కానిస్టేబుల్ కనకం లాంటి గొప్ప పాత్ర చేయడం గౌరవంగా భావిస్తున్నాను – వర్ష

అమ్మాయిలను అమ్మోరులా పెంచాలని చెప్పే సినిమా బ్యాడ్ గాళ్స్ – డైరెక్టర్ మున్నా
‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ మున్నా ధులిపూడి నుంచి వస్తున్న మరో చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్. అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ చిత్రంలో రోహన్ సూర్య, మొయిన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ లిరిసిస్ట్ చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ మోషన్ పోస్టర్‌ను ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన గ్రాండ్ ప్రెస్మీట్లో దర్శకులు చందూ మొండేటి, శివ నిర్వాణ, కృష్ణ చైతన్య ముఖ్య అతిథులుగా పాల్గొని రివీల్ చేశారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కృష్ణచైతన్య మాట్లాడుతూ..‘‘మున్నా చాలా సరదాగా ఉంటాడు. చాలా కొద్ది మంది దర్శకులే కొత్తవాళ్లని పెట్టుకుని సినిమా చేస్తారు. నా మిత్రుడు మున్నా కష్టానికి తగిన ఫలితం రావాలి. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. చంద్రబోస్ గారి పేరు ఉంటే చాలు. మొయిన్ 15 ఏళ్ల క్రితమే హీరో అవుతా అని చెప్పాడు. డైరెక్టర్ పవన్‌కి అప్పగించి నటుడిని చేశా. అక్కడి నుంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ ఇక్కడి వరకు వచ్చాడు. టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్
శివ నిర్వాణ మాట్లాడుతూ..‘‘బ్యాడ్ గాళ్స్ మూవీ మంచి సక్సెస్ సాధించాలి. టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్. నలుగురు కొత్త అమ్మాయిలను పెట్టి చేయడం నిజంగా సాహసమే. ఇంత యంగ్ టాలెంట్‌తో కాన్సెప్ట్ ఫిల్మ్‌ను తీస్తున్న మున్నా ముక్కుసూటి మనిషి. ఈ సినిమా అతడికి మంచి విజయాన్ని అందిస్తుంది. నిర్మాతలందరికీ మంచి డబ్బులు రావాలి. ఈ సినిమాకు రెండు మెయిన్ పిల్లర్స్ అనూప్, చంద్రబోస్ గారు. నీలి నీలి ఆకాశం ఎంతగానో వైరల్ అయింది. ఒక పాటతోనే మున్నా అందరికీ తెలిశాడు. అలాంటి పాట ఈ సినిమాలో కూడా ఒకటి ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి.’’
కమెడియన్ భద్రం మాట్లాడుతూ..‘‘డైరెక్టర్ మున్నానే ఈ సినిమాకు హీరో. మేమిద్దరం గూగుల్ ఆఫీసు చుట్టూ తిరిగేవాళ్లం. నీలి నీలి ఆకాశం డైరెక్టర్ అని విన్నప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది. బ్యాడ్ అయినా గుడ్ అయినా సందర్భాన్ని బట్టి మారుంది. ఈ సినిమా అందరికీ మంచి గుర్తింపు తీసుకురావాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు.
డైరెక్టర్ చందూ మొండేటి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ నాకు పరిచయం ఉన్నవాళ్లే. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. అందరికీ ఆల్ ది బెస్ట్’’ అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ..‘‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా తర్వాత నేను మున్నాగారితో కలిసి వర్క్ చేస్తున్నా. ఈ సినిమా కూడా అద్భుతమైన చిత్రం అవుతుంది. నీలినీలి ఆకాశం బ్యానర్లో మున్నాతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్ టు అవర్ టీమ్.’’ అని అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో పాటలు, కథ అన్నీ చాలా బాగున్నాయి. ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. బ్యాడ్ గాళ్స్ అంటున్నా కానీ వాళ్లు చాలాబాగా యాక్ట్ చేశారు. ప్రతి ఫ్యామిలీ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయాలని కోరుతున్నాం.’’ అని అన్నారు.
డైరెక్టర్ మున్నా మాట్లాడుతూ..‘‘బాహుబలిలో బిడ్డను కాపాడే చేయిలా నాకు చేయందించింది మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్. నాకు ఇంత గుర్తింపు రావడానికి కారణం చంద్రబోస్ గారు, అనూప్ గారే. చంద్రబోస్ గారు రాలేకపోయారు. నేను మిస్ అయ్యా. ఆ పాట పేరుతోనే నేను బ్యానర్ పెట్టుకున్నా. నేను ఎప్పుడు సినిమాలు చేసినా వీళ్లిద్దరితోనే చేస్తా. మా కాంబినేషన్లో మళ్లీ అలాంటి పాట రాబోతోంది. 10 రోజుల్లో సాంగ్ రిలీజ్ చేస్తాం. అదొక మంచి ప్రీవెడ్డింగ్ సాంగ్ అవుతుంది. నాలైఫ్‌లో అనూప్ ఇంకొక మంచి గిఫ్ట్ ఇచ్చారు. ఈ స్టోరీకి ఎంతోమంది అమ్మాయిల కథలు స్ఫూర్తినిచ్చాయి. నేను ఒకరోజు ఉదయం 4 గంటలకు హైదరాబాద్‌లో రోడ్డుపై లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తుంటే ఒక అమ్మాయి బండి ఆపి చార్మినర్ దగ్గరకు వెళ్లి చాయ్ తాగుదామా అని అడిగింది. తను పెళ్లి తర్వాత ఫ్రీడం ఉండదని అలా లాస్ట్ రోజు ఎంజాయ్ చేయడానికి వచ్చానని చెప్పింది. అమ్మాయిలకు పెళ్లి ముందు ఉండే ఫ్రీడం పెళ్లి తర్వాత ఉండదు. అలాంటి చాలా మంది కథల స్ఫూర్తితో ఈ సినిమా తీశా. ఈ కథను ఐదారుగురు పెద్ద నిర్మాతలకు చెప్పాను. కొత్త అమ్మాయిలతో మార్కెట్ అవుతుందా అని అడిగారు. అందుకే నేను, నా క్లాస్మేట్స్ డబ్బులు పెట్టి ఈ సినిమా తీశాం. బాగా చదువుకున్నవాళ్ల కథ ఇది. అమ్మాయిలను పేరెంట్స్ భయంతో పెంచుతాం. అమ్మాయిలను భయంతో కాదు ధైర్యంతో పెంచాలి అని చెప్పే కథ ఇది. అమ్మాయిలను అమ్మోరులా పెంచాలి. స్కూల్లో అమ్మాయిలను తమను తాము కాపాడుకునే సెల్ఫ్ డిఫెన్స్ ఒక సబ్జెక్ట్‌లా పెట్టాలి. మా మూవీ టీమ్ నుంచి అన్ని రాష్ట్రాల సీఎంలకు, కేంద్రప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ బ్యానర్ పెట్టడానికి కారణం డైరెక్టర్ మారుతి గారు. వాళ్ల స్ఫూర్తితోనే బ్యానర్ పెట్టాం. ట్రైలర్, సాంగ్స్ నచ్చితేనే మా సినిమా చూడండి. నీలినీలి ఆకాశంలాంటి సాంగ్ ఉంది. డైరెక్టర్ బుచ్చిబాబుకు ఈ కథ చెబితే ఇది చిన్న సినిమా కాదు చాలా మంచి సినిమా అవుతుందని ప్రోత్సహించాడు. సుకుమార్ గారికి టైటిల్ చెబితే అదిరిపోయిందన్నారు. ఈ నలుగురు అమ్మాయిలను లైఫ్‌లో మర్చిపోలేను. రేణూ దేశాయ్ గారు ఇందులో ఒక మంచి క్యారెక్టర్ చేశారు. నెక్ట్స్ ఈవెంట్స్‌లో ఆమె పాల్గొంటారు. అందరికీ థ్యాంక్యూ.’’ అని అన్నారు.
ఎడిటర్ నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ..‘‘సినిమాలో కామెడీ ఎంతగా ఉంటుందో ఎమోషన్ కూడా అంతగా ఉంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా సక్సెస్ అవుతుంది’’ అని అన్నారు.
నటుడు మొయిన్ మాట్లాడుతూ..‘‘ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్, నిర్మాతలకు థ్యాంక్యూ. ఈ సినిమాకు లాస్ట్ కాస్ట్ అయింది నేనే. మా హీరోయిన్స్‌కి తెలుగు రాకపోయినా చాలా బాగా యాక్ట్ చేశారు. మంచులో మైనస్ డిగ్రీస్‌లో చాలా కష్టపడ్డారు. మా బ్యాడ్‌గాళ్స్ త్వరలో విడుదల అవుతుంది’’ అని అన్నారు.
నటుడు సూర్య మాట్లాడుతూ..‘‘నేను హీరో అవ్వాలనే ఆలోచన లేదు. మంచి నటుడు అవ్వాలనేది నా కోరిక. నన్ను ఒక రీల్లో చూసి ఈ సినిమాకు సెలెక్ట్ చేసిన డైరెక్టర్ మున్నాకు థ్యాంక్స్. టీమ్ అందరికీ థ్యాంక్స్. నలుగురు అమ్మాయిల్లో ఒక్కొక్కరిలో ఒక్కో హిడెన్ టాలెంట్ ఉంది.’’ అని అన్నారు.
తారాగణం: అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, రోహన్ సూర్య, మొయిన్
సాంకేతిక బృందం:
దర్శకుడు: మున్నా ధులిపూడి
బ్యానర్స్: నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్వీఎల్ క్రియేషన్స్
నిర్మాతలు: శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: చంద్రబోస్
సినిమాటోగ్రాఫర్: గణేష్
ఎడిటర్: బొంతల నాగేశ్వరరెడ్డి
పీఆర్వో: తేజస్వి సజ్జ