేషన్స్
సమర్పణ: వడ్డే జిష్ణు
నిర్మాత: వడ్డే నవీన్
డైరెక్టర్: కమల్ తేజ నార్ల
స్టోరీ, స్క్రీన్ ప్లే: కమల్ తేజ నార్ల, వడ్డే నవీన్
మ్యూజిక్: కళ్యాణ్ నాయక్
సినిమాటోగ్రఫీ: కార్తీక్ సుజాత సాయి కుమార్
ఎడిటర్: విజయ్ ముక్తావరపు
పి.ఆర్.ఒ: వంశీ కాకా
