‘Thala’ Trailer In Telugu & Tamil Launched by Vijay Sethupathi
Amma Rajasekhar, who proved his mettle as a director with the movie Ranam, is once again coming up with a wonderful film. The trailer of this film, which is being made with the title Thala, has received a wonderful response in Telugu. It is noteworthy that Amma Rajasekhar’s son Amma Ragin Raj will be introduced as a hero with this film.
It has also been said from the industry that such a good trailer has not been released in recent times. The latest Tamil trailer of this movie was released by the versatile pan-India actor Vijay Sethupathi. Vijay Sethupathi was also very impressed after watching this trailer.
Vijay Sethupathi praised the movie that it appears like a big range film. He said that making a debut with such a movie will definitely give Ragin Raj a big career. He hoped that this film would be a big success in Tamil.
The film is currently in the promotional phase and the makers are leaving no stone unturned to make it a big hit. Also, the film is doing much better in terms of business than expected. With positive feedback from everyone, the makers are hopeful of a hit. The reason for this is that they think that the film’s content has great potential to become a blockbuster. Thala is being released on the occasion of Valentine’s Day on the 14th of this month. The film is releasing with the title ‘Violent Valentine’ in Telugu.
Director: Amma Rajasekhar
Producer: Srinivasa Goud
Banner: Deepa Arts
Cast: Amma Ragin Raj, Ankita Naskar, Rohit, Esther Noronha, Mukku Avinash, Satyam Rajesh, Ajay, Viji Chandrasekhar, Rajeev Kanakala, Indraja, Shravan and others
Writer: Amma Rajasekhar
DOP: Shyam K Naidu
Song: Thaman SS
Music Director: Dharma Teja, Aslam KE
BGM: Aslam KE
Dialogues: Amma Rajasekhar and Team
Executive Producer: Radha Rajasekhar
Art Director: Ramakrishna
Dance Choreographers: Amma Rajasekhar
Lyricists: Dharma Teja
Editor: Shiva Samy
PRO: Madhu VR
Digital Media: Digital Dukanam
‘తల’ మూవీ తెలుగు అండ్ తమిళ్ ట్రైలర్ రిలీజ్ చేసిన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి
రణం మూవీతో దర్శకుడుగా సత్తా చాటిన అమ్మ రాజశేఖర్ మరోసారి అద్భుతమైన చిత్రంతో వస్తున్నాడు. తల అనే టైటిల్ తో రూపొందుతోన్న ఈ చిత్ర ట్రైలర్ కు తెలుగులో అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంతో అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా పరిచయం అవుతుండటం విశేషం. ఈ మధ్య కాలంలో ఇంత మంచి ట్రైలర్ రాలేదు అనే మాట ఇండస్ట్రీ నుంచి కూడా వినిపించింది. ఇక తాజాగా ఈ మూవీ తమిళ్ ట్రైలర్ ను వెర్సటైల్ ప్యాన్ ఇండియా యాక్టర్ విజయ్ సేతుపతి చేతల మీదుగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ ను చూసిన విజయ్ సేతుపతి సైతం చాలా చాలా ఇంప్రెస్ అయ్యారు. ఓ స్టార్ హీరో రేంజ్ లో కనిపిస్తోంది మూవీ అని ప్రశంసించారు. ఇలాంటి మూవీతో డెబ్యూ ఇవ్వడం అనేది ఖచ్చితంగా రాగిన్ రాజ్ కు చాలా పెద్ద కెరీర్ ను ఇస్తుందని కితాబునిచ్చాడు. తమిళ్ లో ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు.
విజయ్ సేతుపతి వంటి వారి నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో బిజినెస్ పరంగానూ తలా ఊహించిన దానికంటే చాలా ఫ్యాన్సీగా వెళుతోంది. అందుకు కారణం ఈ మూవీ కంటెంట్ లో సూపర్ హిట్ గ్యారెంటీ అనే దమ్ము కనిపిస్తోందనే మాటలు బలంగా వినిపిస్తుండటమే.
ఈ నెల 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ‘తల’ను విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ‘వయొలెంట్ వాలెంటైన్’అనే పేరుతో ప్రమోషన్స్ చేస్తూ విడుదల చేయబోతుండటం విశేషం.
దర్శకుడు: అమ్మ రాజశేఖర్
నిర్మాత : శ్రీనివాస గౌడ్
బ్యానర్: దీపా ఆర్ట్స్
నటీనటులు: అమ్మ రాగిన్ రాజ్, అంకిత నస్కర్, రోహిత్, ఎస్తేర్ నోరోన్హ, ముక్కు అవినాశ్, సత్యం రాజేశ్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ, శ్రవణ్
రైటర్స్: అమ్మ రాజశేఖర్
డీఓపీ: శ్యామ్ కె నాయుడు
సాంగ్: థమన్ ఎస్ఎస్
మ్యూజిక్ డైరెక్టర్: ధర్మ తేజ, అస్లాం కేఈ
బీజీఎం: అస్లాం కేఈ
డైలాగ్స్: అమ్మ రాజశేఖర్ అండ్ టీం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాధ రాజశేఖర్
ఆర్ట్ డైరెక్టర్: రామకృష్ణ
డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్: అమ్మ రాజశేఖర్
లిరిసిస్ట్స్: ధర్మతేజ
ఎడిటర్ : శివ సామి
పీఆర్వో: మధు వీఆర్
డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం