హై సినిమా చూశాను.. జెన్ జీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా న్యూ ఏజ్

హై సినిమా చూశాను.. జెన్ జీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్‌తో అద్భుతంగా తీశారు – అనిల్ రావిపూడి
బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి పలు విజయవంతమైన సినిమాలకు కో-రైటర్‌గా పనిచేసిన ఎస్ కృష్ణ, ‘హై’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో ఆయన ఒక ప్రధాన పాత్రలో కూడా నటిస్తున్నారు. ఇమేజ్‌స్పార్క్ ఎంటర్టైన్మెంట్, మైరా క్రియేషన్స్ బ్యానర్లపై హరీష్ పెద్ది, ఎస్ కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ 27న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో వివిధ వ్యక్తులు తమకు నచ్చిన ఆనందం, సంతోషం, థ్రిల్ కోసం చేసే ప్రయత్నాలు, ఆ క్రమంలో వారు ఎదుర్కొనే సమస్యలను ఆకట్టుకునేలా చూపించారు.
‘హై’ సినిమా విభిన్నమైన పాత్రలు, వారి వ్యక్తిగత కోరికల చుట్టూ తిరుగుతుంది. లిప్‌స్టిక్ లావణ్య తన జీవితాన్ని ముగించుకోవాలని అనుకుంటుంది. గుడివాడ రాయుడు డబ్బు, మద్యం ద్వారా ఆనందాన్ని వెతుక్కుంటాడు. సఫీనా మాత్రం తన ఆత్మగౌరవాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తుంది. మరోవైపు ఆమె ప్రేమికుడు హైదర్ ప్రమాదకరమైన బెట్టింగ్స్‌లో థ్రిల్‌ను వెతుక్కుంటాడు. ఇలా ఒకదానితో ఒకటి ముడిపడిన ఈ కథల ద్వారా ఒక్కొక్కరికి ‘హై’ అంటే ఒక్కో అర్థం ఉంటుందని చూపించారు. చివరికి తప్పుడు మార్గాల్లో వెళ్లడం కంటే సరైన నిర్ణయాలు తీసుకోవడంలోనే నిజమైన సంతృప్తి ఉంటుందనే క్యురియాసిటీ కలిగించేలా ప్రజెంట్ చేశారు.
లిప్‌స్టిక్ లావణ్య పాత్రలో అనన్య శర్మ తన ఎనర్జీ, నటనతో ఆకట్టుకున్నారు. మద్యానికి బానిసైన వ్యక్తి పాత్రలో ఎస్ కృష్ణ ఇంటెన్సిటీ చూపించారు. పల్లవి దొర, కృష్ణ కమల్, సాయి కృష్ణ, రేవంత్ (బుల్లిరాజు) తమ పాత్రల్లో చక్కగా నటించారు.
మల్లు నాయక్, సునీల్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు గ్రిట్టీ విజువల్ టెక్స్చర్ను తీసుకొచ్చింది. వికాస బడిస అందించిన మ్యూజిక్ టెన్షన్‌ను మరింత పెంచుతోంది. జీఆర్కే సరణ్ రావుల ఎడిటింగ్ చేయగా, వి వెంకట్ యాక్షన్ సీక్వెన్స్‌లను కొరియోగ్రఫీ చేశారు. యూత్‌ఫుల్ ఎనర్జీ, ఇంటెన్స్ ఎమోషన్స్, ఆలోచింపజేసే కథనంతో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతోంది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హాజరయ్యారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా నేను చూశాను. సాయి చాలా కొత్తగా ప్రయత్నించాడు. న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్‌తో జెన్‌జీ ఆడియన్స్‌కు కనెక్ట్ చేయాలని చాలా బాగా కష్టపడ్డాడు. తను ఇన్‌ఫ్లూయన్సర్స్ కోసం రిలీజ్‌కు ముందే ఒక షో వేయబోతున్నాడు. తప్పకుండా అది తనకు మంచి రిజల్ట్ ఇస్తుంది. తనకు సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాయి నా స్నేహితుడు. నేను చేస్తున్న సినిమాలకు రచయితగా నన్ను చాలా భరిస్తాడు. నా విషయంలో తనకు ఓపిక ఎక్కువ. తను డైరెక్టర్‌గా, యాక్టర్‌గా ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి ప్రాజెక్ట్‌తో మీ ముందుకు వచ్చాడు. తను ఎంత కష్టపడ్డాడో నేను చూస్తూ వచ్చాను. ఈ ప్రయాణంలోచాలా నేర్చుకున్నాడు. తనకు ఈ సినిమా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అలాగే మంచి ఫలితం కూడా రావాలని కోరుకుంటున్నాను. సాయి వాళ్ల నాన్నగారికి తను యాక్టర్ కావాలనే కోరిక ఉండేది. చాలాసార్లు తనకు మంచి వేషం ఇవ్వమని నన్ను అడిగారు. కానీ సాయి అప్పుడు సీరియస్‌గా తీసుకోలేదు. నెక్స్ట్ సినిమాలో తనకు మంచి వేషం ఇస్తాను. ఈ సినిమాలో తనలో ఉన్న నటనను చూపించాడు. ఈ సినిమాలో నటీనటుల పెర్ఫార్మెన్స్తో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా నచ్చింది. వికాస్ చాలా మంచి సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అలాగే డీఓపీతో పాటు మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా ప్రాణం పెట్టి పనిచేశారు. ఇందులో శ్రీనివాస్ గారు చాలా మంచి వేషం చేశారు. తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. నవంబర్ 27న రిలీజ్ కాబోతోంది. ఇది చిన్న సినిమా కావచ్చు. కాకపోతే చాలా పెద్ద స్కేల్లో తీశారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుందని నమ్ముతున్నాను. సాయి ఈ సినిమాతో తనకు కచ్చితంగా చాలా పెద్ద హై వస్తుందని నమ్ముతున్నాను.
డైరెక్టర్, హీరో ఎస్ కృష్ణ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు గుడివాడ రాయుడు. ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది. గుడివాడ నుంచి ఎన్టీఆర్ గారు వచ్చారు, ఏఎన్నార్ గారు వచ్చారు, రామోజీరావు గారు వచ్చారు, వీఎస్ఆర్ స్వామి గారు వచ్చారు. వాళ్లు మాట తప్పలేదు.. నేను మాట తప్పను అని. ఈ డైలాగ్‌ను సినిమాలో పదే పదే చెబుతూ ఉంటాను. ఇందులో నాది కంప్లీట్‌గా ఆల్కహాలిక్ క్యారెక్టర్. కాకపోతే రియల్ లైఫ్‌లో నేను ఎప్పుడూ ఆల్కహాల్ ముట్టుకోలేదు. ఈ సినిమా చూసి ఎవరైనా అచ్చం తాగినవాడిలాగే చేశావంటే అదే నాకు రియల్ హై మూమెంట్. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులందరూ చాలా రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అనన్య, సాయి కృష్ణ ఇలా అందరూ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. శ్రీనివాస్ రెడ్డి గారు, అదిరే అభి, అభినవ్ గోమఠం ఇలా అందరూ నా కోసం వచ్చి పనిచేశారు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎంతోమంది మనసుల్లో స్థానం సంపాదించుకున్నాననే ఆనందం ఉంది. అలాగే అనిల్ గారు కూడా ఇందులో కనిపిస్తారు. అనిల్ గారితో నాకు 20 ఏళ్ల అనుబంధం ఉంది. ఒకే రూమ్‌లో కలిసి ఉండేవాళ్లం. సినిమా కోసం ఎన్నో గొడవలు పడతాం. ‘పటాస్’ నుంచి కలిసి రైటింగ్ చేస్తున్నాం. నేనేంటో అనిల్‌కు తెలుసు, అనిల్ ఏంటో నాకు తెలుసు. తనతో గొడవ పడటంలో నాకు హై వస్తుంది” (నవ్వుతూ). అనిల్‌లో అసలు బద్ధకం అనేది ఉండదు. తన సక్సెస్ సీక్రెట్ కూడా అదే. ఒక సినిమాను సక్సెస్ చేయడం అంత ఈజీ కాదు. నేను కూడా డైరెక్టర్ని కాబట్టి అది నాకు తెలుసు. నేను యాక్టర్ కావడం మా నాన్న గారి కల. నేను డైరెక్షన్ చేస్తున్న సినిమాకు నన్ను ఒక పాత్ర చేయమని అనిల్ నన్ను బూస్ట్ చేశాడు. మా నాన్నగారి కల ఈ సినిమా ద్వారా తీరుతుంది. ఈ సినిమాను అందరూ చూసి ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను.
శ్రీనివాస్ వడ్లమాణి మాట్లాడుతూ.. ఇందులో చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. దానికి బెస్ట్ కాంప్లిమెంట్స్ నాకు అనిల్ రావిపూడి టీమ్ నుంచే వచ్చాయి. . సాయి, అనిల్ ఇద్దరూ ఒకటే. వాళ్లని చూసినప్పుడు కృతజ్ఞత, ప్రేమ కలుగుతాయి. సాయిని దర్శకుడిగా నటుడిగా చూడడం చాలా హాయిగా ఉంది.”
సాయి కృష్ణ మాట్లాడుతూ.. “నా క్యారెక్టర్‌కి బెట్టింగ్ అంటే హై. మాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన ఎస్ కృష్ణ గారికి థాంక్యూ. కచ్చితంగా ఈ సినిమా మీ అందరికీ చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.”
అదిరే అభి మాట్లాడుతూ.. “సాయి గారు, నేను 20 ఏళ్లుగా ఫ్రెండ్స్. ఈ సినిమా మొదటి జర్నీ నుంచి నేను ఉన్నాను. సాయి గారు చాలా మంచి డైరెక్టర్. ఇలాంటి బడ్జెట్లో ఇంత పెద్ద సినిమా చేయడం అసాధ్యం. కానీ డైరెక్టర్ గారు దాన్ని సాధ్యం చేసి చూపించారు. ఈ సినిమా యూత్‌ను, ఫ్యామిలీస్‌ను కచ్చితంగా అలరిస్తుంది. 27న కచ్చితంగా చాలా పెద్ద హై క్రియేట్ చేస్తుంది.”
అనన్య శర్మ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో లిప్‌స్టిక్ లావణ్య క్యారెక్టర్ ప్లే చేశాను. ఇది నాకు చాలా గుర్తుండిపోయే క్యారెక్టర్. అందరూ రిలేట్ చేసుకునే క్యారెక్టర్. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఈ వేడుకలో సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు.
రేవంత్ మాట్లాడుతూ.. “అనిల్ గారు నాకు లైఫ్ ఇవ్వడం వల్లే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఆయనకు ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. ‘హై’ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేశాను. సాయి గారు నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ క్రెడిట్ అంతా ఆయనే. ఈ సినిమా 27వ తేదీన థియేటర్లలో రిలీజ్ అవుతుంది. అందరూ ఈ సినిమాను చూడాలని కోరుకుంటున్నాను.”
నటీనటులు: అనన్య శర్మ, ఎస్ కృష్ణ, పల్లవి దొర, కృష్ణ కమల్, సాయి కృష్ణ, రేవంత్ (బుల్లిరాజు)
టెక్నికల్ టీమ్:
రచన, దర్శకత్వం: ఎస్ కృష్ణ
నిర్మాతలు: హరీష్ పెద్ది, ఎస్ కృష్ణ
బ్యానర్లు: ఇమేజ్‌స్పార్క్ ఎంటర్టైన్మెంట్, మైరా క్రియేషన్స్
సంగీతం: వికాస బడిసా
ఎడిటర్: జీఆర్కే సరణ్ రావుల
లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, కిట్టు విస్సాప్రగడ
సినిమాటోగ్రఫీ: మల్లు నాయక్, సునీల్ రెడ్డి (సెకండ్ యూనిట్ డీఓపీ)
కొరియోగ్రఫీ: శ్రీకాంత్ రౌతు
యాక్షన్: వి వెంకట్
సౌండ్ డిజైన్: ప్రదీప్ జి
కలరిస్ట్: ఆండ్రియాస్ బ్రూక్ల్
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మనాథ్ ఏ. పాటిల్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరీష్
లైన్ ప్రొడ్యూసర్: వి జానకిరామ్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హ్యాష్‌ట్యాగ్ మీడియా
పబ్లిసిటీ డిజైన్స్: ఆర్సీ డిజైన్స్
మ్యూజిక్ లేబుల్: ఆదిత్య మ్యూజిక్
