K-Ramp 3rd Single Tikkal Tikkal.. Released -Grand Theatrical Release on

The Great Pre Wedding Show Teaser Unveiled
A comedy drama titled The Great Pre-Wedding Show is up for release. Featuring the versatile actor Thiruveer and Teena Sravya in the lead roles, it is produced by Sanddeep Agaram and Ashmita Reddy Basani under the banners of 7 PM Productions and Puppet Show Productions. Rahul Srinivas is directing the film, which is scheduled for release in theatres on November 7th.
The film’s unit today released a teaser through Rowdy Star Vijay Deverakonda and sensible director Sekhar Kammula. Vijay Deverakonda, sharing the teaser on social media, wrote, “I have known Thiruveer from before the world knew me. And I am so happy to see him live his dreams! Here is the teaser of #TheGreatPreWeddingShow. A very interesting and relatable premise which Looks like a breezy ride! Best wishes to Thiruveer and the entire team (sic).”
Coming to the teaser, the male lead runs his own studio and enjoys a sought-after status in his area. “In this whole mandal, whether it’s a birthday, wedding, or pre-wedding, I am the go-to guy for shoots,” the protagonist says. This opening line sets the tone for his characterization. The rom-com track is interesting. “Can we use your photo for our studio gallery?” he asks the female lead in a cheery tone. When the heroine asks him why, he doesn’t mince words to compliment her on her looks. Her response suggests that the romantic track is going to be about sweet-nothings and flirtations. These dialogues hint at the cool nature of the love track between the hero and heroine.
At one point, the hero agrees to do a pre-wedding shoot, and the scenes show him getting troubled by the bride’s mother’s rules during the shoot. In the final moments of the teaser, he asks his assistant, “Does this dress look good?” only to be told that he looks like a hero. This is a funny moment that gives viewers a taste of the film’s humor and vibe.
Thiruveer, Teena Sravya, and Master Rohan’s performances are impressive. Suresh Bobbili’s music and background score, along with K. Soma Sekhar’s cinematography, are assets to the film. Naresh Adupa is handling the editing responsibilities.
Cast:
Thiruveer, Teena Sravya, Master Rohan, and others
Technical Crew:
Writer & Director: Rahul Srinivas
Producers: Sanddeep Agaram, Ashmita Reddy Basani
Co-Producer: Kalpana Rao
Music: Suresh Bobbili
Cinematography: K Soma Sekhar
Editor: Naresh Adupa
Executive Producer: Prajnay Konigari
Production Designer: Phani Teja Musi
Costumes: Aarthi Vinnakota, Priyanka Veeraboina
Sound Designer: Ashwin Rajashekhar
PROs: Naidu Surendra Kumar – Phani Kandukuri (Beyond Media)
Publicity Designer: Idal Dots
Marketing: Housefull Media
తిరువీర్, టీనా శ్రావ్య హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న కామెడీ డ్రామా ‘ది గ్రేట్ వెడ్డింగ్ షో’ టీజర్ విడుదల చేసిన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల
వెర్సటైల్ యాక్టర్ తిరువీర్, టీనా శ్రావ్య హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. 7 పి.ఎం.ప్రొడక్ష్సన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై సందీప్ అగరం, అస్మితా రెడ్డి బాసిని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 7న సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ మంగళవారం టీజర్‌ను రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రిలీజ్ చేశారు. ‘ప్రపంచానికి తెలియటం కంటే ముందే తిరువీర్ గురించి నాకు తెలుసు. తను కలల ప్రపంచంలో జీవించటాన్ని చూసి నేను సంతోషపడుతుంటాను. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ టీజర్ చాలా ఆసక్తికరంగా చల్లటి గాలి మనసుని హత్తుకున్నట్లు ఉంది’ అని విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో చిత్ర యూనిట్‌ని అభినందించారు. టీజర్‌ను గమనిస్తే..
‘ఇదేన్నా మా ఊళ్లో రమేష్ ఫొటో స్టూడియో’ అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. ‘ఈ మండలం మొత్తంలో బర్త్ డే అయినా, వెడ్డింగ్ అయినా, ప్రీ వెడ్డింగ్ అయినా మన దగ్గరే చేయించుకుంటారన్నా..’ అనే డైలాగ్‌తో హీరో క్యారెక్టరైజేషన్‌ను రివీల్ చేశారు.
‘అరే ఈ లైట్ అక్కడ పెట్టు’ అంటూ హీరోయిన్ ముందు హీరో చేసే హడావుడి.. దానికి ఆమె భయపడే తీరు, ‘ఎవండీ మీ ఫొటో తీసుకుని మా గ్యాలరీలో పెట్టుకోవచ్చా’ అని హీరోయిన్ని హీరో అడగటం.. దానికి హీరోయిన్ ‘నా ఫొటో ఎందుకు’ అని అడగటం.. దానికి సమాధానంగా హీరో ‘అంటే మీరు బావుంటారు కదా’ అని సమాధానం చెబుతాడు. దానికి హీరోయిన్ ‘ఏశావులే సోపు’ అని వ్యంగ్యంగా కౌంటర్ ఇవ్వటం వంటి డైలాగ్స్ చూస్తుంటే హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ ఎలా ఉండవచ్చుననే విషయం తెలుస్తుంది. ఓ సందర్భంలో హీరో ఓ ప్రీ వెడ్డింగ్ షూట్‌కి ఒప్పుకోవటం.. పెళ్లి కూతురు తల్లి కండీషన్స్‌తో ప్రీ వెడ్డింగ్ షూట్ చేసే హీరోని ఇబ్బంది పెట్టే సన్నివేశాలు
టీజర్ చివరలో హీరో తన అసిస్టెంట్‌తో ‘ఈ డ్రెస్ బావుందారా’ అని అడిగితే ‘హీరోలా ఉన్నావన్నా’ అని అసిస్టెంట్ అంటే హీరో ఏమో షాక్ కావటం వంటి ఫన్నీ సీన్స్ సినిమా ఎలా ఉండబోతుందనే విషయాన్ని చెప్పారు మేకర్స్.
తిరువీర్, టీనా శ్రావ్య, మాస్టర్ రోహన్ యాక్టింగ్ ఆకట్టుకుంటోంది. సురేష్ బొబ్బిలి సంగీతం, నేపథ్య సంగీతం, కె.సోమ శేఖర్ సినిమాటోగ్రఫీ సినిమాకు ఎసెట్ అవుతున్నాయి. నరేష్ అడుప ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నటీనటులు: తిరువీర్, టీనా శ్రావ్య, మాస్టర్ రోహన్ తదితరులు
సాంకేతిక వర్గం:
రచన, దర్శకత్వం: రాహుల్ శ్రీనివాస్
నిర్మాత: సందీప్ అగరం, అస్మితా రెడ్డి బాసిని
కో ప్రొడ్యూసర్: కల్పనా రావ్
మ్యూజిక్: సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ: కె.సోమ శేఖర్
ఎడిటర్: నరేష్ అడప
ఎగ్జిటివ్ ప్రొడ్యూసర్: ప్రజ్ఞయ్ కొనిగిరి
ప్రొడక్షన్ డిజైనర్: ఫణి తేజ ముసి
కాస్ట్యూమ్స్: ఆరతి విన్నకోట, ప్రియాంక వీరబోయిన
సౌండ్ డిజైనర్: అశ్విన్ రాజశేఖర్
పి.ఆర్.ఒ: నాయుడు సురేంద్ర – ఫణి (బియాండ్ మీడియా)
పబ్లిసిటీ డిజైనర్: ఐడిల్ డాట్స్
మార్కెటింగ్: హౌస్‌ఫుల్ మీడియా