
Mufti Police Releasing in Theaters from 21st of this month
Action King Arjun Sarja and Aishwarya Rajesh starrer Tamil investigative personal drama “Theeyavar Kulai Nadunga” is getting its Telugu release as “Mufti Police” on the 21st of this month. Directed by Dinesh Lakshmanan and produced by G. Arul Kumar under G.S.R.Arts, this Tamil film is being brought to Telugu audiences by noted producer A. N. Balaji under Sri Lakshmi Jyothi Creations.
Set against the backdrop of a writer’s murder, the film unfolds as a police investigative thriller, while giving strong importance to personal drama, which makes it unique. The film also touches upon autism, which has become a major concern for many children in recent times — a noteworthy inclusion.
Speaking about the release, A. N. Balaji, head of Sri Lakshmi Jyothi Creations, said:
“Considering the craze Action King Arjun and Aishwarya Rajesh (a.k.a. Bhagyam) enjoy in Telugu states, we are releasing Mufti Police in a large number of theatres. Along with action, the personal drama in this film is very engaging. We strongly believe the film will achieve tremendous success in both Tamil and Telugu. My heartfelt thanks to G. Arul Kumar for giving me the opportunity to present this film to Telugu audiences, and to director Dinesh Lakshmanan for crafting such a wonderful movie.”
The film also stars Ram Kumar Ganesan, Abhirami Venkatachalam, Praveen Raja and others.
Crew:
P.R.O: Dheeraj – Appaji,
Editing: Lawrence Kishore,
Cinematography: Bharath Aseenagan,
Music: Saravanan Abhimanyu,
Producer: G. Arul Kumar,
Writer–Director: Dinesh Lakshmanan,
Release: Sri Lakshmi Jyothi Creations – A. N. Balaji
యాక్షన్ కింగ్ అర్జున్ – ఐశ్వర్య రాజేష్’ల ఇన్వెస్టిగేటివ్ పర్సనల్ డ్రామా మఫ్టీ పోలీస్ ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు
శ్రీలక్ష్మిజ్యోతి క్రియేషన్స్ – ఎ. ఎన్. బాలాజీ ద్వారా తెలుగు విడుదల!!
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జ – ఐశ్వర్య రాజేష్ ల పోలీస్ ఇన్వెస్టిగేటివ్ పర్సనల్ డ్రామా “తీయవర్ కులై నడుంగ” తెలుగులో “మఫ్టీ పోలీస్”గా ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. దినేష్ లక్ష్మణన్ దర్శకత్వంలో జియస్సార్ అర్ట్స్ బ్యానర్ పై జి. అరుల్ కుమార్ నిర్మించిన ఈ తమిళ చిత్రాన్ని… తెలుగులో “మఫ్టీ పోలీస్” పేరుతో ప్రముఖ నిర్మాత ఎ. ఎన్. బాలాజీ… శ్రీలక్ష్మిజ్యోతి క్రియేషన్స్ ద్వారా విడుదల చేస్తున్నారు!!
ఒక రచయిత హత్య నేపద్యంలో పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ఈ చిత్రంలో పర్సనల్ డ్రామాకు పెద్ద పీట వేయడం విశేషం. అలాగే ఇటీవలకాలంలో పిల్లల పాలిట భూతంలా మారిన ఆటిజం వ్యాధి గురించి కూడా ఇందులో చర్చించి ఉండడం గమనార్హం!!
ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న శ్రీలక్ష్మిజ్యోతి క్రియేషన్స్ అధినేత ఎ. ఎన్. బాలాజీ మాట్లాడుతూ… “యాక్షన్ కింగ్ అర్జున్ – ఐశ్వర్య రాజేష్ అలియాస్ భాగ్యంలకు తెలుగునాట ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని అత్యధిక థియేటర్లలో “మఫ్టీ పోలీస్” చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఈ సినిమాలో యాక్షన్ తోపాటు పర్సనల్ డ్రామా కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తమిళంతోపాటు తెలుగులోనూ అసాధారణ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించే అద్భుత అవకాశాన్ని నాకు అందించిన జి.అరుల్ కుమార్ గారికి, ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దిన దర్శకుడు దినేష్ లక్ష్మణన్ లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు” అన్నారు!!
రామ్ కుమార్ గణేశన్, అభిరామి వెంకటాచలం, ప్రవీణ్ రాజా తదితరులు నటించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఒ: ధీరజ్ – అప్పాజీ, ఎడిటింగ్: లారెన్స్ కిషోర్, సినిమాటోగ్రఫీ: భరత్ ఆశీనగన్, మ్యూజిక్: శరవణన్ అభిమన్యు, నిర్మాత: జి.అరుల్ కుమార్, రచన – దర్శకత్వం: దినేష్ లక్ష్మణన్, విడుదల; శ్రీలక్ష్మిజ్యోతి క్రియేషన్స్ – ఎ. ఎన్. బాలాజీ!!
