Mass Jathara Trailer – Packs with high-voltage action and punchy dialogues

Telusa Nee Kosame SongFromSanthana Prapthirasthu Launched by Suresh Babu
The film Santhana Prapthirasthu stars Vikranth and Chandini Chowdary in the lead roles. It is being jointly produced by Madhura Sreedhar Reddy and Nirvi Hariprasad Reddy under the banners of Madhura Entertainment and Nirvi Arts. Directed by Sanjeev Reddy, the screenplay is written by Shaik Dawood G. The film is set for a grand theatrical release on November 14.
Today, producer Suresh Babu launched the lyrical song Telusa Nee Kosame from the movie at an event held at Ramanaidu Studios, Hyderabad. Music director Ajay Arasada, known for his work on successful projects like AAY and Save The Tigers, has beautifully composed the song. The lyrics are penned by Sreemani, while Armaan Malik has rendered the track with his soulful voice.
Screenplay writer Shaik Dawood G said, “India has now surpassed China in population, becoming the most populous country in the world. At the same time, the number of IVF and fertility centers has increased rapidly. We explored the reasons behind this in an entertaining way through this story. Santhana Prapthirasthu is a fun-filled family entertainer that everyone can enjoy together. We are confident that audiences will love it and hope for your support.”
Music director Ajay Arasada said, “Recently, I’ve been working on several entertaining projects like AAY, Save The Tigers, and 3 Roses. During that time, Sreedhar Garu invited me to work on Santhana Prapthirasthu. When I watched the movie, it gave me a very organic feel, which inspired me to compose the background score. Out of that BGM came this song Telusa Nee Kosame. Sreemani wrote beautiful lyrics, and Armaan Malik sang it wonderfully. I thank my entire music team for their support.”
Producer Madhura Sreedhar Reddy said, “Despite India’s huge population, there are still a large number of fertility centers. That’s where the story began. Childbirth issues have become a serious concern among busy professionals, especially software engineers. We’ve been witnessing this social issue for some years now. With this concept, we made Santhana Prapthirasthu as a clean family entertainer without any vulgarity. Our close circles who watched the movie have given us excellent feedback.
Small films often face release challenges, but we are moving forward confidently with the support of Suresh Productions. All our previous films have been distributed by them. I promised Suresh Babu Garu that we wouldn’t disappoint him. After showing him the teaser and trailer, he appreciated the film’s contemporary theme and entertainment value. Telusa Nee Kosame is a beautiful song that naturally emerges from the story – it will definitely be a chartbuster. Director Sanjeev works with sincerity; we’ve been collaborating since ABCD.
We searched for the right hero for a long time, and we found Vikranth – a brilliant performer who gave full cooperation throughout the shoot. You’ll see how perfect he is for the role when you watch the film. Chandini has also performed beautifully. Tharun Bhascker, Vennela Kishore, and Abhinav delivered excellent roles. We’re coming to theatres in just three weeks and hope for everyone’s support.”
Director Sanjeev Reddy said, “This film is based on the challenges faced by modern-day couples, but it doesn’t preach or give messages. It’s told in a fun and entertaining way. Our producers Sreedhar Garu and Hariprasad Garu provided everything we needed, from artists to production support. Vikranth looks even more charming off-screen – in the film, he plays a software engineer and appears just like one. He supported us greatly throughout.
Ajay Garu composed Telusa Nee Kosame from a background score idea, and the chemistry between the lead pair shines through the song. I thank my passionate team for their hard work, which made this movie what it is.”
Hero Vikranth said, “When I first heard the story of Santhana Prapthirasthu, I was very happy. The story addresses a burning issue faced by today’s society, but in a lighthearted, message-free way. Many young couples face social pressure when they don’t have children, which mentally affects them – tthis film also touches that emotional aspect.
If my performance in this film is appreciated, the credit goes to our director Sanjeev Reddy. I thank our producers Sreedhar Garu and Hariprasad Garu for giving me this opportunity. Ajay Arasada’s background score has elevated the film to another level. My all-time favorite song from this film is Telusa Nee Kosame, beautifully written by Sreemani and sung by Armaan Malik.
I thank my co-actors Vennela Kishore, Tarun Bhascker, Abhinav, and the entire cast. Chandini’s performance will surely impress everyone. Santhana Prapthirasthu is a wholesome family film that upholds family values without any obscenity. We’re releasing in theatres on November 14 and hope you all will support us.”
Producer Suresh Babu said, “I wish the entire Santhana Prapthirasthu team all the best. Madhura Sreedhar is a good friend of mine. From a software engineer to a passionate filmmaker, his efforts have always been successful. The songs of this movie are very good. Congratulations to music director Ajay. I sincerely hope this film becomes a musical hit.”
Cast: Vikranth, Chandini Chowdary, Vennela Kishore, Tarun Bhascker, Abhinav Gomatam, Muralidhar Goud, Harshavardhan, Bindu Chandramouli, Jeevan Kumar, Satya Krishna, Thagubothu Ramesh, Abhay Bethiganti, Kireeti, Anil Geela, Saddam, Riyaz, and others.
Technical Crew:
Director – Sanjeev Reddy
Producers – Madhura Sreedhar Reddy, Nirvi Hariprasad Reddy
Story & Screenplay – Sanjeev Reddy, Shaik Dawood G
Cinematography – Mahireddy Pandugula
Dialogues – Kalyan Raghav
Editor – Sai Krishna Ganala
Production Designer – Shivakumar Matcha
Costume Designers – Ashwath Bhairi, K. Pratibha Reddy
Choreographer – Lakshman Kalahasthi
Executive Producer – A. Madhusudhan Reddy
Marketing & Promotions Consultant – Vishnu Komalla
Lyrical Composition – Right Click Studio
Digital Promotions – House Full Digital
PRO – GSK Media (Suresh–Sreenivas)
“సంతాన ప్రాప్తిరస్తు” సినిమా మంచి మ్యూజికల్ హిట్ అవుతుంది – ‘తెలుసా నీకోసమే..’ సాంగ్ లాంఛ్ ఈవెంట్ లో ప్రొడ్యూసర్ సురేష్ బాబు
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా “సంతాన ప్రాప్తిరస్తు”. ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా నవంబర్ 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా నుంచి తెలుసా నీ కోసమే లిరికల్ సాంగ్ ను ప్రొడ్యూసర్ సురేష్ బాబు అతిథిగా రిలీజ్ చేశారు. “ఆయ్”, “సేవ్ ది టైగర్స్” వంటి సక్సెస్ ఫుల్ ప్రాజెక్ట్స్ కు వర్క్ చేసిన టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ ‘తెలుసా నీ కోసమే..’ పాటను బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. శ్రీమణి ఆకట్టుకునే లిరిక్స్ అందించగా.. అర్మాన్ మాలిక్ మనసుకు హత్తుకునే పాడారు. ఈ సాంగ్ లాంఛ్ ఈవెంట్ లో..
స్క్రీన్ ప్లే రైటర్ షేక్ దావూద్. జి. మాట్లాడుతూ – జనాభాలో భారత్ చైనాను దాటేసింది. మనది ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం. మరోవైపు ఐవీఎఫ్, ఫర్టిలిటీ సెంటర్స్ చాలా పెరిగాయి. ఎందుకు అనే పాయింట్ ను డిస్కస్ చేస్తూ ఎంటర్ టైనింగ్ వే లో రాసుకున్న స్టోరీ ఇది. “సంతాన ప్రాప్తిరస్తు” మంచి ఎంటర్ టైనింగ్ మూవీ. మీరంతా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది. ఈ చిత్రంలో మంచి వినోదం ఉంటుందని మేమంతా గట్టిగా చెప్పగలం. మా సినిమాకు మీరంతా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ మాట్లాడుతూ – నేను ఇటీవల వరుసగా ఎంటర్ టైనింగ్ మూవీస్ చేస్తూ వస్తున్నాను. ఆయ్, సేవ్ ది టైగర్స్, త్రీ రోజెస్..ఇలాంటి ఎంటర్ టైనర్స్ చేస్తున్న టైమ్ లో శ్రీధర్ గారు పిలిచి “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా చూడమన్నారు. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయమని అడిగారు. ఈ మూవీ చూస్తున్నంత సేపూ ఎంతో ఆర్గానిక్ ఫీల్ కలిగింది. అలా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తున్న క్రమంలోనే తెలుసా నీ కోసమే కంపోజ్ చేశాం. బీజీఎం నుంచి వచ్చిన సాంగ్ ఇది. శ్రీమణి బ్యూటిఫుల్ గా రాశాడు, అర్మాన్ బాగా పాడాడు. నా మ్యూజిక్ టీమ్ అందరికీ థ్యాంక్స్. అన్నారు.
ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ – అత్యధిక జనాభా ఉన్న మన దేశంలో పెద్ద సంఖ్యలో ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి. ఈ పాయింట్ నుంచే కథ మొదలైంది. పిల్లలు పుట్టకపోవడం అనేది బిజీ లైఫ్ లో ఉన్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్స్ గానీ ఇతర ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ల జీవితాల్లో పెద్ద సమస్యగా మారింది. గత కొన్నేళ్లుగా మన సొసైటీలో ఈ సమస్యను చూస్తున్నాం. ఈ పాయింట్ తో “సంతాన ప్రాప్తిరస్తు” సినిమాను ఎలాంటి వల్గారిటీ లేకుండా మంచి ఫన్, ఎంటర్ టైన్ మెంట్ తో ఫ్యామిలీ అంతా చూసేలా రూపొందించాం. మా క్లోజ్ సర్కిల్ లో సినిమా చూసిన వారంతా చాలా బాగుందని చెబుతున్నారు. చిన్న చిత్రాలకు ఉండే రిలీజ్ ప్రాబ్లమ్స్ గురించి మన అందరికీ తెలిసిందే. అయితే మాకు సురేష్ ప్రొడక్షన్స్ ఉంది అనే ధైర్యంతో ముందడుగు వేస్తుంటాం. మేము చేసిన సినిమాలన్నీ సురేష్ సంస్థ ద్వారానే డిస్ట్రిబ్యూట్ అవుతుంటాయి. ఈసారి డిజప్పాయింట్ చేయము అని చెప్పి సురేష్ బాబు గారికి మాటిచ్చాను. ఆయనకు టీజర్, ట్రైలర్ చూపించాం. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా కాంటెంపరరీగా ఉంటూ ఎంటర్ టైన్ చేస్తుంది, ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది. తెలుసా నీ కోసమే బ్యూటిఫుల్ సాంగ్, కథలోనుంచి వచ్చిన పాట ఇది. తప్పకుండా ఛాట్ బస్టర్ అవుతుంది. డైరెక్టర్ సంజీవ్ సిన్సియర్ గా వర్క్ చేస్తారు. ఏబీసీడీ మూవీ నుంచి మేము కలిసి ట్రావెల్ చేస్తున్నాం. ఈ కథకు మంచి హీరో కావాలని చాలా రోజులు చూశాం. మాకు విక్రాంత్ దొరికాడు. చాలా మంచి పర్ ఫార్మర్. సినిమా చేస్తున్న ఈ మొత్తం టైమ్ లో అతని ఎంతో కోపరేట్ చేస్తూ వచ్చాడు. ఈ కథకు విక్రాంత్ యాప్ట్ అనేది మీకు సినిమా చూశాక తెలుస్తుంది. చాందినీ బాగా నటించింది. తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్, అభినవ్ వీళ్లంతా మంచి రోల్స్ చేశారు. మరో మూడు వారాల్లో మీ ముందుకు రాబోతున్నాం. మీ అందరి సపోర్ట్ మాకు దక్కుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.
డైరెక్టర్ సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ – ఈ రోజు సమాజంలో కపుల్స్ ఎదుర్కొంటున్న సమస్య నేపథ్యంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. అయితే ఎక్కడా సందేశాలు ఇచ్చేలా సినిమా ఉండదు. ఫన్, ఎంటర్ టైన్ మెంట్ తో లైటర్ వేన్ లో మూవీ వెళ్తుంటుంది. మా ప్రొడ్యూసర్స్ శ్రీధర్ గారు, నిర్వి హరిప్రసాద్ గారు మూవీకి కావాల్సిన ఆర్టిస్టులతో పాటు ప్రొడక్షన్ పరంగా కావాల్సినవన్నీ ఇచ్చి సపోర్ట్ చేశారు. మా హీరో విక్రాంత్ మూవీలో కంటే బయటే అందంగా ఉంటాడు ఎందుకంటే మా సినిమాలో అతను సాప్ట్ వేర్ ఇంజినీర్. వాళ్లు ఎలా కనిపిస్తారో అలా విక్రాంత్ మేకోవర్ ఉంటుంది. విక్రాంత్ మాకు బాగా సపోర్ట్ చేశాడు. తెలుసా నీకోసమే పాటను అజయ్ గారు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నుంచి సాంగ్ లా కంపోజ్ చసి తీసుకొచ్చారు. హీరో హీరోయిన్స్ మధ్య ఉండే కెమిస్ట్రీ ఈ పాటలో బాగా రిఫ్లెక్ట్ అవుతుంది. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా ఇంత బాగా వచ్చేందుకు ప్యాషనేట్ గా వర్క్ చేసిన నా టీమ్ అందరికీ థ్యాంక్స్. అన్నారు.
హీరో విక్రాంత్ మాట్లాడుతూ – “సంతాన ప్రాప్తిరస్తు” కథ విన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ కథలో నేడు సొసైటీ ఎదుర్కొంటున్న ఒక బర్నింగ్ ఇష్యూను ఎలాంటి మెసేజ్ లు ఇవ్వకుండా లైట్ హార్టెట్ గా స్క్రిప్ట్ చేశారు. పిల్లలు పుట్టిన యంగ్ కపుల్స్ సొసైటీ నుంచి ఒక ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇది వారిని మానసికంగా ఇబ్బందిపెడుతుంది. అలాంటి ఎమోషనల్ కంటెంట్ కూడా ఈ మూవీలో ఉంది. ఈ సినిమాలో నా పర్ ఫార్మెన్స్ కు పేరొస్తే దానికి కారణం మా దర్శకుడు సంజీవ్ రెడ్డి. ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన మా ప్రొడ్యూసర్స్ శ్రీధర్ గారికి, హరిప్రసాద్ గారికి థ్యాంక్స్. అజయ్ అరసాడ తన బీజీఎంతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. నా ఆల్ టైమ్ ఫేవరేట్ సాంగ్ తెలుసా నీ కోసమే. ఈ పాటకు శ్రీమణి మంచి లిరిక్స్ ఇచ్చారు, అర్మాన్ మాలిక్ బాగా పాడారు. మా మూవీలో యాక్ట్ చేసిన వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, అభినవ్..ఇతర కాస్ట్ అందరికీ థ్యాంక్స్. చాందినీ పర్ ఫార్మెన్స్ మీ అందరినీ ఆకట్టుకుంటుంది. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది, ఫ్యామిలీ వ్యాల్యూస్ చెబుతుంది. ఎక్కడా అసభ్యత అనేది ఉండదు. నవంబర్ 14న థియేటర్స్ లోకి వస్తున్న మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.
నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ – “సంతాన ప్రాప్తిరస్తు” టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. మధుర శ్రీధర్ నాకు మంచి మిత్రులు. ఆయన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నుంచి ప్రొడ్యూసర్ గా మారారు. సినిమా అంటే ఎంతో ప్యాషన్ తో ఉంటారు. ఆయన ఎఫర్ట్స్ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. “సంతాన ప్రాప్తిరస్తు” సాంగ్స్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ కు కంగ్రాట్స్. ఈ సినిమా మంచి మ్యూజికల్ హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.
నటీనటులు – విక్రాంత్, చాందినీ చౌదరి, వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, హర్షవర్థన్, బిందు చంద్రమౌళి, జీవన్ కుమార్, సత్య కృష్ణ, తాగుబోతు రమేష్, అభయ్ బేతిగంటి, కిరీటి, అనిల్ గీల, సద్దామ్, రియాజ్, తదితరులు
టెక్నికల్ టీమ్
——————–
డైరెక్టర్ – సంజీవ్ రెడ్డి
ప్రొడ్యూసర్స్ – మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి
స్టోరీ, స్క్రీన్ ప్లే – సంజీవ్ రెడ్డి, షేక్ దావూద్.జి
సినిమాటోగ్రఫీ – మహిరెడ్డి పండుగుల
డైలాగ్స్ – కల్యాణ్ రాఘవ్
ఎడిటర్ – సాయికృష్ణ గనల
ప్రొడక్షన్ డిజైనర్ – శివకుమార్ మచ్చ
కాస్ట్యూమ్ డిజైనర్స్ – అశ్వత్ భైరి, కె.ప్రతిభ రెడ్డి
కొరియోగ్రాఫర్ – లక్ష్మణ్ కాళహస్తి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎ మధుసూధన్ రెడ్డి
మార్కెటింగ్, ప్రమోషన్స్ కన్సల్టెంట్ – విష్ణు కోమల్ల
లిరికల్ కంపోజిషన్ – రైట్ క్లిక్ స్టూడియో
డిజిటల్ – హౌస్ ఫుల్ డిజిటల్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్- శ్రీనివాస్)
