Nadive…Lyrical Song from Rashmika Mandanna’s The Girlfriend to Release on

ఆర్కే నాయుడు లానే విక్రాంత్ ఐపీఎస్ క్యారెక్టర్ కూడా ఆడియన్స్ కి గుర్తుండిపోతుంది – ఆర్కే సాగర్
హీరో ఆర్కే సాగర్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ది 100’. ఈ హై-ఆక్టేన్ క్రైమ్ థ్రిల్లర్‌ను రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. కెఆర్ఐఏ ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కరుటూరి, వెంకి పుషడపు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం జూలై 11న థియేటర్స్ లో విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని, ఘన విజయం సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్ యూ మీట్ నిర్వహించారు.
థాంక్ యూ మీట్ లో హీరో ఆర్కే సాగర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. థాంక్యూ మీట్ పెట్టాలనుకున్నప్పుడు నాకు ముందుగా గుర్తొచ్చింది మీడియా. ఈ సినిమాని చాలా గొప్పగా ఆదరించారు. ఎక్కడ కూడా ఒక నెగిటివ్ రివ్యూ లేకుండా చాలా అద్భుతంగా ప్రోత్సహించారు. అందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సినిమాల్లో ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ అందరూ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ఆర్కే నాయుడు లాగే విక్రాంత్ ఐపీఎస్ క్యారెక్టర్ కూడా ఆడియన్స్ కి గుర్తుండిపోయింది. వెంకయ్య నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి శ్రీధర్ బాబు గారికి ఈ సినిమాకి సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా రెస్పాన్స్ వస్తుంది. ఇంకా మంచి కథలు చెప్పాలనే స్ఫూర్తి ఆడియన్స్ ఇచ్చారు. డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా ఈ సినిమాను తీశారు,హర్షవర్ధన్ రామేశ్వర్ గారు మా సినిమాని తన మ్యూజిక్ తో మరో స్థాయికి తీసుకువెళ్లారు. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఈ సినిమాలో చేసిన ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంది. సినిమాని తప్పకుండా థియేటర్స్ లో వెళ్లి చూడండి. సినిమా డిసప్పాయింట్ చెయ్యదు. ఈ సినిమా నచ్చలేదని ఒక్కరు చెప్పినా సరే నేను దేనికైనా సిద్ధం. అంత నమ్మకంగా చెబుతున్నాను. మీ అందరి ప్రోత్సాహానికి ధన్యవాదాలు’అన్నారు.
రాజా రవీంద్ర మాట్లాడుతూ… అందరికి నమస్కారం. ఒక పోలీసుగా ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ విక్రమ్ ఐపీఎస్ లాగా ఉండాలని అనిపించింది. 100 నాట్ నెంబర్ ఒక వెపన్. సినిమా అందరికీ కనెక్ట్ అయింది. ఇంత మంచి సినిమాని అందించిన ఆర్కే నాయుడు గారికి వారి టీమ్ అందరికీ కంగ్రాచ్యులేషన్స్’అన్నారు.
మిషా నారంగ్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. మా సినిమా గురించి అందరూ చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. ఆడియన్స్ ఈ సినిమా మీద చూపిస్తున్న ప్రేమకి ఆనందంగా ఉంది. ఇలాంటి మంచి క్యారెక్టర్ ని ప్లే చేసిన అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమా చూడండి మీ అందరికీ నచ్చుతుంది’అన్నారు.
డైరెక్టర్ శశిధర్ మాట్లాడుతూ… అందరికి నమస్కారం. మీడియా వారికి థాంక్యూ చాలా అద్భుతమైన రివ్యూస్ ఇచ్చారు. ఈ సినిమాకి మీడియా ప్రేక్షకులు చాలా పెద్ద స్థాయి ఇచ్చారు. మీరు ఇచ్చిన ఈ సపోర్టు తో మరిన్ని మంచి కథలతో మీ ముందుకు రావడానికి మాకు ఒక ధైర్యం వచ్చింది. ప్రేక్షకులు సినిమాని చాలా బాగా ఆదరిస్తున్నారు. చాలా మంచి ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు. అందరూ సినిమాకు వచ్చి మమ్మల్ని బ్లెస్స్ చేయాలను కోరుకుంటున్నాను. సొసైటీలో ఉన్న ఛాలెంజ్ లు గురించి తీసిన సినిమా ఇది. సినిమా చూసిన ఆడియన్స్ ప్రతి ఇంట్లో ఒక విక్రాంత్ లాంటి క్యారెక్టర్ ఉండాలని కోరుకున్నారు. నిజానికి ఆ మాట నాకు చాలా నచ్చింది. సినిమాకి ఎంకరేజ్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సాగర్ గారి వలన నేను డైరెక్టర్ అయ్యాను. ఈ అవకాశం ఇచ్చిన ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’అన్నారు
రమేష్ మాaట్లాడుతూ.. అందరికి నమస్కారం. మీడియా మిత్రులకు చాలా థాంక్స్. సినిమాకు చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు. సినిమాకి అందరూ చాలా కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా లేడీస్ చాలా కనెక్ట్ అవుతున్నారు. డైరెక్టర్ గారు ఫ్యామిలీ ఎమోషన్ క్రైమ్ ఎలిమెంట్స్ ని చక్కగా బ్యాలెన్స్ చేశారు. ఆడియన్స్ చాలా కొత్తగా ఫీల్ అవుతున్నారు. సినిమా చూసిన ఆడియోస్ క్లైమాక్స్‌లో క్లాప్స్ కొడుతున్నారు. సినిమాకి అన్ని వైపుల నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. సాగర్ గారిని తెలుగు ప్రజలు చాలా ఓన్ చేసుకున్నారు. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఈ సినిమాకి సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’అన్నారు.
రాంబాబు గోసాల మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమాని పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు చాలా థాంక్యూ. మంచి రివ్యూస్ ఇచ్చిన మీడియా వారికి థాంక్ యూ హర్షవర్ధన్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. మా డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా సినిమా తీసి సూపర్ హిట్ కొట్టారు. టీమ్ అందరికీ కంగ్రాజులేషన్స్. ఈ సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. అందరూ థియేటర్స్ లో సినిమా చూడాలని కోరుకుంటున్నాను’అన్నారు.