
ఓదెల 2 లో చేసిన తిరుపతి క్యారెక్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది – యాక్టర్ వశిష్ఠ ఎన్. సింహ
తమన్నా భాటియా లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ఓదెల 2. సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’ కి సీక్వెల్ ఇది. సంపత్ నంది సూపర్ విజన్ లో అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ చిత్రం తమన్నా నాగ సాధువుగా అదరగొట్టారు. వేసవిలో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ లలో ఒకటిగా ఏప్రిల్ 17న విడుదలైన ఓదెల2 అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్ర పోషించిన యాక్టర్ వశిష్ఠ ఎన్. సింహ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
మీరు సింగర్ గా కెరీర్ స్టార్ట్ చేశారని విన్నాం ?
– అవును. కన్నడలో పాతిక పైగా సినిమాలకి పాడాను. తెలుగులో సింగర్ గానే ఎంట్రీ ఇచ్చాను. అజినీష్ నన్ను సింగర్ గా లాంచ్ చేశారు. ఓదెల వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నాను.
ఓదెల 2 కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు?
– ఓదెల కోసం బరువు పెరిగాను. వర్క్ ఔట్స్ మానేశాను. ఆ సినిమా పూర్తయిన తర్వాత మళ్ళీ రెగ్యులర్ రొటీన్ లో పడ్డాను. ఓదెల 2 గురించి చెప్పిన తర్వాత మళ్ళీ పాత రొటీన్ లోకి వచ్చాను. కాస్త టాన్ అయ్యాను. ప్రోస్తటిక్ మేకప్ వేసుకున్నాను. ఈవిల్ క్యారెక్టర్ కోసం స్పెషల్ వాయిస్ మాడ్యులేషన్ ప్రాక్టీస్ చేశాను. నా వాయిస్ క్యారెక్టర్ కి ప్లస్ అయ్యింది.
సంపత్ నంది గారు ఈ కథ చెప్పినపుడు ఎలా అనిపించింది?
– సంపత్ నంది గారు అమేజింగ్ ఫ్యామిలీ మ్యాన్. ఆయన ఓదెల 2 ఐడియా చెప్పిన తర్వాత చాలా సర్ ప్రైజ్ అయ్యాను. షాక్ అయ్యాను. కథ విన్న తర్వాత చాలా కొత్తగా అనిపించింది. ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడూ చేయలేదు. ఇలాంటి కథ ఎక్కడా వినలేదు. తప్పకుండా అద్భుతంగా చేయాలని అనిపించింది.
తమన్నా గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
– తమన్నా వండర్ ఫుల్ హ్యూమన్ బీయింగ్. అందరితో కలివిడిగా వుంటుంది. ఇదే మొదటి సినిమా అన్నట్టుగా క్యురియాసిటీతో వర్క్ చేస్తుంది. తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. తన ప్రజెన్స్ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళింది.
మీ క్యారెక్టర్ కి వచ్చిన రెస్పాన్స్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ?
– ఇందులో నేను చేసిన తిరుపతి క్యారెక్టర్ సీన్ లో వున్నా లేకపోయిన తన నామస్మరణ సినిమా అంతా వుంటుంది. ఇందులో కథానాయకుడు ఎవరైనా వుంటే అది తిరుపతి క్యారెక్టర్ అనే చెప్పాలి. ప్రేక్షకులు తిరుపతి క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యారు. ఆ క్యారెక్టర్ కి వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది.
డైరెక్టర్ అశోక్ తేజ గురించి ?
– అశోక్ తేజ మంచి ఫ్రెండ్. పని రాక్షసుడు. చాలా క్లియర్ విజన్ వున్న డైరెక్టర్.
నిర్మాత మధు గారి గురించి ?
– సినిమాని నమ్మి ఎక్కడా రాజీ పడకుండా సినిమాని గ్రాండ్ గా నిర్మించారు. కథకు కావాల్సిన ప్రతిది సమకూర్చారు. హంబలే తర్వాత అంత పాషన్ వున్న ప్రొడ్యూసర్ మధు గారే అనిపించారు.
మీ పాత్రకు ఇండస్ట్రీ నుంచి కాల్స్ వచ్చాయా?
– చాలా మంది కాల్స్ చేశారు. చాలా మంచి ఆఫర్లు వచ్చాయి. పెద్ద పెద్ద బ్యానర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి.
మీరు ఎలాంటి క్యారెక్టర్స్ చేయడానికి ఇష్టపడతారు?
– మనల్ని జనాలు గుర్తుపట్టే క్యారెక్టర్స్ చేయడంపై నా దృష్టి ఉంది. పాజిటివ్, నెగిటివ్.. ఏదైనా మంచి యాక్టర్ అనిపించే పాత్రలు చేయాలని వుంది. ప్రతి పాత్రకు వేరియేషన్ ఉండేలా చూసుకుంటాను.
ఆల్ ది బెస్ట్
– థాంక్ యూ