
ఎంజీఆర్ తుకారాం, ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్ కాగితం పడవలు నుంచి బ్యూటిఫుల్ గ్లింప్స్ రిలీజ్
ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్యూటిఫుల్ లవ్ స్టొరీ కాగితం పడవలు’. ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కీర్తన నరేష్ T. R. ప్రసాద్ రెడ్డి వెంకట్రాజుల, గాయిత్రమ్మ అంజనప్ప నిర్మిస్తున్నారు.
మేకర్స్ తాజాగా రిలీజ్ చేసిన గ్లింప్స్ హార్ట్ టచ్చింగ్ గా ఉంది. డైలాగ్స్ ప్రేమకథలోని డెప్త్ ని తెలియజేస్తున్నాయి.
తీరంలో ఓ జంట ప్రేమగా మాట్లాడుకోవడం, విజువల్స్, నేపధ్య సంగీతం అన్నీ అద్భుతంగా వున్నాయి. గ్లింప్స్ చాలా క్యురియాసిటీ పెంచింది.
దర్శకుడు ఎంజీఆర్ తుకారాం లవ్లీ ఎమోషన్స్, హృదయాన్ని తాకే కథ, అందమైన విజువల్స్ తో ఈ చిత్రాన్ని మలిచినట్లు గ్లింప్స్ చూస్తే అర్ధమౌతోంది.
ఈ చిత్రానికి AIS.నౌఫల్ రాజామ్యూజిక్ అందిస్తున్నారు. రుద్రసాయి & జానా డీవోపీగా పని చేస్తున్నారు జెస్విన్ ప్రభు ఎడిటర్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎం.హిమ బిందు.
త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
రచన & దర్శకత్వం: ఎంజీఆర్ తుకారాం
నిర్మాతలు: కీర్తన నరేష్, T. R. ప్రసాద్ రెడ్డి వెంకట్రాజుల, గాయిత్రమ్మ అంజనప్ప
సంగీతం : AIS.నౌఫల్ రాజా
డీవోపీ: రుద్రసాయి
ఎడిటర్: జెస్విన్ ప్రభు
కాస్ట్యూమ్స్: కిరణ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.హిమ బిందు
సాహిత్యం: రెహమాన్
పీఆర్వో: తేజస్వి సజ్జా