అఖండ 2: తాండవం సినిమా అద్భుతంగా వచ్చింది. ఘన విజయాన్ని సాధిస్తుంది –

Raai Laxmi’s Janata Bar Releasing in theaters from November 28
The lady-oriented film Janata Bar, starring popular actress Raai Laxmi in the lead role, is set to release worldwide in theatres on November 28. Directed by Ramana Mogili under the banner of Rochi Movies and presented by Ashwarth Narayana, the film has reached its final stage of post-production.
Speaking on the occasion, director and producer Ramana Mogili said, “This is the story of a woman who fought to end the sexual harassment perpetrated by senior officials in the sports sector who misuse their authority against women who choose sports as a career. Raai Laxmi’s role in the film is extremely powerful. Alongside commercial elements, the film carries a strong social message and aims to inspire awareness among women. Bollywood actor Shakti Kapoor has played a very powerful role in this film. We strongly believe that this film will achieve commercial success.”
The cast includes Aman Preet Singh, Deeksha Panth, Shakti Kapoor, Anup Soni, Pradeep Rawat, and Suresh Bhupal. The film’s songs are composed by Rambabu Gosala, Kalyan Chakravarthy, and Srinivas Teja. Cinematography is by Chittibabu, music is by Vinod Yajamanya, and the writer is Rajendra Bharadwaj.
నవంబరు 28న థియేటర్లోకి రానున్న ‘జనతాబార్’
ప్రముఖ కథానాయిక రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న లేడి ఓరియెంటెడ్ చిత్రం ‘జనతాబార్’. రోచి మూవీస్ పతాకంపై రమణ మొగిలి స్వీయ దర్శకత్వంలో అశ్వర్థ నారాయణ సమర్పణలో నిర్మాణం జరుపుకుంటోన్న ఈ చిత్రం నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఈ నెల 28న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదల చేస్తున్నారు.
ఈ సందర్బంగా దర్శక, నిర్మాత రమణ మొగలి మాట్లాడుతూ ” స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకున్నమహిళలపై ఆ స్పోర్ట్స్ విభాగంలో ఉన్న ఉన్నతాధికారులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేస్తున్న సెక్సువల్ హరాస్మెంట్కు చరమగీతం పాడటానికి పోరాడిన ఓ మహిళ కథ ఇది. ఈ చిత్రంలో రాయ్ లక్ష్మీ పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటుంది. పూర్తి కమర్షియల్ అంశాలతో పాటు సమాజానికి మంచి సందేశంతో పాటు మహిళల్లో చైతన్యం నింపే సినిమా ఇది. బాలీవుడ్ నటుడు శక్తికపూర్ ఈ చిత్రంలో ఎంతో శక్తివంతమైన పాత్రను పోషించాడు.తప్పకుండా ఈచిత్రం కమర్షియల్‌గా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు.
అమన్ ప్రీతిసింగ్, దీక్షపంత్, శక్తికపూర్, అనూప్‌సోని, ప్రదీప్‌రావత్, సురేష్ భూపాల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: రాంబాబు గోసాల, కళ్యాణ్ చక్రవర్తి, శ్రీనివాస్‌తేజ, ఫోటోగ్రఫి: చిట్టిబాబు,సంగీతం: వినోద్ యజమాన్య, రచయిత: రాజేంద్ర భరద్వాజ్.
