
అందరిని ఆకట్టుకున్నరెయిన్బో చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ వేడుక
రెయిన్బో చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ దీపావళి పండగ సందర్బంగా చిల్డ్రన్స్ కల్చర్ ప్రోగ్రామ్ అండ్ కాంపిటీషన్స్ చిక్కడపల్లి లో ని త్యాగరాయ గాన సభ లో నిర్వహించడం జరిగింది. ఈ కాంపిటీషన్స్ కి చాలా మంది పిల్లలు పాల్గొని క్లాసికల్, సెమీ క్లాసికల్, వెస్ట్రన్, ఫోక్ మరియు సింగింగ్ లో తమ టాలెంట్ ని ప్రదర్శించారు. విజేత లు అయినా పిల్లల కి ఈ కార్యక్రమానికి వచ్చిన సెలబ్రిటీల చేతుల మీదుగా బహుమతులు ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా బిక్కవల్లి సత్యానందం గారు హానర్ బుల్ గెస్ట్ లు గా ఘర్షణ శ్రీనివాస్ గారు మరియు భోగి రెడ్డి శ్రీనివాస్ గారు అలాగే గెస్ట్ లు గా డాక్టర్ బాలకిషన్ గారు మరియు జ్యోతి, పవిత్ర గారు ఇంకా చాలా మంది గెస్ట్ లు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమం మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చాలా గ్రాండ్ గా జరిగింది. ఇదే కార్యక్రమం లో సెలబ్రిటీల చేతుల మీదుగా వచ్చేనెల జరగబోయే రెయిన్బో చిల్డ్రన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ బ్రోచర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. వచ్చే నెల రెయిన్బో చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ రెండు రోజులు చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది.Nov 13వ తారీఖున లమాఖాన్ బంజారాహిల్స్ లో 14 వ తారీఖున రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్లో ఈ ఫిలిం ఫెస్టివల్ మరియు అవార్డు ల ఫంక్షన్ జరుగుతుంది. అలాగే 16 వ తారీఖున భారత్ వికాస్ పరిషత్ ఆడిటోరియంలో కూడా ఈ చిల్డ్రన్స్ కల్చరల్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అక్కడ కూడా పిల్లలకు అవార్డులు ఇవ్వడం జరుగుతుంది.పిల్లల్ని ఆకర్షించే విధంగా ఈ రెయిన్బో చిల్డ్రన్స్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమానికి వచ్చిన రెస్పాన్స్ కి చాలామంది చాలా గొప్పగా చెప్పారు. పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి రెయిన్బో చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంది. ఇక ముందు కూడా రెయిన్బో చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ ఇంకా కొత్త కొత్త కార్యక్రమాల్ని మొదలుపెట్టనుంది . ఈ కార్యక్రమానికి రెయిన్బో చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ రథసారథి అయిన జనరల్ సెక్రెటరీ కే మోహన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. జ్యోతి ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించారు.