Telugu Film Industry Expresses Gratitude to Government & Police for

Santhana Prapthirasthu to collect around ₹6.5 crore by Sunday.. it issolid number for a small film – Madhura Sreedhar Reddy
Santhana Prapthirasthu, starring Vikranth and Chandini Chowdary, is receiving tremendous appreciation from audiences across both Telugu states. The film is running successfully in all centers with strong word-of-mouth. Produced by Madhura Entertainment and Nirvi Arts, the film is directed by Sanjeev Reddy. The team celebrated the box-office success with a success meet in Hyderabad.
Writer Kalyan Raghav Said”Thank you to the audience for the wonderful success of Santhana Prapthirasthu. Without your support, this film wouldn’t be here. If anyone hasn’t watched it yet, I request you to visit theatres and experience it.”
Music Director Ajay Arasada Said “The audience blessed our film wholeheartedly. Families are coming to theatres and enjoying it together. I’m very happy that the music is also receiving such love.”
Screenplay Writer Shaik Dawood G “Santhana Prapthirasthu is a complete laughter ride. Heartfelt thanks to the audience and media for supporting us. Enjoy the film with your families this weekend.”
Director Sanjeev Reddy “The audience gave us a success that made all the hardship of the past year and a half completely worth it. We are grateful for the praises as well as the constructive suggestions from the media. Our hero accepted this challenging subject so early in his career, he gained weight, de-glamourized himself, and worked hard during promotions. Chandini breathed life into her character and delivered a promise-filled performance. Our producers supported the film without compromising my vision. Like Muralidhar Goud’s memorable role in DJ Tillu, Chaitanya Mamagaru’s character in this film is receiving exceptional response. My thanks to the entire team.”
Producer Madhura Sreedhar Reddy “We are extremely happy with the response for Santhana Prapthirasthu. Our PROs worked tirelessly to take the film to the audience. Having Lagadapati Sreedhar garu at today’s event made it even more special, he’s the one who introduced me to the film industry. Both Vikranth and Chandini delivered their best work and stood by the project throughout. We knew Muralidhar Goud would be a huge asset, and the audience proved it right. Every product receives both positive and negative feedback—we choose to move forward with the positives. We expect the film to collect around ₹6.5 crore by Sunday, which is a solid number for a small film.”
Producer Nirvi Hariprasad Reddy “With the blessings of Lord Venkateswara, Santhana Prapthirasthu has received a great victory. For our first collaboration with Sreedhar garu, this success means a lot. Vikranth and Chandini impressed everyone, and director Sanjeev made a clean, family-friendly entertainer with a strong message about staying away from harmful habits and choosing a healthy lifestyle.”
Actor Muralidhar Goud “The movie connects strongly with women audiences. Director Sanjeev handled a sensitive topic with great care. The success we hoped for has now been delivered by the audience, and we are delighted.”
Heroine Chandini Chowdary “We believed audiences would like our film, but we never expected this much love for my character Kalyani. During our promotional tours, many people said how deeply they connected with her. The credit goes to our director for designing such a beautiful character, and to Shaik Dawood garu whose writing became another pillar of the film. Vikranth worked extremely hard, I wish him many more successes. My thanks to our producers Sreedhar garu and Hariprasad garu for trusting me.”
Producer Lagadapati Sreedhar “Congratulations to the producers for this success. Sreedhar is a close friend, and Hariprasad garu entered the industry with pure passion. Santhana Prapthirasthu is a clean family entertainer crafted beautifully by director Sanjeev. I will soon be doing a film with him. Vikranth is one of the most promising young actors, and Chandini once again earns strong recognition through this film. Muralidhar Goud, just like in DJ Tillu and MAD, shines with his performance. This is a film that audiences across languages can enjoy.”
Hero Vikranth “The audience gave us a success that erased all our hardships. The three pillars of the film are director Sanjeev, and writers Shaik Dawood and Kalyan Raghav. They shaped every scene with the right emotion and fun. This movie gave me a family. Chandini became a close friend, and my producers became like brothers. Muralidhar Goud garu has become ‘mama’ to me even off-screen. Please avoid piracy and watch the film only in theatres, your support keeps new actors like me alive. We are overwhelmed with the collections you’re giving us.”
Senior film journalists Prabhu and Nagendra praised the team for presenting a sensitive issue with entertainment and a meaningful message.
CAST
Vikranth, Chandini Chowdary, Vennela Kishore, Tharun Bhascker, Abhinav Gomatam, Muralidhar Goud, Harshavardhan, Bindu Chandramouli, Jeevan Kumar, Satya Krishna, Tagubothu Ramesh, Abhay Bethiganti, Kireeti, Anil Geela, Saddam, Riyaz, and others.
TECHNICAL CREW
Director: Sanjeev Reddy
Producers: Madhura Sreedhar Reddy, Nirvi Hariprasad Reddy
Story & Screenplay: Sanjeev Reddy, Shaik Dawood G
Cinematography: Mahireddy Pandugula
Music Director: Suneel Kashyap
Dialogues: Kalyan Raghav
Editor: Saikrishna Gandla
Production Designer: Shivakumar Machha
Costumes: Ashwath Bhairi, K. Pratibha Reddy
Choreography: Laxman Kalahasthi
Executive Producer: A. Madhusudhan Reddy
Marketing Consultant: Vishnu Kommalli
Lyrical Composition: Right Click Studio
Digital: House Full Digital
PRO: GSK Media (Suresh–Srinivas)
“సంతాన ప్రాప్తిరస్తు” సినిమాకు వస్తున్న రెస్పాన్స్ తో టీమ్ అంతా హ్యాపీగా ఉన్నాం – నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని సెంటర్స్ నుంచి ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ తో ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి రూపొందించారు. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా బాక్సాఫీస్ సక్సెస్ అందుకున్న నేపథ్యంలో ఈ మూవీ టీమ్ హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో
డైలాగ్ రైటర్ కల్యాణ్ రాఘవ్ మాట్లాడుతూ – “సంతాన ప్రాప్తిరస్తు” సినిమాకు మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. మీరు లేకుంటే ఈ సినిమాకు సక్సెస్ లేదు. ఇంకా చూడని వాళ్లు ఉంటే థియేటర్స్ కు వెళ్లి చూడమని రిక్వెస్ట్ చేస్తున్నా. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ మాట్లాడుతూ – మా మూవీకి ఆడియెన్స్ విజయాన్ని అందించారు. ఫ్యామిలీస్ తో కలిసి థియేటర్స్ కు వెళ్లి సినిమాను చూస్తున్నారు. సినిమా సక్సెస్ తో పాటు మ్యూజిక్ కు మంచి పేరు రావడం హ్యాపీగా ఉంది. అన్నారు.
స్క్రీన్ ప్లే రైటర్ షేక్ దావూద్.జి. మాట్లాడుతూ – “సంతాన ప్రాప్తిరస్తు” లాఫ్టర్ రైడ్ లాంటి మూవీ. ఈ సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షకులకు, సపోర్ట్ చేసిన మీడియాకు థ్యాంక్స్. ఈ వీకెండ్ మా మూవీని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి. అన్నారు.
డైరెక్టర్ సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ – ఏడాదిన్నర పాటు ఈ సినిమాకు పడిన కష్టం మర్చిపోయే విజయాన్ని ప్రేక్షకులు అందించారు. మీడియా నుంచి వచ్చిన ప్రశంసలతో పాటు చిన్న చిన్న సజెషన్స్ కూడా తీసుకుంటాం. మా హీరో తన సెకండ్ మూవీకే ఇలాంటి ఛాలెంజింగ్ సబ్జెక్ట్ ను యాక్సెప్ట్ చేశాడు. బరువు పెరిగి డీ గ్లామర్ గా నటించాడు. ప్రమోషన్స్ కోసం చాలా కష్టపడ్డాడు. చాందినీ చౌదరి ప్రామిసింగ్ రోల్ చేసింది. తను ఈ క్యారెక్టర్ కు లైఫ్ ఇచ్చింది. నేను అనుకున్న కాన్సెప్ట్ ను రాజీ పడకుండా స్క్రీన్ మీదకు తీసుకొచ్చేందుకు మా ప్రొడ్యూసర్స్ శ్రీధర్ గారు, హరి ప్రసాద్ గారు సపోర్ట్ ఇచ్చారు. డీజే టిల్లులో తండ్రి పాత్రలో మురళీధర్ గౌడ్ గారికి ఎంత పేరొచ్చిందో మా మూవీలో చైతన్య మామగారి క్యారెక్టర్ లో అంత రెస్పాన్స్ వస్తోంది. మరోసారి మా టీమ్ అందరికీ థ్యాంక్స్. అన్నారు.
ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ – మా సినిమాకు వస్తున్న రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం. సినిమాను ఆడియెన్స్ దగ్గరకు రీచ్ చేసేందుకు మా పీఆర్ఓస్ చాలా కష్టపడ్డారు. లగడపాటి శ్రీధర్ గారు ఈ రోజు మా సక్సెస్ మీట్ కు రావడం సంతోషంగా ఉంది. ఆయన నన్ను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చిన వ్యక్తి. ఈ సినిమా టైమ్ లో కూడా తన సపోర్ట్ అందించారు. హీరో విక్రాంత్, హీరోయిన్ చాందినీ తమ బెస్ట్ వర్క్ ఈ సినిమాకు ఇచ్చారు. ప్రతి సందర్భంలో సినిమాను నమ్మి నిలబడ్డారు. మురళీధర్ గౌడ్ గారు మా సినిమాకు పెద్ద అసెట్ అవుతారని స్క్రిప్ట్ టైమ్ లోనే అనుకున్నాం. అనుకున్నట్లే ఆయన క్యారెక్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రతి ప్రాడక్ట్ కు పాజిటివ్, నెగిటివ్ రివ్యూస్ ఉంటాయి. మేము పాజిటివ్ ను తీసుకుని ముందుకు వెళ్తున్నాం. మా మూవీ వచ్చే ఆదివారం వరకు రూ. 6.5 కోట్ల వరకు కలెక్ట్ చేస్తుందని ఆశిస్తున్నాం. మా లాంటి చిన్న చిత్రానికి ఇది పెద్ద బాక్సాఫీస్ నెంబర్ అనుకోవచ్చు. అన్నారు.
ప్రొడ్యూసర్ నిర్వి హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ – వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మా “సంతాన ప్రాప్తిరస్తు” సినిమాకు ప్రేక్షకుల పెద్ద విజయాన్ని అందించారు. శ్రీధర్ గారితో కలిసి మేము చేసిన తొలి ప్రయత్నంలోనే విజయం దక్కింది. మా విక్రాంత్, చాందినీ నటన అందరినీ ఆకట్టుకుంది. డైరెక్టర్ సంజీవ్ గారు సకుటుంబంగా చూసేలా సినిమాను రూపొందించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యంగా ఉండాలనే మంచి సందేశాన్ని మా సినిమా ద్వారా చెప్పాం. అన్నారు.
నటుడు మురళీధర్ గౌడ్ మాట్లాడుతూ – “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా మహిళ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. ఒక సెన్సిటివ్ ఇష్యూతో మా డైరెక్టర్ సంజీవ్ రెడ్డి గారు అద్భుతంగా సినిమాను రూపొందించారు. ఈ సినిమాకు ఎలాంటి విజయం దక్కుతుందని మేము ఆశించామో ప్రేక్షకులు ఆ సక్సెస్ ఇవ్వడం హ్యాపీగా ఉంది.
హీరోయిన్ చాందినీ చౌదరి మాట్లాడుతూ – మా “సంతాన ప్రాప్తిరస్తు” సినిమాను మీరంతా ఇష్టపడతారని అనుకున్నాము గానీ ఇంత ప్రేమ చూపిస్తారని ఊహించలేదు. నేను చేసిన కల్యాణి పాత్రకు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. మూవీ ప్రమోషన్స్ లో టూర్స్ కు వెళ్లినప్పుడు ఆడియెన్స్ కల్యాణి క్యారెక్టర్ తమకు బాగా నచ్చిందని చెబుతున్నారు. ఇలాంటి గుడ్ క్యారెక్టర్ డిజైన్ చేసి ఆ పాత్రను అందరికీ నచ్చేలా తీర్చిదిద్దిన ఘనత మా డైరెక్టర్ సంజీవ్ గారిదే. ఆ తర్వాత షేక్ దావూద్ గారు తన రైటింగ్ తో మా మూవీకి మరో పిల్లర్ లా నిలిచారు. హీరో విక్రాంత్ సినిమా కోసం బాగా కష్టపడ్డాడు. అతనికి మరిన్ని సక్సెస్ ఫుల్ మూవీస్ దక్కాలని కోరుకుంటున్నా. నాకు ఈ మూవీ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ శ్రీధర్ గారికి, హరి ప్రసాద్ గారికి థ్యాంక్స్. అన్నారు.
ప్రొడ్యూసర్ లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ – ఈ సినిమా సక్సెస్ అందుకున్నందుకు ముందుగా ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్. శ్రీధర్ నాకు మంచి మిత్రులు. హరి ప్రసాద్ గారు సినిమా మీద ప్యాషన్ తో ఇండస్ట్రీకి వచ్చారు. “సంతాన ప్రాప్తిరస్తు” ఒక హెల్దీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఈ చిత్రాన్ని మచ్చలేకుండా తెరకెక్కించారు డైరెక్టర్ సంజీవ్. ఆయనతో ఒక సినిమా చేయబోతున్నా. విక్రాంత్ మన ప్రామిసింగ్ యంగ్ హీరోల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంటారు. అలాగే చాందినీకి ఈ సినిమా మరోసారి మంచి గుర్తింపు తీసుకొస్తోంది. మురళీధర్ గౌడ్ గారు డీజే టిల్లు, మ్యాడ్ మూవీస్ లా ఈ చిత్రంలోనూ తన నటనతో పేరు తెచ్చుకున్నారు. భాషలకు అతీతంగా ప్రేక్షకులంతా ఇష్టపడే చిత్రమిది. అన్నారు.
హీరో విక్రాంత్ మాట్లాడుతూ – మూవీ కోసం పడిన కష్టాన్ని మర్చిపోయే విజయాన్ని ప్రేక్షకులు అందించారు. ఈ సినిమాకు మూడు పిల్లర్స్ ఎవరంటే మా డైరెక్టర్ సంజీవ్, రైటర్స్ షేక్ దావూద్, కల్యాణ్ రాఘవ్ అని చెప్పాలి. వాళ్లు ప్రతి సీన్ లో ఎలాంటి ఎమోషన్ కనెక్ట్ చేయాలి, ఎలాంటి ఫన్ ఇవ్వాలి, ఈ సీన్ ను ఎలా ల్యాండ్ చేయాలని ఎంతో శ్రద్ధగా క్రియేట్ చేశారు. ఈ సినిమాతో నాకు ఒక ఫ్యామిలీని మీట్ అయినట్లు ఉంది. చాందినీ లేకుంటే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. తను నాకు ఒక స్నేహితురాలిగా మారిపోయింది. హరి ప్రసాద్ గారు, శ్రీధర్ గారు సోదరుల్లా మారిపోయారు. మురళీధర్ గౌడ్ గారిని బయట కూడా మామా అనే పిలుస్తున్నా. ఇలాంటి బాండింగ్ తో మేమంతా చేసిన మూవీ ఆశించిన సక్సెస్ అందించింది. ప్రేక్షుకులు పైరసీని ఎంకరేజ్ చేయకుండా థియేటర్స్ కు వెళ్లి సినిమా చూడాలని కోరుతున్నా. మీరు థియేటర్స్ కు వెళ్తేనే మా లాంటి కొత్త హీరోస్ కు లైఫ్ ఉంటుంది. మా మూవీకి మీరు ఇస్తున్న కలెక్షన్స్ తో హ్యాపీగా ఉన్నాం. అన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ ఫిలిం జర్నలిస్ట్స్ ప్రభు, నాగేంద్ర పాల్గొని సినిమాలో ఒక సెన్సిటివ్ ఇష్యూను ఎంటర్ టైన్ మెంట్, మంచి మెసేజ్ తో ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించారని ప్రశంసించారు.
నటీనటులు – విక్రాంత్, చాందినీ చౌదరి, వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, హర్షవర్థన్, బిందు చంద్రమౌళి, జీవన్ కుమార్, సత్య కృష్ణ, తాగుబోతు రమేష్, అభయ్ బేతిగంటి, కిరీటి, అనిల్ గీల, సద్దామ్, రియాజ్, తదితరులు
టెక్నికల్ టీమ్
——————–
డైరెక్టర్ – సంజీవ్ రెడ్డి
ప్రొడ్యూసర్స్ – మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి
స్టోరీ, స్క్రీన్ ప్లే – సంజీవ్ రెడ్డి, షేక్ దావూద్.జి
సినిమాటోగ్రఫీ – మహిరెడ్డి పండుగుల
మ్యూజిక్ డైరెక్టర్ – సునీల్ కశ్యప్
డైలాగ్స్ – కల్యాణ్ రాఘవ్
ఎడిటర్ – సాయికృష్ణ గనల
ప్రొడక్షన్ డిజైనర్ – శివకుమార్ మచ్చ
కాస్ట్యూమ్ డిజైనర్స్ – అశ్వత్ భైరి, కె.ప్రతిభ రెడ్డి
కొరియోగ్రాఫర్ – లక్ష్మణ్ కాళహస్తి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎ మధుసూధన్ రెడ్డి
మార్కెటింగ్, ప్రమోషన్స్ కన్సల్టెంట్ – విష్ణు కోమల్ల
లిరికల్ కంపోజిషన్ – రైట్ క్లిక్ స్టూడియో
డిజిటల్ – హౌస్ ఫుల్ డిజిటల్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్- శ్రీనివాస్)
