
Kanakam Lyrical Song Released from Non-Violence
మెట్రో శిరీష్ , శ్రియ శరణ్ ఏకే పిక్చర్స్ నాన్-వయోలెన్స్ నుంచి కనకం లిరికల్ సాంగ్ రిలీజ్
మెట్రో శిరీష్ , శ్రియ శరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం నాన్-వయోలెన్స్. ఆనంద కృష్ణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే పిక్చర్స్ నిర్మిస్తుంది.
ఈ సినిమా నుంచి యువన్ శంకర్ రాజా కంపోజ్ చేసిన కనకం సాంగ్ ని రిలీజ్ చేశారు. అదిరిపోయే ఫుట్ ట్యాపింగ్ నెంబర్ గా ట్యూన్ చేసిన ఈ సాంగ్ లో యువన్ శంకర్ రాజా, తేజస్విని నందిభట్ల వోకల్స్ కట్టిపడేశాయి.
భాష్య శ్రీ అర్థవంతమైన సాహిత్యంతో అలరించారు. మెట్రో శిరీష్ , శ్రియ శరణ్ ఎనర్జిటిక్ మూవ్స్ తో ఆకట్టుకున్నారు.
ఈ చిత్రంలో బాబీ సింహా, యోగి బాబు, అదితి బాలన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ ఎన్ ఎస్ ఉతయకుమార్, ఎడిటర్ శ్రీకాంత్.
నటీనటులు: మెట్రో శిరీష్, బాబీ సింహా, యోగి బాబు, అదితి బాలన్
రచన & దర్శకత్వం ఆనంద కృష్ణన్
నిర్మాత : Ak Pictures
సంగీతం: యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రాఫర్: ఎన్ ఎస్ ఉతయకుమార్
ఎడిటర్: శ్రీకాంత్ Nb
పీఆర్వో – వంశీ శేఖర్
