
Sathi Leelavathi Teaser Unveiled
The film ‘Sathi Leelavathi’, starring Lavanya Tripathi Konidela and Dev Mohan in the lead roles, presented by the renowned production house Anandi Arts Creations is being produced by Naaga Mohan under the Durga Devi Pictures banner, The film is directed by Tatineni Satya, known for Bheemili Kabaddi Jattu and SMS (Shiva Manasulo Shruti).
Sathi Leelavathi is a fun entertainer that portrays the relationship between husband and wife not just emotionally but also in a humorous way. On Tuesday, the makers released the movie’s teaser. Going by the teaser, Lavanya and Dev Mohan’s characters are happily married. But in the very next scene, Lavanya is seen tying up and hitting Dev Mohan. Some glimpses of the conflicts between the couple are shown in the teaser. Also, actors V.K. Naresh, VTV Ganesh, Saptagiri, Jaffer, and Motta Rajendran appear to be involved in the husband-wife quarrel. What is the actual conflict? To know that, the audience will have to watch the movie, say the director and producer.
The shooting of Sati Leelavati has been completed, and post-production work is progressing rapidly. The makers are gearing up to finish the film as planned and prepare for its release. The film is being crafted as a feel-good movie that is expected to appeal to audiences from all sections.
The film’s music is composed by Mickey J. Meyer, with cinematography by Binendra Meenon and editing by Sathish Suriya.
Cast :
Lavanya Tripathi Konidela, Dev Mohan, V.K. Naresh, V.T.V. Ganesh, Sapthagiri, Motta Rajendran, Jafar Sadiq, Joshi, and others.
Technical Team:
Presented by: Anandi Art Creations, Banners: Durga Devi Pictures, Producer: Naaga Mohan, Director: Tatineni Satya, Music: Mickey J. Meyer, Cinematography: Binendra Menon, Dialogues: Uday Pottipadu, Art Director: Kosanam Vittal, Editor: Satish Suriya, Pro: Mohan Thummala, Digital Promotions: Yati Digital.
ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సమర్పణలో లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ప్రధాన పాత్రధారులుగా దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై తాతినేని సత్య దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ టీజర్ విడుదల
లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్(శివ మనసులో శృతి) ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు.
భార్య, భర్త మధ్య ఉండే అనుబంధాన్ని ఎమోషనల్‌గానే కాకుండా ఎంటర్టైనింగ్గానూ తెరకెక్కించిన ఫన్నీ ఎంటర్టైనర్ ‘సతీ లీలావతి’. మంగళవారం రోజున మేకర్స్ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌ను గమనిస్తే లావణ్య, దేవ్ మోహన్ జంట పెళ్లి చేసుకుని ఆనందంగా ఉంటుంది. కానీ నెక్ట్స్ సీన్లోనే దేవ్ మోహన్‌ను లావణ్య కొట్టి కట్టేసుంటుంది. వారి మధ్య జరిగే గొడవకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను టీజర్లో మనం గమనించవచ్చు. అలాగే భార్య భర్తల మధ్య జరిగే గొడవలో వి.కె.నరేష్, వి.టి.వి.గణేష్, సప్తగిరి, జాఫర్, మొట్ట రాజేంద్రన్ ఎందకు ఇన్ వాల్వ్ అయ్యారు. అసలు గొడవేంటి? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందేనంటున్నారు దర్శక నిర్మాతలు.
షూటింగ్ పూర్తి చేసుకున్న ‘సతీ లీలావతి’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అనుకున్న ప్లానింగ్ ప్రకారం మేకర్స్ సినిమాను శరవేగంగా పూర్తి చేసి సినిమాను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫీల్ గుడ్ మూవీగా అందరినీ ఆకట్టుకునేలా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఈ మూవీకి సంగీత దర్శకుడిగా మిక్కీ జే మేయర్, కెమెరామెన్‌గా బినేంద్ర మీనన్, ఎడిటర్‌గా సతీష్ సూర్య పని చేస్తున్నారు.
నటీనటులు :
లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్, వి.కె.నరేష్, వి.టి.వి.గణేష్, సప్తగిరి, మొట్ట రాజేంద్రన్, జాఫర్ సాదిక్, జోషి తదితరులు
సాంకేతిక వర్గం:
సమర్పణ: ఆనంది ఆర్ట్ క్రియేషన్స్
బ్యానర్స్: దుర్గాదేవి పిక్చర్స్
నిర్మాత: నాగ మోహన్
దర్శకత్వం: తాతినేని సత్య
సంగీతం: మిక్కీ జె.మేయర్
సినిమాటోగ్రఫీ: బినేంద్ర మీనన్
మాటలు: ఉదయ్ పొట్టిపాడు
ఆర్ట్: కోసనం విఠల్
ఎడిటర్: సతీష్ సూర్య
పి.ఆర్.ఒ: మోహన్ తుమ్మల
డిజిటల్ మీడియా: యతి డిజిటల్