
Idemi Rajyam Song from Police Vaari Heccharika Launched – Movie to Release on July 18th
Renowned writer and Telugu Writers Association President, Paruchuri Gopalakrishna, launched the impactful social anthem “Ide Raajyam” from the upcoming film Police Vaari Heccharika. The film is directed by Babji, known for his progressive storytelling, and is produced by Belli Janardhan under the Thulika Tanishk Creations banner.
Paruchuri Gopalakrishna remarked,
“After a long time, we are seeing a song on the big screen that raises important social questions. What makes this song unique is that it doesn’t promote any political party or ideology—it simply questions injustice in a powerful, thought-provoking way.”
Director Babji said,
“It is a great honor for us to have this song unveiled by a legendary figure like Paruchuri Gopalakrishna garu. His association adds value to our film’s progressive vision.”
Producer Belli Janardhan revealed that the team is aiming for a mid-July release, with the exact date to be announced soon. “This is a commercial film with strong social relevance. It’s made to entertain and engage audiences from all walks of life,” he added.
Cast:
Sunny Akhil, Ajay Ghosh, Ravi Kale, Sayaji Shinde, Shubhalekha Sudhakar, Kashi Vishwanath, Jabardasth Vinod, Jabardasth Pawan, Jabardasth Shanti Swaroop, Himaja, Shankarabharanam Tulasi, Jaya Vahini, Meghana Khushi, and others.
Technical Crew:
Director: Babji
Producer: Belli Janardhan
Production Banner: Thulika Tanishk Creations
Music Composer: Gajwel Venu
Cinematography: Kishan Sagar, Nalini Kanth
Editor: Shiva Sharvani
Co-Producer: N.P. Subbaraoyudu
PRO: Madhu VR
Digital Marketing: Digital Dukanam
పోలీస్ వారి హెచ్చరిక నుంచి ఇదేమీ రాజ్యం సాంగ్ లాంచ్ చేసిన పరుచూరి గోపాల్ కృష్ణ గారు – గ్రాండ్ రిలీజ్ జూలై 18th
పోలీస్ వారి హెచ్చరిక సినిమా లోని సామాజిక చైతన్య గీతాన్ని ఎర్ర అక్షరాల రచయిత , తెలుగు రచయితల సంఘం అధ్యక్షుడు పరుచూరి గోపాల కృష్ణ ఆవిష్కరించారు. అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వం లో రూపొందిన ఈ చిత్రాన్ని తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్ నిర్మించారు.
ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ..చాలా రోజుల తరువాత వెండితెర పైన మళ్ళీ ఇటువంటి అభ్యుదయ గీతాన్ని చూస్తున్నాను ఈ పాటలో ఉన్న గమ్మత్తు వైవిధ్యం ఏమిటంటే ఇది ఏ పార్టీనో ఏ సిద్ధాంతాన్నో ప్రచారం చేసే పాట కాదు ఈ సినిమా కథ ప్రస్తావిస్తున్న ఒకానొక ఘోరాన్ని నిగ్గదీసి ప్రశ్నించే పాట అన్నారు.
చిత్ర దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ… తెలుగు సినీ పరిశ్రమలో భుజం మీద ఎర్ర శాలువాను కప్పుకొని తిరుగుతున్న అభ్యుదయ అక్షరం పరుచూరి గోపాలకృష్ణ గారి చేతుల మీదుగా ఈ ప్రశ్నించే పాట ఆవిష్కరించ బడడం తమ యూనిట్ మొత్తానికి సంతోషాన్ని కలిగిస్తుందని” పేర్కొన్నారు.
చిత్ర నిర్మాత బెల్లి జనార్థన్ మాట్లాడుతూ “సినీ పెద్దలందరి ఆశీస్సులతో మా సినిమా ను జూలై మూడవ వారంలో విడుదల చేస్తున్నాము , త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాము , సమాజం లోని అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే పక్కా కమర్షియల్ సినిమా గా మేము ఈ చిత్రాన్ని రూపొందించాము” అని వివరించారు .
చిత్ర కథానాయకుడు సన్నీ అఖిల్ మాట్లాడుతూ… “తను హీరోగా నటిస్తున్న మొదటి చిత్రం లో రెగ్యులర్ పంథాలో అందమైన కాస్ట్యూమ్స్ తొడుక్కొని ప్రేమ గీతాలు పాడుకుంటూ హీరోయిన్ వెంట తిరిగే పాత్రను కాకుండా సీనియర్ నటులు మాత్రమే పోషించే యాక్టింగ్ సత్తాను చాటుకోవడానికి అవకాశమున్న పాత్రను పోషించే అవకాశం లభించడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను” అన్నారు.
తారాగణం: సన్నీ అఖిల్, అజయ్ ఘోష్, రవి కాలే, షాయాజీ షిండే, శుభలేఖ సుధాకర్, కాశీ విశ్వనాథ్, జబర్దస్త్ వినోద్, జబర్దస్త్ పవన్, జబర్దస్త్ శాంతి స్వరూప్, హిమజ, శంకరాభరణం తులసి, జయ వాహిని, మేఘనా ఖుషి తదితరులు.
సాంకేతిక నిపుణులు :
దర్శకుడు : బాబ్జీ
నిర్మాత : బెల్లి జనార్థన్
బ్యానర్ : తూలికా తనిష్క్ క్రియేషన్స్
సంగీతం : గజ్వేల్ వేణు
కెమెరా : కిషన్ సాగర్, నళినీ కాంత్
ఎడిటర్ : శివ శర్వాణి
సహ నిర్మాత : NP సుబ్బా రాయుడు
పిఆర్ఓ : మధు విఆర్
డిజిటల్ మార్కెటింగ్ : డిజిటల్ దుకాణం